నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది.
నండూరి రామమోహనరావు
జీవిత విశేషాలు
నండూరి రామమోహనరావు (1927- 2011) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా పేరొందారు. చాలాకాలంపాటు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. “బాల” అన్న పత్రికలోనూ, ఆంధ్రపత్రికలోనూ 1940 వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. “నరావతారం”, “విశ్వరూపం” ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేయిన్ నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.