శ్లో॥ సీతాయా నిశ్చితం బుద్ధ్వా హనూమాన్ మారుతాత్మజః ।
శ్రోత్రానుకూలైర్వచనైస్తదా తాం సంప్రహర్షయన్ ॥27॥
పదచ్ఛేదము:- సీతాయాః – నిశ్చితం – బుద్ధ్వా – హనుమాన్ – మారుతాత్మజః – శ్రోత్రానుకూలైః – వచనైః – తదా – తాం – సంప్రహర్షయన్ ||
అన్వయక్రమము:- మారుతాత్మజః హనుమాన్ సీతాయాః నిశ్చితం బుద్ధ్వా తదా శ్రోత్రానుకూలైః వచనైః తదా తాం సంప్రహర్షయన్ (అబ్రవీత్).
ప్రతిపదార్థము:- మారుతాత్మజః = వాయునందనుడైన, హనుమాన్ = హనుమ, సీతాయాః = సీతయొక్క, నిశ్చితం = నిశ్చయమును, బుద్ధ్వా = తెలిసికొని, తదా = అప్పుడు, శ్రోత్రానుకూలైః = చెవుల కింపయినట్టి, వచనైః = మాటలతో, తాం = ఆ సీతాదేవిని, సంప్రహర్షయన్ = మిక్కిలి సంతోషింపజేయుచు (అబ్రవీత్ = పలికెను).
కం.శంకాన్వితయై పలుకనిపంకజముఖి భావమెరిగి పవనజు డంతన్శంకాజిహీర్షువై* పలుపొంకపు రాముని గుణములు పొలుపుగ బలికెన్!(alt: పొంకపు మాటలు చెవులకు బొలుపుగ బలికెన్!)(*శంకాజిహీర్షువు = శంకను తీర్చాలన్న కోరిక కలవాడు.)
ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాంతః శశీ యథా ।
రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా ॥28॥
విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశాః ।
సత్యవాదీ మధురవాగ్ దేవో వాచస్పతిర్యథా ॥29॥
రూపవాన్ సుభగః శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ ।
స్థానక్రోధే ప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథః ॥30॥
బాహుచ్ఛాయామవష్టబ్ధో యస్య లోకో మహాత్మనః ।
పదచ్ఛేదము:- ఆదిత్యః – ఇవ – తేజస్వీ – లోకకాంతః – శశీ – యథా- రాజా – సర్వస్య – లోకస్య – దేవః – వైశ్రవణః – యథా – విక్రమేణ – ఉపపన్నః – చ – యథా – విష్ణుః – మహాయశాః – సత్యవాదీ – మధురవాక్ – వాచస్పతిః – యథా – రూపవాన్ – సుభగః – శ్రీమాన్ – కందర్పః – ఇవ – మూర్తిమాన్ – స్థానక్రోధే – ప్రహర్తా – చ – శ్రేష్ఠః – లోకే – మహారథః – బాహుచ్ఛాయామ్ – అవష్టబ్ధః – యస్య – లోకః – మహాత్మనః |
అన్వయక్రమము:- లోకః మహాత్మనః యస్య బాహుచ్ఛాయాం అవష్టబ్ధః, (సః రామః) ఆదిత్యః ఇవ, తేజస్వీ; శశీ యథా లోకకాంతః; వైశ్రవణః దేవః యథా సర్వస్య లోకస్య రాజా; విష్ణుః యథా మహాయశాః విక్రమేణ ఉపపన్నః చ, వాచస్పతిః దేవః యథా సత్యవాదీ మధురవాక్; మూర్తిమాన్ కందర్పః ఇవ శ్రీమాన్, రూపవాన్, సుభగః, స్థానక్రోధే ప్రహర్తా చ, లోకే శ్రేష్ఠః మహారథః చ (ఆస్తే).
ప్రతిపదార్థము:- లోకః = ఈ జగత్తు, మహాత్మనః = మహనీయుడైన, యస్య = ఏ పరమపురుషునియొక్క, బాహుచ్ఛాయాం = భుజముల నీడను, అవష్టబ్ధః = నిలచియున్నదో, (సః రామః = ఆ శ్రీరామచంద్రుడు) ఆదిత్యః ఇవ = భాస్కరునివలె, తేజస్వీ = తేజశ్శాలి; శశీ యథా = చంద్రునివలె, లోకకాంతః = జగత్తున కాహ్లాద కరమైనవాడు; వైశ్రవణః దేవః యథా = కుబేరుని వలె, సర్వస్య లోకస్య సర్వలోకమునకును, రాజా = రాజు; విష్ణుః యథా = మహావిష్ణువువలె, మహాయశాః = అమితమైన యశస్సుగలవాడును, విక్రమేణ ఉపపన్నః చ = అమితపరాక్రమముతో కూడినట్టివాడును; దేవః వాచస్పతిః యథా = పూజ్యుడైనట్టి బృహస్పతివలె, సత్యవాదీ = సత్యవచనుడును, మధురవాక్ = మధురమైనట్టి వాక్కుగలవాడును; మూర్తిమాన్ కందర్పః ఇవ = శరీరముతో ప్రకాశించు మన్మథుడివలె, శ్రీమాన్ = గొప్పశోభతో నొప్పువాడును, రూపవాన్ = రమ్యమైన రూపముతో ప్రకాశించువాడును, సుభగః = లావణ్యముతో నొప్పువాడును; స్థానక్రోధే = ఆవశ్యకమైన క్రోధసమయమునందు, ప్రహర్తా చ = (శత్రువులను) రూపుమాపువాడును, లోకే = చ జగత్తునందు, శ్రేష్ఠః =సర్వశ్రేష్ఠుడైన, మహారథః = మహావీరుడునుగా, ఆస్తే = వెలయుచున్నాడు.
సీ.దినరాజు పోలిక దీపించు తేజుండు,యక్షరాజగు జగద్రక్షణ సేయంగ,సురరాజగురు రీతి సూనృత మృదుభాషిఅరిరాజ గణముపై సరిరోషమును జూపి
తే.గీ.రాజ వీరులలో మహారథికుడతడురాజ శ్రేష్ఠులు కీర్తించు రాజయశుడువిదిత బల రాజితుండు నీ హృదయరాజురాజబాహు నీడను లోక రక్ష సేయు!
శ్లో॥ అపక్రమ్యాఽఽశ్రమపదాన్మృగరూపేణ రాఘవమ్ ।
శూన్యే యేనాపనీతాసి తస్య ద్రక్ష్యసి తత్ఫలం ॥32॥
పదచ్ఛేదము:- అపక్రమ్య – ఆశ్రమపదాత్ – మృగరూపేణ – రాఘవమ్, శూన్యే యేన – అపనీతా – అసి – తస్య – ద్రక్ష్యసి – తత్ఫలమ్ ॥
అన్వయక్రమము:- ఆశ్రమపదాత్ మృగరూపేణ రాఘవమ్ అపక్రమ్య యేన శూన్యే అపనీతా అసి, తస్య తత్ఫలం ద్రక్ష్యసి.
ప్రతిపదార్థము:- ఆశ్రమపదాత్ = ఆశ్రమస్థానమునుండి, మృగరూపేణ = మాయామృగరూపముతో, రాఘవం = శ్రీరాముని, అపక్రమ్య = దూరముచేసి, శూన్యే నిర్జనమైనట్టి (స్థితియందు), యేన = ఏ రావణునిచే, అపనీతా అసి = అపహరింపబడి యుంటివో, తస్య = ఆ రావణునకు, తత్ఫలం = దానియొక్క ఫలితమును, ద్రక్ష్యసి = చూడగలవు.
తే.గీ.మాయ మృగముచే రాముని మాయ సేసిదూరముగ నన్నదమ్ముల తొలగజేసినిర్జనాశ్రమమున నుండి నిన్ను దెచ్చె!పాప ఫలము ననుభవించు వాడు త్వరగ.
శ్లో॥ అచిరాద్ రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్ ।
క్రోధప్రముక్తైరిషుభిర్జ్వలద్భిరివ పావకైః ।
తేనాహం ప్రేషితో దూతస్త్వత్సకాశమిహాగతః ॥33॥
పదచ్ఛేదము:- అచిరాత్ – రావణం – సంఖ్యే – యః – వధిష్యతి – వీర్యవాన్ – క్రోధప్రముక్తేః – ఇషుభిః – జ్వలద్భిః – ఇవ – పావకైః – తేన – అహం – ప్రేషితః – దూతః – త్వత్సకాశమ్ – ఇహ – ఆగతః ॥
అన్వయక్రమము:- వీర్యవాన్ యః, జ్వలద్భిః పావకైః ఇవ, క్రోధప్రముక్తేః ఇషుభిః అచిరాత్ సంఖ్యే రావణం వధిష్యతి, తేన ప్రేషితః దూతః అహం ఇహ త్వత్సకాశం ఆగతః.
ప్రతిపదార్థము:- వీర్యవాన్ యః = వీర్యశాలియైన ఏ మహనీయుడు, జ్వలద్భిః పావకైః ఇవ = ప్రజ్వలించు చున్న అగ్నులవంటి, క్రోధప్రముక్తేః = క్రోధముచే విడువ బడినట్టి, ఇషుభిః = శరములచే, అచిరాత్ = కొద్దికాలములోనే, సంఖ్యే = యుద్ధమునందు, రావణం = రావణాసురుని, వధిష్యతి = సంహరింపగలడో, తేన = ఆ మహనీయునిచే, ప్రేషితః = పంపబడినట్టి, దూతః = దూతనైన, అహం = నేను, ఇహ = ఇచ్చట, త్వత్సకాశం = నీ సన్నిధికి, ఆగతః = వచ్చినవాడను.
తే.గీ.క్రోధమున విడిచిన యగ్ని కోల దండుశరములను బంపి రావణు జంపగలుగువీర్యవంతుండు కాకుత్స వీరవరుడురాముడు పనుప నీ చెంత వ్రాలినాను!
త్వద్వియోగేన దుఃఖార్తః స త్వాం కౌశలమబ్రవీత్ ॥34॥
పదచ్ఛేదము:- త్వద్వియోగేన – దుఃఖార్తః – సః – త్వాం – కౌశలమ్ – అబ్రవీత్
అన్వయక్రమము:- త్వద్వియోగేన దుఃఖార్తః సః త్వాం కౌశలమ్ అబ్రవీత్ ॥
ప్రతిపదార్థము :- త్వద్వియోగేన = నీ వియోగముచే, దుఃఖార్తః = శోకపీడితుడై యున్నట్టి, సః = ఆ శ్రీరాముడు, త్వాం = నిన్ను, కౌశలమ్ అబ్రవీత్ = కుశలమడినాడు.
లక్ష్మణశ్చ మహాతేజాః సుమిత్రానందవర్ధనః ।
అభివాద్య మహాబాహుః స త్వాం కౌశలమబ్రవీత్ ॥35॥
పదచ్ఛేదము:- లక్ష్మణః – చ – మహాతేజాః – సుమిత్రానందవర్ధనః – అభివాద్య — మహాబాహుః సః – త్వాం – కౌశలమ్ – అబ్రవీత్ ॥
అన్వయక్రమము:- మహాతేజాః, మహాబాహుః, సుమిత్రానందవర్ధనః సః లక్ష్మణశ్చ, త్వామ్ అభివాద్య కౌశలమ్ అబ్రవీత్.
ప్రతిపదార్థము:- మహాతేజాః = తేజశ్శాలియును, మహాబాహుః = పరాక్రమ శాలియును, సుమిత్రానందవర్ధనః = సుమిత్రానందనుడును అగు, సః లక్ష్మణశ్చ = ఆ లక్ష్మణుడు గూడ, త్వామ్ అభివాద్య = నీకు వందనముచేసి, కౌశలమ్ అబ్రవీత్ = కుశల మడిగినాడు.
రామస్య చ సఖా దేవి సుగ్రీవో నామ వానరః ।
రాజా వానరముఖ్యానాం స త్వాం కౌశలమబ్రవీత్ ॥36॥
నిత్యం స్మరతి తే రామః ససుగ్రీవః సలక్ష్మణః ॥37॥
పదచ్ఛేదము :- రామస్య – చ – సఖా – దేవి – సుగ్రీవః – నామ – వానరః – రాజా – వానరముఖ్యానాం – సః – త్వాం – కౌశలమ్ – అబ్రవీత్ ॥ నిత్యం – స్మరతి – రామః త్వాం – ససుగ్రీవః – సలక్ష్మణః ॥
అన్వయక్రమము :- దేవి! రామస్య సఖా, వానరముఖ్యానాం రాజా సః సుగ్రీవో నామ వానరః చ త్వాం కౌశలమ్ అబ్రవీత్. ససుగ్రీవః సలక్ష్మణః రామః నిత్యం త్వాం స్మరతి.
ప్రతిపదార్థము :- దేవి! = ఓ పూజ్యురాలా! రామస్య సఖా = శ్రీరామునకు మిత్రుడును, వానరముఖ్యానాం రాజా = వానరశ్రేష్ఠులకు ప్రభువును అగు, సః సుగ్రీవః నామ వానరః చ = ఆ సుగ్రీవుడను వానరోత్తముడు గూడ, త్వాం = నిన్ను, కౌశలమ్ అబ్రవీత్ = క్షేమ మడిగినాడు.
ససుగ్రీవః = సుగ్రీవునితో గూడినవాడును, సలక్ష్మణః = లక్ష్మణునితో గూడినవాడును అగు, రామః = శ్రీరాముడు, నిత్యం = ఎల్లప్పుడును, త్వాం = నిన్ను, స్మరతి = స్మరించుచున్నాడు.
సీ.నీ వియోగమ్మున నెరగుందు నాథుండు,సౌమిత్రి తేజస్వి సాంజలి సేయుచు,రాఘవు మిత్రుండు రాజు సుగ్రీవుండు,సోదరు తోడను సుగ్రీవు తోడను,
దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసీవశమాగతా ।
నచిరాద్ ద్రక్ష్యసే రామం లక్ష్మణం చ మహారథం ।
మధ్యే వానరకోటీనాం సుగ్రీవం చామితౌజసం ॥38॥
పదచ్ఛేదము:- దిష్ట్యా – జీవసి – వైదేహి – రాక్షసీవశమ్ – ఆగతా – న – చిరాత్ – ద్రక్ష్యసే – రామం – లక్ష్మణం – చ – మహారథమ్, – మధ్యే – వానరకోటీనాం సుగ్రీవం – చ – అమితౌజసమ్ ॥
అన్వయక్రమము :- వైదేహి! రాక్షసీవశమ్ ఆగతా, (త్వం) దిష్ట్యా జీవసి; వానరకోటీనాం మధ్యే అమితౌజసం సుగ్రీవం, మహారథం లక్ష్మణం, రామం చ నచిరాత్ ద్రక్ష్యసి.
ప్రతిపదార్థము :- వైదేహి = ఓ సీతాదేవీ! రాక్షసీవశమ్ ఆగతా = రాక్షసులకు చేజిక్కినట్టి, (త్వం = నీవు), దిష్ట్యా = అదృష్టవశముచే, జీవసి = జీవించియున్నావు, నచిరాత్ = త్వరలోనే, మహారథం రామం = మహావీరుడైన శ్రీరాముని, లక్ష్మణం చ లక్ష్మణుని, వానరకోటీనాం మధ్యే = వానరకోటుల నడుమ, అమితౌజసం = అపారమైన ప్రతాపముగల, సుగ్రీవం చ = సుగ్రీవుని కూడ, ద్రక్ష్యసే = కనుగొనగలవు.
తే.గీ.రక్కసులకు జిక్కి వెతల స్రుక్కబడియు,ప్రాణములతోడ నుండ నీ భాగ్యవశమె!అతిమహారథుడగు రాము డనతికాల-ముననె కాచును నిన్నిట, ఘనతమీర!
కం.రాక్షస వనితల వశమున,దీక్షను నిలిపితివి బ్రతుకు దీవెన దొరికెన్!వీక్షింతువు రాముని, నినురక్షించగ కపులగూడి రావణు జంపన్!
అహం సుగ్రీవసచివో హనూమాన్ నామ వానరః ।
ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిం ॥39॥
కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః
త్వాం ద్రష్టుముపయాతోఽహం సమాశ్రిత్య పరాక్రమం ॥40॥
పదచ్ఛేదము:- అహం – సుగ్రీవసచివః – ప్రవిష్టః – నగరీం – హనుమాన్ – నామ – వానరః – లంకాం – లంఘయిత్వా – మహోదధిమ్, కృత్వా – మూర్ధ్ని –
పదన్యాసం – రావణస్య – దురాత్మనః – త్వాం – ద్రష్టుమ్ – ఉపయాతః – అహం – సమాశ్రిత్య – పరాక్రమమ్ ॥
అన్వయక్రమము:- అహం, సుగ్రీవసచివః హనుమాన్నామ వానరః మహోదధిం లంఘయిత్వా, లంకానగరీం, ప్రవిష్టః (సన్), దురాత్మనః రావణస్య మూర్ధ్ని పదన్యాసం కృత్వా పరాక్రమం సమాశ్రిత్య అహం త్వాం ద్రష్టుమ్ ఉపయాతః అస్మి.
ప్రతిపదార్థము:- సుగ్రీవసచివః = సుగ్రీవుని మంత్రిని, హనుమాన్నామ వానరః = హనుమంతుడను పేరుగల వానరుడనైన, అహం = నేను, మహోదధిం మహాసముద్రమును, లంఘయిత్వా = దాటి, లంకానగరీం = లంకానగరమును, ప్రవిష్టః (సన్) = ప్రవేశించినవాడనై, పరాక్రమం సమాశ్రిత్య = పరాక్రమమును బూని, దురాత్మనః = దుర్మార్గుడైనట్టి, రావణస్య = రావణునియొక్క, మూర్ధి తలపై, పదన్యాసం కృత్వా = పాదమును మోపి, త్వాం ద్రష్టుం = నిన్ను కనుగొనుటకై, అహం = నేను, ఉపయాతః అస్మి = వచ్చియున్నాను.
తే.గీ.అర్కజు సచివుడను నన్ను హనుమ యండ్రుకడలి దాటియు లంకపై కాలు మోపి,దుష్టరావణు శిరమును త్రొక్కి నేను,నెగపు మీరగ వచ్చితి నిన్ను జూడ!
నాహమస్మి తథా దేవి యథా మామవగచ్ఛసి ।
విశంకా త్యజ్యతామేషా శ్రద్ధత్స్వ వదతో మమ ॥41॥
పదచ్ఛేదము:- న – అహం – తథా – దేవి – యథా – మామ్ – అవగచ్ఛసి – విశంకా – త్యజ్యతామ్ – ఏషా – శ్రద్ధత్స్వ – వదతః – మమ ॥
అన్వయక్రమము:- దేవి! (త్వం) యథా మామ్ అవగచ్ఛసి, అహం తథా న అస్మి; ఏషా విశంకా త్యజ్యతామ్; వదతః మమ శ్రద్ధత్స్వ.
ప్రతిపదార్థము:- దేవి! = ఓ పూజ్యురాలా; (త్వం = నీవు) యథా = ఏరీతిగా, మాం అవగచ్ఛసి = నన్ను తలచుచున్నావో, అహం = నేను, తథా = ఆ రీతిగా, న అస్మి = కాను (సుమా), ఏషా విశంకా = ఈ యనుమానము, త్యజ్యతాం = విడువబడుగాక! వదతః మమ శ్రద్ధత్స్వ = (నీతో) మాటాడుతున్న నన్ను నమ్ముము.
కం.కలతను మానుము సుదతీ,తలపకు నన్నిట కపటపు దనుజుని రీతిన్!పలుకులు నమ్ముము దేవీ!వలదిక శంకయు మనసున భయమును విడుమా!