బ్రతుకు మీద ఆశ ఉండదు,
ఇలాగే బ్రతకాలన్న కోరిక ఉండదు.
కులమతాలతో సంబంధం ఉండదు,
మన కులం ఇదే అన్నవాళ్లతో బంధం ఉండదు.
బంగ్లాలు, భవంతుల్లో బ్రతకాలన్న ఆశ ఉండదు,
నా బ్రతుకు ఇలా ఉందేంటి అన్న బాధ ఉండదు.
కడుపు కాలేంత వరకు తెలియదు,
పని చేయాలి అని!
పంచభూతాలతో సమానంగా ప్రయాణిస్తూ,
ఈ మోసపూరితమైన కాలమే
ముక్కు మీద వేలు వేసుకునేలా జీవిస్తూ,
కల్మషం లేని మనసులు
ఈ కాలంలో మమేకమైపోతాయి.
ఎందుకు ఆశలు, కోరికలు, ద్వేషాలు, కులాలు?
నువ్వు ఏం సాధించావని
నువ్వు ఈ భూమితల్లి ఒడిని చేరకముందే అడుగు.
బహుశా, నీకు సమాధానం తర్వాత దొరకకపోవచ్చు.