మాండలిక వృత్తిపద కోశాల విషయం భద్రిరాజువారి మౌలిక పరిశ్రమ ఫలితం.

ఇంతటి మహత్తర కోశాన్ని సంకలనం చేసిన శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిగారికీ, ఆ పని వారికే అప్ప చెప్పి ఓపికతో చేయించుకొని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిని మరొకమారు అభినందిస్తున్నాను. మరొకమారు చాలదు. పిదప వేరొక మారు, ఆ తరువాత ఇంకొకమారు అభినందించాలి.

తెలుగులో ఆలోచనా రంగం బలంగా ఏర్పడటానికి కృషి చేసిన వారిలో కృష్ణమూర్తిగారు చాలా పెద్దవారు. ఆయన వేసిన ప్రణాళికలూ, చేసిన ఆలోచనలూ, ప్రతిపాదించిన సిద్ధాంతాలూ తయారు చేసిన శిష్యులూ, తెలుగు భాషని ఒక్కసారిగా కొన్ని శతాబ్దాలు ముందుకు తీసుకొచ్చి ఇరవయ్యో శతాబ్దిలో పెట్టాయి.

సందర్భం వచ్చింది గనుక వారిని కొత్త తరానికి స్థూలంగా పరిచయం చేయడం, అంతర్జాతీయ భాషాశాస్త్ర రంగంలో అగ్రగామి భాషా శాస్త్రవేత్త గా గుర్తింపు రావడానికి కారణమైన వారి కృషిని వివరించడం అవసరం అనుకుంటాను.

పరిషత్తు వారు చాలా ధనము కర్చుపెట్టి చాలా శ్రమపడి వ్యావహారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశమునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను, ప్రభుత్వమువారిని, విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యధార్థమైనవి కావనిన్నీ, దురభిమానముచేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చినారనిన్నీ ఈ వ్యాసము నందు ఋజువు చేస్తాను.

వాడుకలో నున్న భాషను తృణీకరించి ప్రాచీన భాషను ఆదరించడము బ్రతికియున్నవారికి తిండిపెట్టక చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టు కాదా? ఆదికవులకు ఇట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంథములే లేకపోవును గదా?

వాడుక భాషను కులట అని మర్యాదచేసే పండితులు దానిని దూరముగా విసర్జించక యేల వాడుక చేతురో? వారు ‘యాంటీనాచ్’ కారు గాబోలును.

భాష స్వభావం తెలుసుకోకుండా గ్రంధస్థ భాష లో వున్న ప్రత్యయాలకి మాత్రమే ఆ గౌరవం కలిపిస్తే, దానివలన భాషకి చాలా నష్టం ఉంది. పిల్లలకి అటువంటి భాష నేర్పరాదు. ఆ భాష తగినంత జీవం గల భాష అయి ఉండాలి. నిర్జీవమైతే గ్రాంధిక భాష అయినా పిల్లలకు నేర్పకూడదు.

వ్యవహారములో ననేక రూపము లిట్లే కాలక్రమమున మార్పు జెందినవి. ఇట్టి వ్యావహారిక భాషారూపము లనేకములు నేడు పలువురువ్రాయు వ్యాసములలో గానవచ్చుచు ప్రామాణికత్వమును బడయగలిగిన స్థితిని బొందుచున్నవి. శిష్టవ్యవహారమే ప్రామాణికత్వమునకు మూలముగదా.

గిడుగు, గురజాడలు సమకాల విశ్వసారస్వత స్థితిగతులను పరిశీలించిన వాళ్ళు. వారి ప్రతికక్షులకు ఏ విధమైన విశాల దృక్పథంగాని ఇరుగు పొరుగుల అనుభవాలను గమనించటంగాని అలవాటు లేదు. ఇదే తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. దృష్టి భేదాలు అనుభవ భేదాలూ ఘర్షణకు దిగాయి.

జనులు వాఙ్మయము నర్థము చేసికొనలేక పోయినచో వారలకుఁదమ పూర్వ వృత్తాంతము, పూర్వ మర్యాదలు తెలియక పోవును. తమ పూర్వ వృత్తాంతము మఱచిపోవుట కంటె ఘోరతరమైన విపత్తేజాతివారికిని దటస్థింపఁబోదుకదా!

ఏమార్పులు చేసినను నియమములకు లోబడి యుండవలెను గాని విచ్చల విడిగా నుండరాదు. ఇట్టి మార్పులు భాషాభివృద్ధికి దోడ్పడవు.

భాషలో వ్యాకరణ విషయమైన మార్పులు సేయునప్పుడు మిక్కిలి ప్రయాసతో ఆజన్మాంతము భాషాపరిశ్రమము చేసిన పండితకోటి యొక్క యభిప్రాయము ననుసరించి చేయవలెనుగాని ప్రతి గ్రంథకర్తయు తనకు దోఁచిన మార్పులతో పుస్తకముల వ్రాయఁ దొడంగినచో భాషకు గొప్ప యనర్తకము వాటిల్లును.

వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా వ్యవహారిక-గ్రాంధిక భాషా వాదాల చరిత్రను తెలిపే కొన్ని ముఖ్యమైన పాతవ్యాసాలను పునర్ముద్రిస్తూ జూన్ నెలలో ఈమాట ఒక ప్రత్యేక సంచికను వెలువరించనున్నది. ఈ పాతవ్యాసాలకు అనుబంధంగా “వాడుక భాష, రచనా భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష” అన్న అంశాలపై వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదించే పరిశోధనాత్మకమైన వ్యాసాలను ఈమాట ఆహ్వానిస్తున్నది.