రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అమ్మాయీ సీతాకోక చిలుకా

రచన: ఆర్. శాంతసుందరి
మూలం: సుచేతా మిశ్ర
సెప్టెంబర్ 2003

(సుచేతా మిశ్ర ఒరియా కవయిత్రి. పురి బ్లెస్డ్‌ శేక్రమెన్ట్‌ స్కూల్లో ఉపాధ్యాయిని. 4 కవితా సంపుటాలు వచ్చాయి. ఇంగ్లీషు, హిందీ, అస్సామీస్‌ భాషల్లో ఈమె కవితల అనువాదాలు ప్రచురించబడ్డాయి. అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు. శ్రీ ఖేత్రశ్రీ అవార్డు (93), బసంత ముడులి కబితా అవార్డు (95), భుబనేశ్వర్‌ బుక్‌ ఫేర్‌ అవార్డు (97).)

అదేమిటే అమ్మాయీ
నీ గుప్పిట్లో?
తల్లి ప్రశ్న
ఆమె కళ్ళల్లో తెలుసుకోవాలన్న కోరిక

అమ్మాయి కళ్ళల్లో, పెదవుల మీద,
శరీరంలో ఒక అల్లరి చిరునవ్వు

ఇదిగో, చూడమ్మా
ఒక చిన్ని సీతాకోక చిలుక
తెలుపు నీలం రంగుది
నా గుప్పిట్లో!

అమ్మాయి తన గుప్పెట తెరుస్తుంది
సీతాకోకచిలుక గుప్పిట్లో లేదు!

ఇంతకు ముందు ఉందమ్మా అన్నది అమ్మాయి
తోటలో నుంచి తెచ్చాను

తల్లి గుండెల్లోంచి వచ్చింది
ఒక నిట్టూర్పు
బహుశా నిరాశ వల్లనో
కలిగిన పరాజయం జ్ఞాపకంతో
కలిగిన భయంకర దుఃఖం వల్లనో

చూశాను తల్లీ ఒకప్పుడు
నేను కూడా ఆ సీతాకోక చిలుకని
దాని కలలతోనే గడిచింది
సుకుమారమైన కౌమార్యం
భయం భయంగా యవ్వనం

సాహసం లేకపోయింది నాలో
చేయిచాపటానికి!
గుప్పెట బిగించటానికి!!

నువ్వైనా నేర్చుకో
లేకుంటే మాటిమాటికీ
ఇలాగే ఎగిరిపోతుంది

తల్లినే తదేకంగా చూస్తూ ..
కళ్ళలో ఆశ్చర్యం నింపుకుని …

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అమ్మాయీ సీతాకోక చిలుకా

ఇటువంటివే…

  1. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు

సెప్టెంబర్ 2003 సంచికలో ...

  • అమ్మాయీ సీతాకోక చిలుకా
  • చంద్రరేఖావిలాపము:తృతీయాశ్వాసము
  • చంద్రరేఖావిలాపము:ద్వితీయాశ్వాసము
  • చంద్రరేఖావిలాపము:ప్రధమాశ్వాసము
  • తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు
  • నాన్నగారు కట్టిన ఇల్లు
  • నేనూహించని కవిత
  • ప్రయాణం
  • ప్రస్థానం
  • ప్రేమ పెళ్ళి
  • శ్రీ మేడసాని మోహన్‌గారి అష్టావధాన విశేషాలు
  • శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు
  • సెప్టెంబర్ 2003
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నేనూహించని కవిత
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.