1. ఈ క్రింది పదాలకన్నిటికీ చివరి మూడు అక్షరాలు సమానమే. ప్రక్కన ఇచ్చిన క్లూలను బట్టి ఆ పదాలు కనుక్కోండి.
1. తుమ్మెద ధ్వని
_ _ _ _
2. హోదా
_ _ _ _ _
3. హేళన
_ _ _ _ _
4. ఆప్యాయత
_ _ _ _ _
5. హెచ్చవేత
_ _ _ _ _
6. చీకటి
_ _ _ _ _
7. ఆరంభము
_ _ _ _
8. సింగారము
_ _ _ _ _
9. అందవిహీనము
_ _ _ _
10. ప్రహరీ
_ _ _ _
11. సహాయము
_ _ _ _ _
12. గజగర్జన
_ _ _ _
13. తోడ్పడు
_ _ _ _ _
14. శరీర సౌష్టవము
_ _ _ _
15. విధము
_ _ _ _
16. మాట చమత్కారము
_ _ _ _ _
17. గర్వించు
_ _ _ _ _
18. గుంపుకేకలు
_ _ _ _ _
19. పగ
_ _ _ _ _
20. మంట
_ _ _
మరి మీరు కొన్ని కలపండి
21.
22.
23.
24.
2. మామూలు వాడుకలో “వేయటం” మరియు “తీయటం” వ్యతిరేకార్ధంలో వాడుతాము.
ఉదాహరణకు తలుపు వేయటం మరియు తలుపు తీయటం.
అలాగే ముడి వేయటం, ముడి తీయటం.
కాని ఒక విషయంలో వేయటమూ తీయటమూ ఒకే అర్ధమిస్తాయి. . అది ఏ సందర్భంలో?
3. ఐదు అక్షరాల పదము. ఆనందానికి పర్యాయపదంగా చెప్పుకోవచ్చు. ఇందులో వత్తులుకాని, సంయుక్తాక్షరాలు కాని లేవు. ఈ పదం లోని అక్షరాలతో ఈ క్రింది పదాలు వస్తాయి. ప్రక్కన ఇచ్చిన క్లూలను బట్టి ఆ పదాలు కనుక్కోండి. దీనిని బట్టి ఐదు అక్షరాల పదం కనుక్కోండి.
1. బాణము
_ _ _
2. ధ్వని
_ _ _
3. దైవ సాన్నిధ్యము
_ _ _
4. అన్యమైన
_ _
5. పీనుగ
_ _ _
6. స్వాధీనము
_ _ _
7. దేవునికానుక
_ _ _
మరి అసలు పదము ఏమిటి?
ఆనందము _ _ _ _ _
మీ సమాధానాలు kasi_emaata@hotmail.com కు పంపంచండి. విజేతల పేర్లు,సమాధానాలతో పాటు వచ్చే సంచికలో ప్రకటిచబడును.