రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

రెండు కవితలు

రచన: పాలపర్తి ఇంద్రాణి
నవంబర్ 2016

1​. ఎటులైనా ఇచటనే ఆగిపోనా

చిటారు కొమ్మకి
పారీ చూపు
ఈలలు ఊరీ
కోనకి కైపు

పడుచు సూరీడి
నీడల అల్లుడు
చీమ మీసాల
గుస గుస
బారెడు

కొమ్మ రెమ్మ
వంకర ఓలు
పురుగులు దున్ను
టింకర చాలు

మబ్బు బానలు
మోసుకు వచ్చి
చీకటి సబ్బును
ఒంటికి రుద్దే
సంజె గాలికి
సాగీ కాలు

నడిమి అడివి
కాటుక కాయి
మూత తెరచే
పాలపుంతలో
పేరీ ఊహ
సోలీ కన్ను.

2. ఇంటికొచ్చిన వర్షం

ఆ
రంగారాయుడు
చెరువులో
వానకి తడుస్తున్న
తామర పూల​ని ​
ఒళ్ళు విదిల్చే
బాతుల్ని

గడ్డిలో
చినుకుల బరువుకు
వంగిన పూలని
అప్పుడే బయటికి
వచ్చి స్నానం చేస్తోన్న
వానపాముల్ని

చూస్తూ
రంగు చుక్కల
గొడుగు వేసుకున్నా
సగం వీపు తడిసేలా
జల్లు కొడుతోంటే

వచ్చావూ
ఇప్పటికి
ఇంటికి?

ఇదిగో
ఈ వేడి వేడి
దిబ్బ రొట్టి తిని
పక్కనే పొగలు
కక్కుతోన్న
అల్లం టీ
తాగు.

వాన హోరు
వినిపిస్తుందిలే
ఇంట్లోంచి

మెరుపులు
నల్ల చీరకి
​జరీ అంచులా ​
తార్రోడ్డుకి
అటూ ఇటూ పారే
​ఎర్ర ​
మట్టి నీళ్ళూ

పూల అంచుగా
​ఒకటొకటిగా
​జారి
ఇసకలో​​
తీరుబడిగా
కన్నాలు
​పెడుతోన్న
వాన చినుకులూ ​

చూడొచ్చులే
కిటికీలోంచి.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    S A RAHMAN November 3, 2016 8:38 am

    రెండు కవితలు రెండు ఆణిముత్యాల్లా ఉన్నాయి. చాలా బాగున్నాయి.

  2. 2
    Seetha November 18, 2016 12:00 am

    నాకు రెండోది చాల నచ్చింది. అలా కళ్ళకు కట్టీ నట్టు అందంగా వ్రాసారు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • హళ్ళికి సున్న
  • దైవం
  • సఖియ
  • ఇంటికి మళ్ళు
  • కొంచెం అది కొంచెం ఇది

ఇటువంటివే…

  1. రెండు కవితలు
  2. రెండు కవితలు
  3. రెండు కవితలు
  4. రెండు కవితలు
  5. రెండు కవితలు

నవంబర్ 2016 సంచికలో ...

  • Yippee! I’m a poet, and I know it
  • ఆకు
  • ఇంక పోతారనగాను
  • ఏండ్రాయిడ్ మనిషి
  • గడి నుడి – 2
  • తన మాట కోసం
  • తెగులుకి శిక్ష
  • దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ప్రసంగం
  • నవంబర్ 2016
  • నా టేస్టులేనితనం
  • నాకు నచ్చిన పద్యం: పండువెన్నెల పిండివంటలు!
  • ఫ్రాగ్మెంట్స్
  • రెండు కవితలు
  • వెణ్బా (ధవళగీతి)
  • శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన
  • సమూలాంధ్రపుష్పబాణవిలాసము
  • హృదయ కమలములను
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఫ్రాగ్మెంట్స్
ఏండ్రాయిడ్ మనిషి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.