నాకు ముందునుంచీ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో యూరోపియన్ల రాకకు పూర్వమే విలసిల్లిన మాయన్, ఇన్కా నాగరికతల విషయంలోను, అవి యావత్ ప్రపంచానికీ అందించిన సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ ఆసక్తీ ఆరాధనా ఉన్నాయి. అక్కడి దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోన్న ఘనమైన దేశవాళీ సంస్కృతి పట్ల ఆకర్షణ ఉంది.
మార్చ్ 2024
తెలుగులో తాము సీనియర్ రచయితలం, కవులం అని చెప్పుకునే మనుషుల కనుసన్నలలో ఇప్పుడు ఎన్నో సమూహాలు ఉన్నాయి. వాళ్ళ అడుగులకు మడుగులొత్తే శిష్యబృందమూ ఉంది. ఎవరైనా ఒకరు ఒక రెండు ఫేస్బుక్ పోస్ట్‌లకి వంద లైకులు సాధిస్తే, లేదా ఎక్కడైనా ఒక నాలుగు రచనల ప్రచురణ జరిగితే, ఇక వారికి రచయితలు అన్న టాగ్ వచ్చేస్తుంది. వాళ్ళ రచనలను బట్టి కథకులనో, కవులనో ముద్ర వేసేశాక, ఇక వాళ్ళకి సదరు ‘గురు’కులాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, రాసి ఏం చెయ్యాలి – ఇవన్నీ నేర్పించబడతాయి. అవి మేలు చేస్తున్నాయో చేటు చేస్తున్నాయో చెప్పడం కష్టం కాదు కాని, ఆ గీతలు అంత స్పష్టంగా కొత్తవారికి కనపడవు. కళలు ఉద్యోగాలు కావు అన్న స్పృహను పక్కన పెట్టేసిన సీనియర్ కవులు రచయితలు, కాలేజిలో ఫ్రెషర్స్‌కు చెయ్యాల్సిన పనుల చిట్టా చెప్పినట్టు, వారికి రచనలోకి రాగానే ఎంచుకోవాల్సిన ‘సబ్జెక్ట్స్’ ఇచ్చి, వెన్ను తట్టి పెన్ను పట్టిస్తారు. ‘సీనియర్’ల సంగతి ఒదిలెయ్యండి, తమ రచనను విభిన్న వర్గాల పాఠకులకు చేర్చడానికి తెలుగులో ఇన్ని పత్రికలు, ఇన్ని మాధ్యమాలు అందుబాటులో ఉన్నా, ఇలా ఏదో ఒక వేదికమీద మాత్రమే, ఏదో ఒక కూటమితో జతపడి మాత్రమే, రచనలు ప్రచురించి, తాము పొందగలిగినది ఏమిటో యువరచయితలు ప్రశ్నించుకోవాలి. ఒకే రకం అభిప్రాయాలను సమర్థించే బృందంలో ఉన్నప్పుడు, అవి సహజంగానే అక్కడివారి ఆమోదం పొందుతాయి. కానీ ఆ రచనలను భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళకి చేరవేయగలుగుతున్నామా, వస్తువుతో నిరాకరణ ఉన్నా సరే, వాళ్ళని తమ రచనాబలిమి చేత చదివించగలుగుతున్నామా, ఆలోచింపజేయగులుతున్నామా అన్న ప్రశ్నలు వీరికి రావాలి. అవి రావాలంటే, ఈ ప్రచురణా ప్రపంచంలో ఎందుకు ఉన్నామని వీరు ప్రశ్నించుకోవాలి. తనదైన ఆశయంతో రచనలు చేయడానికా? ఏది రాసినా అనుమోదించి దన్నుగా నిలబడగల నలుగురు స్నేహితులను పోగేసుకోవడానికా? తన రచన మీద ఏ విమర్శ వచ్చినా కాపు రాగల కూటమిని కూడగట్టుకోవడానికా… దేనికి? కుటుంబాలతో ఉద్యోగాలతో తలమునకలుగా ఉండే జీవితంలో నుండి కొంత సమయాన్ని వీరు సాహిత్యం కోసం కేటాయించడానికి కారణాలేమిటి? అది నిజంగా నలుగురు, నిజంగా మెచ్చగల రచనను సృష్టించడమే అయితే, ఆ రచనాబలాన్ని తెలుసుకోవడానికి ఆశ్రయించాల్సింది ఎవరిని? ఎవరి విమర్శ నమ్మదగినది? మహామహా ఉద్యమాలే ఆత్మవిమర్శ కొరవడి నీరుకారిపోవడం చరిత్ర నమోదు చేసిన సత్యం. ఇక శ్రద్ధ లేని రచనలేపాటి? లేదూ, కావలసినది ఎంతోకొంత కాలక్షేపమే అయితే, ఈ రచనాపీఠాలను పట్టుకుని వేలాడుతూ వీరు పొందుతున్నది ఏమిటి? కోల్పోతున్నది ఏమిటి? వీటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అది లోపలి పాఠకుడిని బతికించుకోవడం. సాహిత్యంలో విలువలు, రచనకు ఒక స్థాయి ఆశించడం ఎందుకు మానేశారు? పొగడ్త తప్ప విమర్శ ఎందుకు వినరు? సమాజపు సమస్త ఊహలకూ రెక్కలివ్వాల్సిన రచనాలోకంలో, ఈ విజ్ఞతని నిద్రపుచ్చి కవిరచయితలు చేస్తున్నదేమిటి? ముక్కలుముక్కలుగా రాసే మాటల్లో నాలుగు మెరుపులు కనిపిస్తే వస్తే మెచ్చుకోళ్ళకు పొంగిపోతూ, రచన మొత్తంలో కనపడవలసిన పరిపూర్ణత గురించి మాట్లాడటానికి భయపడుతూ లేదా నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటే సాహిత్యం ఎలా మెరుగవుతుంది? నిజమైన రచన శక్తిని, సమయాన్ని, మరీ ముఖ్యంగా నిజాయితీని కోరుతుంది. వీటికి తూనికరాళ్ళు ఎవరికీ వేరేవాళ్ళు ఇవ్వలేరు. ఏ సాహిత్య స్నేహాలూ సమూహాలూ రచనాబలిమి లేని శుష్కసాహిత్యాన్ని బతికించలేవు. సాహిత్యసృజన ఏకాంత ప్రక్రియ.
నిద్ర మధ్యలో మెలుకువ ఒచ్చింది ఆమెకి. కుడివైపుకి తిరిగి చూసింది. పక్కన పడుకునివున్న అతడి కళ్ళు తెరచి వున్న గవాక్షంగుండా కనిపించని దూరాలలోకి చూస్తున్నాయి. దగ్గరగా జరిగింది. “ఏమిటా ఆలోచనలు నిద్రవేళ?” అంటూ అతడి చెక్కిలిపైన చేతిని వేసి తన వైపుకి తిప్పుకుంది. ఆ రాత్రివేళ ఒకానొక అడవిలో ఓ పర్ణశాలకి పహారా కాస్తూన్న తన కవల సోదరుడు ఆలోచనలనిండా నిండివున్నాడని అతడు చెప్పలేదు.
ఇలా ఆదివారం అబిడ్స్‌లో పాత ఎర్రబారిన, దుమ్ముపట్టిపోయిన మార్ట్ డ్రకర్ బొమ్మల పేజీలు కాకుండా, ఒకసారి మార్కెట్లోకి మార్ట్ డ్రకర్: ఫైవ్ డికేడ్స్ ఆఫ్ హిస్ కెరీర్ అనే పేద్ద పుస్తకం వచ్చింది. బ్లాక్‌లో మరీ వైట్ మనీ పెట్టి ఆ పుస్తకం కొన్నా. పుస్తకం పేజీ తిప్పగానే మార్ట్ డ్రకర్ ఇంటర్యూ ఉంది. ఇలా…
రెండు గదుల పెంకుటిల్లు. బయట వరండాలో రెండు అరుగులు. నవారు కుర్చీ. ఓ నులక మంచం. వంటింటి సామాన్లు, ఆమె చీరలు కాకుండా, అన్నిటికంటే ఆకర్షించింది అక్కడ ఉన్న చిన్న చిన్న వెదురు బుట్టలు. రకరకాల రంగుల్లో ఉన్నాయి. వాటిలో చిన్న చిన్న రంగుల గవ్వలు. గవ్వలతో చేసిన బొమ్మలు. పక్కన ఓ ట్రంక్ పెట్టె. దానిని తెరవాలనిపించలేదు. వాటినన్నిటిని చూస్తుంటే ఆమె ఆ ఇంటిని ఎంత ఇష్టంగా చూసుకుందో కనిపిస్తుంది.
రామచంద్రమూర్తి అర్థమయిందన్నట్టు తలూపి వెంటనే తన చివరి కోరిక కోరుకున్నాడు. కానీ “నీ యాస తమాషాగా ఉందే! దేవతలు మాట్లాడేదిలా లేదే!” అని వ్యాఖ్యానించి మరీ కోరుకున్నాడు. దేవత నొచ్చుకున్నాడు, కొద్దిగా కోపం తెచ్చుకున్నాడు. “దేవతల యాసా? అంటే? ఉన్నట్టుండి నేను మాట్లాడే తీరును ఆక్షేపించడానికి దేవతల యాస ఏదో నువ్వెప్పుడైనా విన్నావా ఇంతకు ముందు?” దేవత మొఖంలో దైవత్వం కాస్త తగ్గింది.
కైలాసరావు చూపు ఆమె వెంటే వెళ్ళింది. ఆమె గది లోపలికి వెళ్ళిపోయింది. ‘కిఱ్ఱు’మనే శబ్దంతో తలుపు మూసుకుని, ఆయన చూపు తలుపుకు గుద్దుకుంది. మూసిన ఆ తలుపు మీద ఒక ఆడ మనిషి ఆకారం చిత్రలేఖనంలా కనిపించింది. వయసు పదహారేళ్ళు ఉంటుంది. నున్నగా దువ్విన తలమీద నాగరం, పాపిడికి రెండుపక్కలా నెలవంక బిళ్ళ, వదులుగా జారవిడిచిన జడకు జడకుప్పెలు, నుదుట వెలుతురును వెదజల్లే ముత్యాల పాపిడిబిళ్ళ.
మనసే, నిండా ములిగింది
వడగళ్ళ వాన!
ఎవరు పైన ఎవరు కింద?
మెడవంపులోనే మెరుపులు
పెదాలు కాలే వేళ
ముద్దు ఎక్కడ పెట్టాలి?
మొత్తంగా తనను తాను
అక్షరాల్లో కుప్పబోశాడు
ఎక్కడ ముట్టుకున్నా
వదిలివెళ్ళిన ఆఖరిచూపో
రగిలి రగిలి బూడిదైన గుండెనో
రెప్పల చివర మిగిలిన కలో
శుభ్రజ్యోత్న నీలాకాశం కింద
గుసగుసల ముచ్చెమటల ముచ్చట
ఇరువురికి తెలియని
ఒక ఆపతి ఇరువురి సోపతి
ఫెళ ఫెళ ఆర్భాటాల
ఉరుములు మెరుపులు
తనువంతా తడిపినా
మౌనంగా చూస్తూ
ఎంతో బ్రతిమాలితే
ఒకే ఒక పువ్వును ప్రసవించి
రంగుల తెరలై నవ్వింది
పరిమళాలు పోయింది
వారి జీవితం నల్లేరు మీద నడక ఎందుకు కాలేదు? అనుకుంటాం. పులుముకున్న చీకటి వేదనని తామే అనుభవించి మనకు చల్లని చందమామలైన వాళ్ళు కొందరు. ఈ పదిహేనుమందిలో అత్యాశతో అహంకారంతో అపకీర్తి మూటకట్టుకుపోయిన పాబ్లో ఎస్కోబార్ తప్ప తక్కినవారంతా కళాకారులే, తమ రంగాల్లో నిష్ణాతులే.
మన దేశవాళీ వంగ, కర్ణాటక, పంజాబీ సంగీతాలే కాదు, రజని మధ్య ప్రాచ్య సంగీతం ఆధారంగా ఎన్నో పాటలు వ్రాసి స్వరపరిచారు. మధ్య ప్రాచ్య సంగీతం ఆయన స్వభావానికి మరింత దగ్గరైన సంగీతం అనుకుంటాను. ఆయన ఒక సంగీతస్వరం వింటే దానిలో ప్రయోగాలు చెయ్యకుండా వుండేవారు కారు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
గత 29 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ స్థాయిలో 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ ‘పోటీ కాని పోటీ’లో రెండు విభాగాలు ఉన్నాయి.
క్రితం సంచికలోని గడినుడి-88కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై ఆరుగురు సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-88 సమాధానాలు.