రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

జనవరి 2001

“ఈమాట” పాఠకులకు కొత్త సంవత్సరానికి సరికొత్త శుభాకాంక్షలు.

క్రితం సంచికలో కవితల లోటు గురించి విచారించిన పాఠకులకు తనివి తీరేలా కవితల్ని అందిస్తోందీ సంచిక. అలాగని ఇందువల్ల మిగతా శీర్షికలకి ఏమీ లోపం కలక్కుండా యధాప్రకారం గానే కథలు, వ్యాసాలు, ప్రత్యేక రచనలు కూడా ఉన్నాయి.

గెస్ట్‌ బుక్‌ ద్వారా, ఇతర మార్గాల ద్వారా మీనుంచి అందుతున్న సలహాలను పరిశీలిస్తున్నాం. ఆచరణీయమైన వాటిని తప్పకుండా ఒక్కొక్కటిగా అమలు చేస్తాం.

క్రితం సంచికలో చెప్పినట్టు ఇంతవరకు “ఈమాట” లో ప్రచురించిన అన్ని రచనల్ని ఒకే చోట చూసే వీలు కలిగిస్తున్నాం. ఇది పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుందని మా ఆశ.
 
మీకు నచ్చిన లేదా నచ్చని ఏ రచన గురించి గానీ లేక మొత్తం సంచిక గురించి గాని మీ అభిప్రాయాలు రాస్తే అవి రచయిత్రు(త)లకూ మాకూ ఎంతగానో ఉపయోగిస్తాయి.
 

 

గతచిత్రం

రచన: విన్నకోట రవిశంకర్

కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది.

0

రాగలహరి: కల్యాణి

రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న

(ఈ రాగలహరి శీర్షికలో నాలుగో రాగం కల్యాణి. ఇంతకు ముందు పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి రాగాల్లాగే, కల్యాణి రాగం కూడా చాలా […]

13

సినిమా పాటల్లో హాస్యం

రచన: కె. వి. ఎస్. రామారావు

(ఇది ఏడవ టెక్సస్‌ సాహితీ సదస్సు సందర్భంగా ఇటీవల కె.వి.ఎస్‌. రామారావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్‌ లు హ్యూస్టన్‌ లో జరిగిన సమావేశంలో […]

1

లెఖ్ఖల పరీక్ష

రచన: శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

(కవిగా, కథకుడిగా తానా, ఆటా సువనీర్లలో దర్శనమిచ్చే శ్రీనివాస్‌ ఫణికుమార్‌ డొక్కా గారి “ఈమాట” తొలిరచన ఇది. అందరికీ అనుభవమైన చిన్ననాటి ముచ్చట్లు గుర్తుకుతెస్తూ […]

3

నిద్ర పట్టనివ్వని అలారం

రచన: నందివాడ భీమారావు

(నందివాడ భీమారావు గారు సుప్రసిద్ధ కథకులు, నవలాకారులు. ఈమధ్యనే వారి కుటుంబసభ్యుల్ని చూడ్డానికి డల్లాస్‌ వచ్చి, “ఈమాట” కోసం రాసి ఇచ్చిన కథ ఇది. […]

0

స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ కథ

రచన: వంగూరి చిట్టెన్‌ రాజు

(అమెరికా కథకుల్లో హాస్యానికి పెద్దపీట వేసే కథకుల్లో ప్రముఖులు చిట్టెన్‌ రాజు గారు. వీరి కథలు మా పాఠకులకు పరిచితాలే. అదే ఒరవడిలో మరొకటి.) […]

1

డ్రైవింగ్‌ లెసన్‌

రచన: కె. వి. గిరిధరరావు

(వర్ధమాన కథకుడు, కవి గిరిధరరావు నేటితరం అమెరికా తెలుగు వాళ్ళ దృక్పథాల్ని, అనుభవాల్ని ఆవిష్కరిస్తున్న రచయిత. ఈ కథలో సంఘటనలు ఎందరికో స్వానుభవాలు.) “అది […]

0

ఇండియన్‌ వేల్యూస్‌

రచన: ఎస్‌. నారాయణస్వామి

(“నాసీ” గా అప్పుడప్పుడు అవతారమెత్తే ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా “ఈమాట” పాఠకులకు చిరపరిచితులు. అదే […]

2

…..ఉరకకురా పడేవు

రచన: నచకి

“ఒరే, ఎప్పుడైనా మందు కొట్టావా?” అడిగాడు విలాస్‌, వరప్రసాద్‌ ని. “ఛఛ! లేదు రా, నాకు ఇష్టం లేదు”, అనేసి చేతిలో ఉన్న మ్యాగజీన్‌ […]

1

తమాషా దేఖో 5

రచన: కనకప్రసాద్

(కథకుడిగా కవిగా అమెరికా పాఠకులకు ఎప్పట్నుంచో తెలిసిన కనకప్రసాద్‌ విశాఖ మాండలీకంలో వర్ణించే దృశ్యాలు, చిత్రించే పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తయ్‌, వినిపిస్తయ్‌. […]

0

సహచర

రచన: మహె జబీన్‌

(“ఆకురాలు కాలం” కవయిత్రిగా ప్రపంచ వ్యాప్తమైన అభిమాన పాఠక బృందాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత్రి మహె జబీన్‌. ఈమధ్య వీరి కవిత్వం మరో మలుపు […]

1

మనం మాట్లాడుకుందాం

రచన: చంద్ర కన్నెగంటి

(కన్నెగంటి చంద్ర తెలుసా, “ఈమాట”, తానా పత్రికల ద్వారా అమెరికా పాఠకులకు పరిచితులు. కవిత్వంలోనూ, కథనంలోనూ తనవైన శైలి, భావాలు, ప్రతీకలు చూపిస్తున్న చంద్ర […]

0

గింగిర్లు తిరుగుతున్న పాటలు

రచన: నందివాడ ఉదయ భాస్కర్

(ఇండియాలో కవిగా లబ్ధప్రతిష్టుడైన నందివాడ ఉదయ్‌ భాస్కర్‌ సునిశిత పరిశీలన, సునాయాసమైన కవితాభావన ఉన్న కవి. ఇక్కడికి వచ్చాక రాసి తగ్గినా వాసి తగ్గలేదు.వీరు […]

0

నేనొక పాత్రని

రచన: ఎస్‌. నారాయణస్వామి

(కథకుడిగా రచ్చ గెలుస్తున్న ఎస్‌. నారాయణ స్వామి కవిత్వంతో ఇంట గెలవబోతున్నారు.) అయ్యా, నేనొక పాత్రని బాబూ, నేనొక కథలో పాత్రని దయ చూడండమ్మా, […]

0

సోహం

రచన: భాస్కర్ కొంపెల్ల

(మనసులోని భావం, కనపడే లేదా ఊహించే చిత్రం ఒకటైతే ఆ భావం మనసులో నిరంతర దర్శనం యిస్తుంది. ఈ ఐక్యతని గుర్తించే ప్రయత్నమిది) భావం […]

0

అమెరికా ఆంధ్రుల ఆహ్వానం

రచన: కలశపూడి శ్రీనివాసరావు

(నవలాకారులుగా, కథకులుగా, కవిగా కలశపూడి శ్రీనివాస రావు గారు అమెరికా పాఠకులకు చిరపరిచితులు.) రకరకాల రంగాలలో పలు రకాల ప్రశంసలు పొందిన అమెరికా ఆంధ్రుల […]

0

తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం

రచన: పరుచూరి శ్రీనివాస్

(పరుచూరి శ్రీనివాస్‌ “తెలుసా”, “ఈమాట”, తానా పత్రికల ద్వారా సుపరిచితులు. తెలుగు భాషాచరిత్ర, తెలుగు సాంఘికచరిత్ర, సంగీతచరిత్ర మొదలైన అనేక విషయాల్లో “నడుస్తున్న నాలెడ్జ్‌” […]

17
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.