విడిపోయే పొగమంచు రూపం సన్నని సన్నని రవం లీలగా దూరంగా వీణ శ్రుతి చేస్తున్న సవ్వడి.. ఇటురావా?ఇటురావా.. అన్న పిలుపులు గూటిలో వడిగిన పక్షులు […]

పనికిరాని మాటలతో ప్రపంచం మూగదైపోయింది భరించలేని వెలుగులతో ప్రపంచం చీకటైపోయింది ఊహించలేని వేగాలతో ప్రపంచం చిన్నదైపోయింది . నిదురపో చిన్నీ..నిదురపో వలసకొంగల్లా చుట్టూవాలిన మనుషులను […]

మీ కొళాయి..గరగర కసరదు మొహం చిట్లించుకోదు కోపగించుకోదు ధ్యానముద్రలో..ఒకేధార! నురగలు గిరగిర తిరిగే నిండిన బిందెను ఎత్తుకోవడమే మీకు తెలుసు అసలు నిండని బిందె […]

చెలమ..లో నీరు చేతులతో ఎత్తిపోసినకొద్దీ, చెమ్మ ఇసుకను విరుస్తూ ఊరతాయి. విశ్రమించిన గవ్వలు సూర్యరశ్మిని పీలుస్తాయి. అల్లరిపిల్లల మోకాళ్ళు దోక్కుపోయిన ప్రతిసారి, దుమ్ముకలిసిన రక్తంతో […]

అమ్మా,నీ జ్ఞాపకం ఫొటోలా దుమ్ము పడుతోంది. ఒకప్పుడు వేల చిత్రాలై నన్ను ఉక్కిరిబిక్కిరిచేసిన జ్ఞాపకం అంతులేని చలన చిత్రమై నా కళ్ళల్లో కదలాడిన జ్ఞాపకం […]

ఎప్పుడో నేను ఫోటో తీసేదాకా నీ బాల్యం ఉంటుందిరా, బాబూ ! మంచులా, మైనంలా, మౌనంగా కరిగిపోతుంది. బాల్యం ఒక ప్రవాహం వెళుతూ, వెళుతూ […]

చిరునవ్వు చారల చొక్కాని తిరగేసి తొడుక్కుని రోజూ అందరూ తిరిగే రోడ్డును దాటుకు వెళిపోయావు. గిరికీల నీ పాట ఎరలేని గాలంలా వేలాడుతుంది.

మాటలన్నీ ఆపి గదిలోకి ప్రవేశిస్తాను. రైలు పట్టాల మీద ఒకటే ఆలోచన మీసాలు దువ్వుతుంది బొద్దింక అలమరాలో చదవని పుస్తకం ఉత్తరాలు రాయడం మానేశాను […]

రసమయ ఘడియల్లో రహస్యవీణ శ్రుతిచేసింది నీవేనా చిన్నీ? మెరిసిపోయే కన్నులలో మల్లెపూలు దాచుకొంది నీవేనా చిన్నీ? తేలిపోయే మాటలతో తీపితీపి కాలాన్ని రచించింది నీవేనా […]

ఉదయపు చీకట్లో ఒక గాలి తెర కొబ్బరి చెట్టు జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి, నిట్టూర్చి శెలవు తీసుకుంటోంది. అవి విడిపోవడాన్ని ఎవరు గమనిస్తున్నారు ? […]

కొన్నిసార్లు ఆడకుండానే విరమించవలసి వస్తుంది. సకలాలంకారాలూ చేసుకొని సర్వ సన్నద్ధంగా ఉన్నా, నీ పాత్ర రాకండానే నాటకం ముగింపుకొచ్చేస్తుంది. నూరిన నీ కత్తి వీరత్వాన్ని […]

(తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం (శ్రీనాథుడి శృంగారనైషథం విషయంలో తప్ప) ఐతే పెద్దన […]

తేనెటీగలు లేచిపోతాయి… కబోదికళ్ళతో మైనం తుట్టె మిగిలిపోతుంది విందు ముగిసిపోతుంది… ఖాళీగాజు గ్లాసు స్వగతం వినిపిస్తుంది బస్సూ బయలుదేరి వెళ్ళిపోతుంది… అరటితొక్క కాలుజారి పడే […]

భారీ వాహనాలను అనుమతించకు కూలే వంతెనల మీద.. బలహీనంగా ఊగే వంతెనల మీద భారీ వాహనాలకు ఎదురు నిలువకు.. వేగ నిరోధాలు మరీ అన్ని […]

దినపత్రికలు.. తెల్లవారగనే అక్షరాలు సింగారించుకొని వాకిట్లో కొచ్చిపడుతూ ఉంటాయి రోజు గడవగానే..అటకమీద..అలమరాలో గుట్టలుగుట్టలుగా పేరుకుపోతుంటాయి సంవత్సరం పూర్తిగానైనా గడవకముందే తప్పు చేసినట్లు తలవంచుకొని కొత్త […]

ఒక ఊరితో సంబంధం హఠాత్తుగా తెగిపోతుంది. ఆప్యాయం గా ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్న బంధం స్ప్రింగులా విడిపోతుంది. అనుకోకండా ఆకాశం రంగులు మార్చినట్టుగా, […]

మూత విప్పగానే అత్తరులా గుప్పున గుబాళించడం నాకు తెలీదు. తలుపు తియ్యగానే ఏ.సి.లా ఊహించని స్నేహపు చల్లదనంతో ఉక్కిరి బిక్కిరి చెయ్యడం నాకు చేతకాదు. […]

ప్రతిబింబం కదలదు నీ వంకే చూస్తుంటుంది అద్దాన్ని బద్దలు కొట్టినా.. అతుక్కున్న ఏదో ముక్కలో తొంగి చూస్తూనే ఉంటుంది. శిల్పంగా మారిన ప్రతిబింబం కదలక […]