ఒకటే ప్రశ్న
సప్తస్వరాలు “స రి గ మ ప ద ని స” తీసుకోండి.
ఈ ఏడు అక్షరాలు మరియు సున్న మాత్రము వాడి అర్థవంతమైన తెలుగు వాక్యము (వాక్యమే, పేరా కాదు)ఎంత పెద్దది వ్రాయగలరు?
ఈ అక్షరాలు అలాగే వాడాలి వాటి వత్తులు వాడకూడదు.
ఉదాహరణకు ఒక వాక్యము
సరిగ గంగ దరి పద.
కనీసం పది పదాలున్న వాక్యం రాయడానికి ప్రయత్నించండి.
మీ సమాధానాలు kasi_emaata@hotmail.comకు పంపంచండి. విజేతల పేర్లు,సమాధానాలతో పాటు వచ్చే సంచికలో ప్రకటించబడతాయి.
క్రితం సారి ఇచ్చిన పదకేళి, దాని సమాధానాలు, అవి సరిగా రాసి పంపిన వారి విశేషాలు కింద ఉన్నాయి ముందుగా ఈ పదకేళిలో విజేతలైన వారందరికీ మా అభినందనలు!
పదకేళిలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు.
1. ఈ క్రింది పదాలకన్నిటికీ చివరి మూడు అక్షరాలు సమానమే. ప్రక్కన ఇచ్చిన క్లూలను బట్టి ఆ పదాలు కనుక్కోండి.
ఈ ప్రశ్నకు సరయిన సమాధానాలు పంపిన వారు
రవి మంద
రంగా ఇలపావులూరి
రమణ ఆదిభట్ల
రామభద్ర డొక్కా
నిర్మల పొన్నాడ
రజనీకాంత్ వదిగెపల్లి
సూర్యకుమారి ఆదిభట్ల
1. తుమ్మెద ధ్వని
ఝుంకారము
2. హోదా
అధికారము
3. హేళన
వెటకారము
4. ఆప్యాయత
మమకారము
5. హెచ్చవేత
గుణకారము
6. చీకటి
అంధకారము
7. ఆరంభము
శ్రీకారము
8. సింగారము
అలంకారము
9. అందవిహీనము
వికారము అనాకారము
10. ప్రహరీ
ప్రాకారము
11. సహాయము
ఉపకారము
12. గజగర్జన
ఘీంకారము
13. తోడ్పడు
సహకారము
14. శరీర సౌష్టవము
ఆకారము
15. విధము
ప్రకారము
16. మాట చమత్కారము
నుడికారము
17. గర్వించు
అహంకారము
18. గుంపుకేకలు
హాహాకారము
19. పగ
ప్రతీకారము
20. మంట
కారము
2. మామూలు వాడుకలో “వేయటం” మరియు “తీయటం” వ్యతిరేకార్ధంలో వాడుతాము.
ఉదాహరణకు తలుపు వేయటం మరియు తలుపు తీయటం.
అలాగే ముడి వేయటం, ముడి తీయటం.
కాని ఒక విషయంలో వేయటమూ తీయటమూ ఒకే అర్ధమిస్తాయి. అది ఏ సందర్భంలో?
ఉరి వేయటం ఉరి తీయటం సందర్భంలో
వేయటం తీయటం ఒకే అర్ధమిస్తాయి
ఈ ప్రశ్నకు సరయిన సమాధానాలు పంపిన వారు ఒక్కరే నిర్మల పొన్నాడ
ఇంకొన్ని నిర్మాణాత్మక సమాధానాలు
తూనిక వేయటం మరియు తూనిక తీయటం రమణ ఆదిభట్ల
కునుకు వేయడం మరియు కునుకు తీయడం రామభద్ర డొక్కా
గొయ్య వేయటం మరియు గొయ్య తీయటం సూర్యకుమారి ఆదిభట్ల
3. ఐదు అక్షరాల పదము. ఆనందానికి పర్యాయపదంగా చెప్పుకోవచ్చు. ఇందులో వత్తులుకాని, సంయుక్తాక్షరాలు కాని లేవు. ఈ పదం లోని అక్షరాలతో ఈ క్రింది పదాలు వస్తాయి. ప్రక్కన ఇచ్చిన క్లూలను బట్టి ఆ పదాలు కనుక్కోండి. దీనిని బట్టి ఐదు అక్షరాల పదం కనుక్కోండి.
ఈ ప్రశ్నకు సరయిన సమాధానాలు పంపిన వారు
రవి మంద
రంగా ఇలపావులూరి
రమణ ఆదిభట్ల
రామభద్ర డొక్కా
నిర్మల పొన్నాడ
రజనీకాంత్ వదిగెపల్లి
సూర్యకుమారి ఆదిభట్ల
కృష్ణ కొందాడ
1. బాణము
స ర ము
2. ధ్వని
ర వ ము
3. దైవ సాన్నిధ్యము
ప ర ము
4. అన్యమైన
ప ర
5. పీనుగ
శ వ ము
6. స్వాధీనము
వ స ము
7. దేవునికానుక
వ ర ము
మరి అసలు పదము ఏమిటి?
ఆనందము _ _ _ _ _
ఇందులో వాడిన అక్షరాలు
శ ర ము వ ప
వీటితో ఆనందము అర్ధము గల పదము ప ర వ శ ము
మీ సమాధానాలు kasi_emaata@hotmail.comకు పంపంచండి. విజేతల పేర్లు,సమాధానాలతో పాటు వచ్చే సంచికలో ప్రకటించబడును.