డా. పుల్లెల శ్రీరామచంద్రుడు (24 అక్టోబర్ 1927 - 24 జూన్ 2015): సంస్కృతాంగ్లాంధ్రహిందీ భాషలలో, వేదాంత వ్యాకరణ అలంకారశాస్త్రాలలో అద్వితీయమైన పాండిత్యప్రతిభతో నూటయాభైకి పైగా పుస్తకాలు వ్రాసి, సంస్కృతభాష నుండి ఎన్నో క్లిష్టమైన రచనలను తెలుగు లోకి అనువాదం చేసిన కవి, రచయిత, లాక్షణికుడు, విమర్శకుడు, అలంకారికుడు, వైయాకరుణి, నైఘంటికుడు, సంస్కృతాంధ్ర భాషాసాహిత్యాలకు ఇతోధికంగా సేవ చేసిన మహనీయుడు, డా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఇక లేరు. 1927లో జన్మించిన శ్రీరామచంద్రుడు హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో…
శీర్షికలు ముందుమాట
కోనసీమని తలచుకుంటే ఇప్పటికీ కొబ్బరి తోటలు, కాలువలు, పచ్చని పొలాలు - ఇవే గుర్తొస్తాయి. ఈ సీమ నుంచి బయటపడి ఇంగ్లీషు చదువులు చదువుకుని పైకొచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నా కానీ, వేదపారాయణులు, నిత్యాగ్నిహోత్రులు అయిన అతి కొద్దిమంది బ్రాహ్మణులు ఈ ప్రాంతంలో ఇంకా వున్నారు. భమిడిపాటి వారు, బులుసు వారు, దువ్వూరి వారు, పుల్లెల వారు, ఇలా. వేదపఠన పాఠనాన్ని , యజ్ఞయాగాదులని శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటూ ఈ కుటుంబాల వాళ్ళు మూడువేల ఏడువందల సంవత్సరాల వైదిక…
ఒక సమాజపు ఔన్నత్యం, ఆ సమాజం తన స్త్రీలు, పిల్లలు, వృద్ధులతో ఎలా ప్రవర్తిస్తుంది అన్న అంశంపై ఆధారపడి వుంటుందని వాడుక. వీరితో మనం ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకూ తెలుసు. ఇప్పుడు ఈ జాబితాలో మనదేశపు రచయితలనూ కళాకారులనూ చేర్చవలసి రావడం దౌర్భాగ్యం. సంస్కృతి పేరుతో స్త్రీల పైన, మనోభావాలు దెబ్బ తింటున్నాయన్న నెపంతో రచయితలు, కళాకారుల పైన, తమ ఆత్మన్యూనతను కప్పి పుచ్చుకునేందుకు ఈ సంస్కృతీరక్షకుల దౌర్జన్యం రానురానూ దుర్భరమవుతున్నది. వీరికి మాత్రమే సమాజపు…
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!! ఆలన్ ట్యూరింగ్(23 జూన్ 1912 – 7 జూన్ 1954): కంప్యూటర్లు మన జీవితాలని ఊహించని విధంగా మార్చేశాయి. మన ఆలోచనలని, అనుభవాలని, మన విద్యవైద్యావైజ్ఞానిక విధానాలకు, పరిశోధనలకు మునుపెన్నడూ లేనంత ఊతం ఇచ్చాయి, మన ప్రస్తుత కాలాన్ని సాంకేతిక యుగం అని పిలుచుకునేంతగా కంప్యూటర్లు మానవాళిని ప్రభావితం చేశాయి. ఐతే, వీటి ఆవిర్భావానికి ట్యూరింగ్ మెషీన్ అని పిలవబడే ఒక ఆలోచన, ఒక యంత్రం కాని యంత్రం ఆధారం…
తమ అనుభవాలు ఆలోచనలు భావుకతతో బాధతో ఆవేశంతో ప్రేమతో పదిమందికీ పంచుకుందామనీ, సమాజానికి దిశానిర్దేశనం చేద్దామనీ, కవిగా గొప్ప పేరు తెచ్చుకుందామనీ ఎందరో ఉత్సాహపడుతుంటారు. కానీ వీరికి ఇప్పటిదాకా ఆచరణలో పెట్టగలిగే సూచనలిచ్చి వారిని ప్రోత్సహించే దిశగా ఏ ప్రయత్నమూ లేకపోవడం విచారకరం. సాహిత్యంపై తన అపోహలను బాహాటంగా ఒప్పుకుంటూ, వాటికి ప్రాయశ్చిత్తంగా కవి కావాలనుకునే వారు వెంటనే పాటించగలిగే సూచనలిస్తూ మాధవ్ మాౘవరం రాసిన బోధనాత్మక సోదాహరణ వ్యాసం కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్…
చేకూరి రామారావు (1 అక్టోబర్ 1934 - 24 జులై 2014): చేరాగా సుపరిచితమైన భాషాశాస్త్రవేత్త ఆచార్య చేకూరి రామారావు ఇక లేరు. నోమ్ చామ్‌స్కీ భాషాసిద్ధాంతాలని తెలుగు భాషకు అనువర్తించి చేసిన పరిశోధనలకు కార్నెల్ యూనివర్సిటీ నుండి భాషాశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్న చేరా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. భాషాశాస్త్ర పరిశోధకుడిగా తెలుగు వాక్యం, భాషాంతరంగం, భాషాపరివేషం వంటి ఎన్నో పుస్తకాలు వెలువరించారు. చేరాతలు శీర్షిక ద్వారా తెలుగులో ఎందరికో కవులుగా గౌరవం కల్పించారు. వచన…
కవి బిల్హణుడు 11వ శతాబ్దపు కాశ్మీర కవి. చోరపంచాశికా అనే ప్రేమకవిత ద్వారా జగత్ప్రసిద్ధుడు. కావ్యకథనమైన ఈ కవి ప్రణయోదంతాన్ని ఒక చక్కటి పద్యనాటికగా సాహిత్యపునఃసృష్టి చేసిన తిరుమల కృష్ణదేశికాచార్యుల రచన, బిల్హణీయము; తెలుగు పద్యాలలో అన్నిటికన్నా ఎక్కువ భావక్లిష్టత ఉన్న పద్యంగా ఒక పద్యంపై తన నిర్ణయాన్ని వివరిస్తున్న ఏల్చూరి మురళీధరరావు వ్యాసం ఆంధ్రవాఙ్మయంలో అత్యంత ప్రౌఢమైన పద్యం!; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం అమ్మా కనకమ్మా; ప్రముఖగాయకుడు, మాధవపెద్ది సత్యం ప్రత్యేక జనరంజని కార్యక్రమం, లలితగీతాల…
బ్రౌన్ దొర! తెలుగుభాషోద్ధారకుడు! తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన మహనీయుడు! కేవలం ఇలానే మనకు తెలిసిన సి.పి. బ్రౌన్ (ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్, 1798-1884) గురించి ఇప్పటికీ మనం వర్ణించుకుంటున్నాం. గడిచిన ఇన్నేళ్ళలో కవిపండితులు, మేధావులు మొదలుకొని విశ్వవిద్యాలయాల ఆచార్యుల దాకా ఇలా బ్రౌన్ గురించి వందిమాగధుల స్తోత్రాలు చదివిన వారే, పోటీలు పడి మరీ అతన్ని కీర్తించిన వారే కానీ, చారిత్రక దృష్టితో తెలుగు భాషలో బ్రౌన్ చేసిన పనులేమిటి, బ్రౌన్ ఉద్దేశాలేమిటి, తెలుగు…
తమ మనోభావాలు గాయపడుతున్నాయని, తమ సంస్కృతిని అవమానించారని, ఇలా అర్థం లేని ఆరోపణలతో విద్యావేత్తలు, రచయితలు, కళాకారులపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా అడ్డుకోకపోగా, వ్యక్తిస్వేచ్ఛను మరింత నియంత్రించే విధంగా నాయకులు, ప్రభుత్వాలు ప్రవర్తించడం గర్హణీయం. నాగరిక సమాజంలో తమ అభివ్యక్తిని -- అది ఎంత సమాజవ్యతిరేకమైనా సరే, నిర్భయంగా ప్రకటించే హక్కు ప్రతివారికీ నిర్ద్వంద్వంగా ఉండి తీరాలి; అంతే ముఖ్యంగా ఆ అభివ్యక్తాన్ని విమర్శించే హక్కు కూడా. విమర్శకు ఎవరూ అతీతులు కారు, కారాదు. కానీ, నిజాలని…
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!! ఈమాట నవంబర్ 2013 సంచికలో ప్రచురించిన ఏల్చూరి మురళీధరరావు సాహిత్యవ్యాసం పైన పాఠకులు ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ సంచికలో ఆ వ్యాసానికి ప్రతిగా తమ విమర్శలను వ్యాస రూపంలో జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. ఇలా సాహిత్య వ్యాసాలపై స్పందనలు, ప్రతిస్పందనలు సామరస్యంగా తెలుపుకోవడం మాకెంతో సంతోషం కలిగిస్తున్నది. ముందు ముందు ఇలాంటి సాహిత్య చర్చలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి సంచికలో కొత్త…
ఎస్. మీనాక్షిసుందరం (12 అక్టోబర్ 1913 - 13 ఆగస్ట్ 1968): గణితశాస్త్ర ప్రపంచంలో పేరెన్నిక గన్న ప్రతిభావంతులలో ఒకరైన ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం శతజయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని పరిచయం చేస్తూ, గణితంలో ఆయన విశేషకృషిని వివరిస్తూ వాసుదేవరావు ఎరికలపూడి రాసిన శాస్త్రీయ వ్యాసం, ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షి సుందరం; నన్నెచోడుని కుమారసంభవంలో లలితాస్యాంబురుహంబు పద్యం గురించి మానవల్లి రామకృష్ణకవి విమర్శను ప్రస్తావిస్తూ ఆ వివాదం ఆ కావ్యపు కర్తృ - కాల నిర్ణయాలకు ఎలా…
ఈ సంచికతో ఈమాటను సాంకేతికంగా మరిన్ని సదుపాయాలు కలిగిన సరికొత్త వర్డ్‌ప్రెస్ లోకి మార్చాం. అందుకు అణుగుణంగా, పాఠకుల సౌకర్యం కోసంగా ఈమాట వెబ్‌సైట్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. పాఠకులందరికీ చిరపరిచితమైన ఈమాట వేషాన్ని మరికొంత మెరుగు పరిచాం; మీకు నచ్చిన రచనని మీ మిత్రులతో ఫేస్‌బుక్, గూగుల్+, ఈ-మెయిల్ ద్వారా వెంటనే పంచుకునే వీలు; ఒక రచయిత రచన చదివే పాఠకులకి ఆ రచయిత ఇతర రచనలు కనిపించే అమరిక; ముఖపత్రంలో పాత…
మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం లిపి పుట్టుక -- రాత ద్వారా మానవుడు సమాచారాన్ని పంచుకోవడం. ఆ రాత పుట్టుక, పెరుగుదలల పూర్వోత్తరాలను ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ వివరిస్తున్న సమీక్షా వ్యాసపు మొదటి భాగం రాత పుట్టుక, పరిణామం: 1. పాశ్చాత్య ప్రపంచం; భగవంతం కవిత త్రిపురాత్రి... త్రిపురహిత పగలు ఇటీవలే కీర్తిశేషుడైన కవి, రచయిత త్రిపుర జ్ఞాపకంలో కనకప్రసాద్ అవధారు; కవి, పుస్తకం, కర్తృత్వం…
పి. బి. శ్రీనివాస్ (22 సెప్టెంబర్ 1930 - 14 ఏప్రిల్ 2013): పిబిఎస్‌గా సంగీతాభిమానులకు చిరపరిచితుడు, దక్షిణభారత సినీసంగీతానికి కలికితురాయి అయిన ప్రతివాద భయంకర శ్రీనివాస్ కేవలం గాయకుడే కాదు, బహుభాషాకోవిదుడు, సాహిత్యవేత్త కూడా. సహృదయుడు, అజాతశత్రువు, ఆయన స్మృతికి నివాళిగా జెజ్జాల మోహనరావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, పరుచూరి శ్రీనివాస్‌లు సమర్పిస్తున్న బహుభాషా సినీగీతభరిత వ్యాసం ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్; ఆ సంగీత కళానిధి జీవితాన్ని, ఆయన ఛందో విజ్ఞానాన్ని సంగ్రహంగా పరిచయం చేస్తూ ఏల్చూరి…
అనాదిగా స్త్రీని ఎన్నో రకాలుగా చిత్రకారులు చిత్రిస్తున్నారు. అయితే, ఏ చిత్రం స్త్రీ అంతరంగాన్ని కూడా చూపిస్తుంది, ఏ చిత్రం స్త్రీని కేవలం ఒక విలాసవస్తువుగానే గమనిస్తుంది, చిత్రకళా చరిత్రలో స్త్రీ మూర్తి చిత్రానికి ఉన్న విశిష్టత ఏమిటి -- వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన సచిత్ర వ్యాసం ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి; భారతీయ సాహిత్యంలో వాస్తవికత పాశ్చాత్య సాహిత్య విమర్శకు ఎందుకు అందదో సత్య మొహంతితో ముఖాముఖీ-1: సాహిత్యంలో వాస్తవిక వాదం భరణి కొల్లిపర…
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!! వెల్చేరు నారాయణ రావు (జననం: ఫిబ్రవరి 1, ప్రతి ఏడు కొత్తగా) ఈమాటకి ఆప్తుడు, ఆత్మీయుడు, అంతకంటే ముందు మామంచి నేస్తం. పుస్తకాలు చదువుకోడమన్నా, అందరితో కలిసి కూర్చుని వాటి కబుర్లు చెప్పుకోడమన్నా ఆయనకు గొప్ప సరదా. కానీ అదే సరదా ఇలా ఎనభయ్యో వడిలో పడిపోడంలో చూపిస్తాడని మేం అనుకున్నామా! ఈ సాహిత్యపు రాలుగాయి తెలుగు సారస్వతానికి ఏం చేశాడో, చేస్తున్నాడో స్థాలీపులాక న్యాయంగా మీకు రుచి చూపిద్దామని…
ఆధునిక వర్ణచిత్రకళను సమూలంగా మార్చివేసిన క్యూబిౙమ్ పద్ధతికి ఆద్యులైన బ్రాక్, పికాసో ద్వయంలో ఒకరిగా, ఇరవయ్యవ శతాబ్ది మేటి చిత్రకారుల త్రయం, బ్రాక్, పికాసో, మథీస్‌లలో ఒకరిగా ప్రసిద్ధి కెక్కిన చిత్రకారుడు జ్యార్జ్య్ బ్రాక్. ఆ మహోన్నత చిత్రకారుడు బ్రాక్ గురించి ఎస్. వి. రామారావు వ్రాసిన వర్ణ చిత్ర సహిత సమగ్ర వ్యాసం; సుశ్రావ్య పద్యపాఠి జువ్వాడి గౌతమరావు గానం చేసిన రుక్మిణీ కళ్యాణం; బహుముఖ ప్రజ్ఞాశాలి, నటి, గాయని, క్రీడాకారిణి టి. జి. కమలాదేవి…
జయంతితే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషామ్ యశః కాయే జరా మరణజమ్ భయమ్! శాస్త్ర , కళా రంగాల్లో ఎనలేని కృషిచేసి ధృవతారలల్లే దారి చూపిన ఏ కొద్దిమందో మాత్రమే పార్థివ శరీరాన్ని ఒదిలి వెళ్ళిపోయినా యశఃకాయులై మనమధ్యే ఉండిపోతారు. అటువంటి మహామహుడు, తెలుగువారు గర్వించదగ్గ ద్రావిడ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఇటీవలే అస్తమించారు. ఆచార్య కృష్ణమూర్తి, విశిష్ట ప్రతిభాసంపన్నులు. భాషాశాస్త్రంలో తమ విశేషమైన కృషితో అంతర్జాతీయ స్థాయిలో మన్ననలందుకున్నవారు. తమ వెలుగుతో ప్రపంచపు…
పాబ్లో పికాసో, సాల్వడోర్ డాలి, ఎడ్గార్ డెగా, వాసిలీ కాండిన్‌స్కీ తదితరుల సరసన సమాన స్థాయిలో నిలబడిన చిత్రకారుడు ఎస్. వి. రామారావు. భారతీయ చిత్రకళా పద్ధతులను యూరోపు నైరూప్య చిత్రకళతో రంగరించి తనదంటూ ఒక ప్రత్యేకమైన భావప్రకాశకత్వాన్ని సాధించుకున్న రంగులకవి. చిత్రకారుడు, కవి, వ్యాసకర్త అయిన రామారావు కళాజీవన పరిణామాన్ని పరిచయం చేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన వ్యాసం, నైరూప్యచిత్ర కళాయాత్రికుడు; చారిత్రక నవల లక్షణాల పరిశీలన, చర్చ కోసంగా మూడు ప్రత్యేక వ్యాసాలు…
ఆషాఢ మాసం కాకపోయినా, మధ్యాహ్నాలు ఆకాశమంతా నల్లమబ్బులు నిండిపోయి ఉరుములూ, మెరుపుల జడివానలు మనల్ని అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి ఇప్పటికే. వాటిని చూసేనేమో, కృష్ణ మోహన రావు గారు, కాళిదాస విరచిత మేఘదూతంపై వ్రాసిన ఛందోవ్యాసం ఆషాఢస్య ప్రథమ దివసే ఈ సంచికలో ప్రత్యేకం. ఈ వ్యాసానికి యక్షుడి చిత్రాలను అందించినది ఔత్సాహిక చిత్రకారుడు మాగంటి వంశీమోహన్‌గారు. అంతే కాదు, ఈ వ్యాసానికి తోడుగా పరుచూరి శ్రీనివాస్ సేకరించిన మేఘసందేశం ఆడియో రూపకం కూడా ప్రత్యేకమే. బాలాంత్రపు రజనీకాంత…