రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

జులై 2004

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!

మే నెల సంచికను అనివార్య కారణాల వల్ల మీ ముందుకు తీసుకురాలేక పోయాం. ఇకముందు అలాటి అవాంతరాలు కలగకుండా జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నాం.

ఈ సంచిక ముఖచిత్రానికి చక్కని ఫోటోను పంపిన శ్రీ గొర్తి బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు.

అమెరికా తెలుగువారికి చిరపరిచితులు, సాహితీవేత్తలు,బహుళశాస్త్రవిశారదులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు ఇకనుంచి ఈ పత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరించబోతున్నారు. వారికి మా హృదయపూర్వక స్వాగతం. ఈ బాధ్యతను వారు అత్యంత ప్రతిభావంతంగా నిర్వహిస్తారనేది నిర్వివాదాంశం. వారి మార్గదర్శనంతో “ఈమాట” ఇంకా సరికొత్త అందాలను సంతరించుకుని క్రమం తప్పకుండా మీకు అందుతుందని మా విశ్వాసం.

రచయిత్రు(త)లు తమ రచనలను ఇప్పటివరకు పంపే విధంగానే submissions@eemaata.comకి పంపించండి. దాన్లో ఏమీ మార్పు ఉండబోదు.

గత ఐదున్నర ఏళ్ళుగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన పాఠకులకు, రచయితలకు , నాతో పాటు ఈ శ్రమలో పాలుపంచుకున్న సహసంపాదకులకు నా కృతజ్ఞతలు.
కె. వి. ఎస్‌. రామారావు

కొత్త సంపాదకుని తొలిమాట

ఐదు వసంతాలు ఈమాట పత్రికని అద్భుతంగా నడిపిన రామారావు, “కాస్త విశ్రాంతి తీసుకుంటాను, ఎవరైనా ఈమాట నడిపితే బాగుండును,” అని అనంగానే, తగుదునమ్మా అనుకుంటూ నేను ముందుకి దూకాను. ఎప్పుడో ఎక్కడో విన్నాను, దేవతలు తొందరపడి ఏ పనికీ దిగరని, రాక్షసులు సాహసించి ప్రతిపనికీ నిర్భయంగా, దూకుడుగా దిగుతారనీ. కాస్తో కూస్తో ఆ రాక్షస అంశ నాలో ఉండి ఉండాలి.

కానీ ఒక్క పాత భయం. చిన్నప్పుడు ఏలూరులో రెండు సంవత్సరాలు ఒక రాజకీయ వారపత్రిక నడిపాం. ఆ రెండేళ్ళూ పూర్తి అయ్యేటప్పటికి ఏ రాజకీయ పార్టీ లోనూ ఒక్కడంటే ఒక్కడుకూడా కనీసం పలకరించే స్నేహితుడిగానైనా మిగల్లేదు. మూడు దశాబ్దాలక్రితం, అట్లాంటాలో వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో నెలవారీ పత్రిక వచ్చేది. అందులో రాసిన స్నేహితులతో సాహిత్య పరంగా నాకు చాలా పేచీలు వచ్చిన మాట వాస్తవం. సుమారు రెండున్నర దశాబ్దాలక్రితం చికాగోలో తెలుగు సంస్థకి ఒక మాసపత్రిక రెండేళ్ళు నడపడం జరిగింది. ఇప్పటికీ కొంతమందికి నామీద కోపం తగ్గలేదు.

“ఈమాట” పరంగా ఆ భయం ఉండక్కరలేదు. అనుభవజ్ఞులు, సమర్థవంతులు అయిన సంపాదక వర్గం వారి అండ, సహకారం, ముఖ్యంగా అదుపు ఉంటుంది. అంతేకాదు. రామారావు విశ్రాంతి తీసుకుంటున్నాడేకాని విరమించటల్లేదనే భరోసా ఉంది. మింజుమలై, చక్కని అమెరికా తెలుగు రచయితల మద్దతు ఉంది. అదీ నాకున్న ధైర్యం. అదేదో సినిమాలో రాక్షసుడు కోరుకుంటాడు, వెయ్యి ఏనుగులు కావాలని. అయ్యబాబోయి అని అనంగానే, చిన్న కోరికగా కనీసం కోటి కోడిగుడ్డులు కావాలంటాడు. అంతపెద్ద కోరికలు నాకు లేవు. “ఈమాట” తరఫున నాకున్నవి చాలా బుల్లి బుల్లి కోరికలే.

ప్రతీ రెండునెలలకీ కనీసం అరడజను ప్రవాసాంధ్రుల ప్రవాసానుభవాలు గుచ్చి ఎత్తి ముచ్చటించే కథలు, రెండో మూడో మెదడుకి పని పెట్టే విమర్శాత్మక వ్యాసాలు, కాస్త పాత మరికాస్త కొత్తల కలయికలతో కథలూ, కవితలు ముఖ్యంగా కొత్త రచయితలనుంచి సరికొత్త రచనలూ కావాలి. తెలుగులో నిష్పాక్షిక సాహిత్య విమర్శ లేకుండా పోతున్నదని వినికిడి. ఆ లోటు తీర్చడానికి తెలుగు డయాస్పోరా రచయితలు ఈమాట ద్వారా ముందుకొస్తే బాగుంటుందని నా ఆశ. అందుకు మీఅందరి సహకారం కోరుతున్నాను.

ఆఖరిగా మరోమాట. పదివేలమందికి పైగా చదువుతున్న ఈమాట లో మీమాట రాయండి. మీకు నచ్చిన రచనలగురించి ఎందుకు నచ్చాయో రాయండి. నచ్చనివి, ఎందుకు నచ్చలేదో, ఏ మార్పులు చేస్తే ఆ రచనలు బాగుండేవో రాయండి. రచయితలని ఉత్సాహ పరచండి. మీమాట ఈమాటకి ఎంతో అవసరం.

నాకు బాగా నచ్చిన ఒక మంచి పద్యం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ హాటకగర్భు రాణి! నిను ఆకటి […]

1

గుర్తుందా గోదారీ?

రచన: వినీల్‌ కుమార్‌ గట్టు

గుర్తుందా గోదారీ?
కార్తీకమాసపుటుదయాల్లో
వణుకుతూ వచ్చి
చేరేవాళ్ళం నీ వొళ్ళో

3

వినాయకుని మనస్థితి

రచన: పెమ్మరాజు వేణుగోపాల రావు

వినాయకుని మనస్సులో
సంకోచాలు సందేహాలు

0

తెలుగు జీవిత చరిత్రలు: కె.ఎన్‌. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు”

రచన: శొంఠి రామారావు, శొంఠి సావిత్రి

ఈ తరం వాళ్ళకి అంతగా పరిచయం లేని స్వీయచరిత్ర కె.ఎన్‌. కేసరి (18751953) “చిన్ననాటి ముచ్చట్లు”. ఆయన అసలు పేరు కోట నరసింహం. కానీ […]

3

వెన్నెల నవ్వింది

రచన: విప్లవ్

సా్వవిు ఆఫీసు జీపు దిగి ఇంట్లోకొస్తూనే తనక్కడే ఉనా్న పలకరించకుండా బెడ్‌ రూమువైపుకెళ్తూ ఉంటే వెన్నెల గమనించింది తన మొఖంలో కనిపిస్తున్న ఉదే్వగాన్ని, చిరాకుని. […]

1

ఆశాజీవులు

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి

రంగు మారింది
కారుమబ్బులు అంటి
తెల్లదనం నల్లముసుగేసింది
వెలవెలపోయింది కాంతి !

0

ఇసక -3

రచన: కనకప్రసాద్

“ఉండండి ఆ మిగిల్నవి చూడ్ణియ్యండీ….అయ్యో ఈ సందులో పడీసేరేటండీ?” అని భాస్కర కుమార్‌ ఆత్రంగా ఆ పెయింటింగ్‌ చుట్టలు విప్పి చూడబోతే “అవెందుకండీ ఇప్పుడు ముందీ కార్డు సంగత్తేల్చండీ?” అని గద్దిస్తున్నాడు ఆతీ ప్రకాష్‌.

0

(ప్రతి)ఘటన

రచన: వెల్చేరు నారాయణరావు

గోడ కడుతున్నారు ఇంతకు ముందో గోడ ఉంది అది దేవుడి గోడ దానిముందు ప్రార్థనలు చేస్తారు కొందరు గట్టిగా దీని వెనకాతల ఏడుస్తారు మరికొందరు […]

0

గెలుపు

రచన: కె. వి. గిరిధరరావు

ఇరవైయేళ్ళుగా అమెరికాలో కంప్యూటర్‌ రంగంలో వివిధ స్థాయిల్లో పని చేసి, కొన్నాళ్ళు స్వంతంగా ఒక వైర్‌లెస్‌ టెక్నాలజీ కంపెనీని నడిపి, ఏడాది క్రితమే స్వదేశానికి తిరిగొచ్చాడు శ్రీవాత్సవ. సౌకర్యవంతమైన అమెరికా జీవితాన్ని, డాలర్లలో జీతాన్ని వొదిలేసి ఇక్కడికెందుకొచ్చారని ఎవరైనా అడిగితే…జన్మభూమిపై మమకారంతో దేశసేవ చేయడానికి వొచ్చానని చెబుతాడు. దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రం అమెరికాలో కంప్యూటర్ల జోరు తగ్గి, ఇండియాలో అవకాశాలు పెరగడంతో…ఇంకాస్త సంపాదించుకోవడానికి తిరిగొచ్చాడు తప్పితే జన్మభూమీ, దేశసేవా ఇవన్నీ కాకమ్మ కబుర్లు అంటారు.

0

గమనం

రచన: విన్నకోట రవిశంకర్

లోపల దీపం వెలగకూడదు
ఎవరి ప్రతిబింబం వారికే
అడ్డు నిలవ కూడదు.

0

వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్‌

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

నూరేళ్ళకు పైబడిన ఆయుర్దాయం ఎవరికైనా చెప్పుకోదగ్గ విషlుం. అటువంటి సుదీర్ఘ జీవితకాలంలో సంగీతకారుడుగా అసామాన్యమైన ేపరు గడించడం మరీ గొప్ప విశేషం. ఇవి రెండూ […]

3

వాయులీనమవుతూ….

రచన: అఫ్సర్

లోపలి ధ్యానంలో మెట్లు కనిపించవు మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని శిఖరం కొసకి చేరుకుంటాం అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి ఈదురుగాలుల హోరులోనో అందీ […]

0

రిమోట్‌ కంట్రోల్‌

రచన: మూలా సుబ్రహ్మణ్యం

India Vs Australia cricket match చూస్తున్నాను.ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ గెలవడం నేను ఉదయాన్నే నిద్ర లేవడం లాంటిదే! ఎప్పుడో గాని జరగదు. ఇరవైరెండేళ్ళ […]

0
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.