విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పై ఒక ప్రత్యేక గ్రంధం ప్రచురించబోతున్నారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబర్ 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల కాబోతోంది.
శీర్షికలు ప్రకటనలు
ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు జనవరి 2, 2007 మంగళవారం నాడు చిత్తూర్ […]
వంగురి ఫౌండేషన్ వారు రెండేళ్ళకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని “ఈమాట” ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారి చిత్రకళా ప్రదర్శన, “ఈమాట” ముఖ్య సంపాదకులు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు “సాహిత్యంలో హాస్యం” అన్న అంశం మీద చేయబోయే కీలకోపన్యాసం ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి.
పార్థివనామ సంవత్సరం ఇస్మాయిల్ అవార్డ్ కు ప్రతిభగల కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి రచించిన “వానకు తడిసిన పూవొకటి” అనే కవితా సంకలనాన్ని ఎంపిక చేశారు. అక్టోబర్ లో విడుదల కాబోయే ఈ పుస్తకం నుండి రెండు చిన్న కవితలు.