కల్యాణి రాగం – అనుబంధం

[ఈమాట జనవరి 2001 సంచికలో డా. విష్ణుభొట్ల లక్ష్మన్న కల్యాణి రాగం గురించి రాసిన వ్యాసానికి ఈ వ్యాసం ఆడియో అనుబంధం వంటిది. దాన్నొకసారి చదివి ఆ తరవాత ఇందులోని పాటలను వింటే ఉపయోగకరంగా ఉంటుంది.]

లక్ష్మన్న చెప్పినట్టుగా కల్యాణి రాగం 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుంచి జనించిన రాగం. కల్యాణి సంపూర్ణరాగం. అంటే ఆరోహణలోనూ, అవరోహణలోనూకూడా ఏడు స్వరాలూ ఉపయోగించే రాగం. మూలస్వరాలైన “స”, “ప” లు కాక ఉపయోగించే స్వర స్థానాలు చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. హిందుస్తానీ పద్ధతిలో చెప్పాలంటే రి (2) గ (2) మ (2) ధ (2) ని (2) స్వరాలన్నీ “తీవ్రమైనవి” (షార్ప్). కల్యాణి రాగంలోని ప్రసిద్ధమైన ఆదితాళ వర్ణం “వనజాక్షిరో” మదురై సోమసుందరం పాడగా వినవచ్చు.

పాశ్చాత్యసంగీతంలో దీన్ని లిడియన్ స్కేల్ (Lydian Scale)అంటారు. హిందుస్తానీలో ఈ రాగాన్ని “యమన్” లేదా “కల్యాణ్” అంటారు. అందులో ఆరోహణలో స, ప స్వరాలను సామాన్యంగా ఉపయోగించరు. “యమన్ కల్యాణ్” అనేది దీనికి దగ్గరి రాగం. అందులో అప్పుడప్పుడూ శుద్ధమధ్యమం (మ1) కూడా పలుకుతుంది.

కల్యాణి సినీ సంగీతదర్శకులు విరివిగా వాడుకున్న రాగం. విప్రనారాయణ సినిమాలో రాజేశ్వరరావు భానుమతి చేత కర్ణాటక పద్ధతిలో ఒక పాటనూ (రారా నాసామి), హిందుస్తానీ పద్ధతిలో ఒక పాటనూ (సావిరహే) అద్భుతంగా పాడించాడు. శైలిలోని తేడాలను వాటిద్వారా ఎవరైనా కొంత వరకూ తెలుసుకోవచ్చు. అలాగే పెండ్యాల స్వరపరిచిన జయభేరి సినిమాపాట (మది శారదాదేవి) కర్ణాటక శైలిలో చేసినది.

ఈ రాగానికి లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. కొన్నిటిని చూడండి.

కల్యాణి రాగంలోని కొంత కర్ణాటక సంగీతం

 1. కల్యాణి ఆలాపన (బాలమురళీకృష్ణ)
 2. కల్యాణి ఆలాపన (ద్వారం వెంకటస్వామినాయుడు)
 3. నిన్ననవలసినదేమి — త్యాగరాజు, బాలమురళీకృష్ణ
 4. నను బ్రోవమని— రామదాసు, బాలమురళీకృష్ణ
 5. ఏ తావునరా (ఈమని శంకరశాస్త్రి వీణ)

హిందుస్తానీ సంగీతంలో యమన్ కల్యాణ్

 1. హీరాబాయి బడోదేకర్ గాత్రం
 2. అమీర్ ఖాన్ గాత్రం
 3. బుద్ధాదిత్య ముఖర్జీ సితార్
 4. పన్నాలాల్ ఘోష్ వేణువు

హిందుస్తానీ కర్ణాటక జుగల్‌బందీ

 1. భీమ్‌సేన్ జోషీ, బాలమురళీకృష్ణ వీడియో

కొన్ని పాత తెలుగు సినిమాపాటలు

 1. జగమే మారినది (దేశద్రోహులు) యమన్ కల్యాణ్
 2. తలనిండ పూదండ (ఘంటసాల)
 3. మనసున మల్లెల (మల్లీశ్వరి)
 4. మది శారదాదేవి (జయభేరి)
 5. పెనుచీకటాయే (మాంగల్య బలం) యమన్ కల్యాణ్
 6. జోరుమీదున్నావు (శివరంజని)
 7. చల్లని వెన్నెలలో (సంతానం)
 8. మనసులోని కోరిక (భీష్మ)
 9. తోటలో నా రాజు (ఏకవీర)
 10. శ్రీరామ నామాలు (మీనా)
 11. పాలకడలిపై (చెంచులక్ష్మి) యమన్ కల్యాణ్
 12. కుడి ఎడమైతే (దేవదాసు)
 13. కిలకిల నవ్వులు (చదువుకున్న అమ్మాయిలు) యమన్ కల్యాణ్
 14. దొరకునా ఇటువంటి (శంకరాభరణం)
 15. సలలిత రాగ (నర్తనశాల)
 16. రారా నాసామి (విప్రనారాయణ)
 17. పెళ్ళిచేసుకొని (పెళ్ళిచేసి చూడు)
 18. పూవైవిరిసిన (తిరుపతమ్మ కధ)
 19. రావే నా చెలియా (మంచిమనసుకు మంచి రోజులు)
 20. హాయి హాయిగా (వెలుగు నీడలు)
 21. సా విరహే (విప్రనారాయణ) యమన్ కల్యాణ్
 22. నల్లని వాడా (రావు బాలసరస్వతి)

కొన్ని పాత హిందీ సినిమాపాటలు

 1. భూలీ హుయీ యాదో (ముకేశ్)
 2. జారే బద్‌రా బైరీ (లతా)
 3. దిలే బేతాబ్‌కో (రఫీ, సుమన్ కల్యాణ్‌పుర్)
 4. ఏ హుస్న్ జరా (రఫీ) యమన్ కల్యాణ్
 5. జిందగీ భర్ నహీఁ (రఫీ) యమన్ కల్యాణ్
 6. మన్‌రే (రఫీ) యమన్ కల్యాణ్
 7. రే మన్ సుర్‌మేఁ (మన్నాడే, ఆశా) యమన్ కల్యాణ్
 8. జబ్ దీప్ జలే (యేసుదాస్, హేమలత) యమన్ కల్యాణ్
 9. ఆఁసూ భరీ హైఁ (ముకేశ్) యమన్ కల్యాణ్
 10. పాన్ ఖాయే సైయాఁ (ఆశా)
 11. జియా లేగయో (లతా)
 12. మౌసమ్ హై (లతా)
 13. మైఁ క్యా జానూఁ (సైగల్) యమన్ కల్యాణ్
 14. రంజిష్ హీ సహీ (మెహ్‌దీ హసన్) యమన్ కల్యాణ్

సంగీతం ఇష్టపడేవారు కొందరు “రాగాలను ఎలా గుర్తుపట్టాలి?” అని అడుగుతూ ఉంటారు. ఈ వ్యాసంలో ఉదహరించిన పాటలన్నిటినీ జాగ్రత్తగా వింటే కల్యాణి రాగం గురించిన అవగాహన ఏర్పడుతుంది. ఏ రాగంలోనైనా కూర్చబడ్డ సంగీతాన్ని అదేపనిగా వింటూఉంటే దాని లక్షణా లెటువంటివో తెలుస్తాయి.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...