వ్యవహారిక భాషా బహిష్కార నిరసనము

[ఈ వ్యాసము భారతి మొదటి సంపుటి (1924) 5-6 సంచికలో తోలిసారిగా ముద్రణ పొందింది. 1933 లో గిడుగు సప్తతితమ జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రచురించిన వ్యాసావళిలో దీనిని పునర్ముద్రించారు. ఆ వ్యాసావళిని మాకు అందజేసిన వాడపల్లి శేషతల్పశాయిగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలలు – సం.]

పరిషత్తు వారు చాలా ధనము కర్చుపెట్టి చాలా శ్రమపడి వ్యావహారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశమునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను, ప్రభుత్వమువారిని, విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యధార్థమైనవి కావనిన్నీ, దురభిమానముచేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చినారనిన్నీ ఈ వ్యాసము నందు ఋజువు చేస్తాను.

వ్యవహారిక భాషా బహిష్కార నిరసనము (pdf, 1.99 MB)


గిడుగు రామమూర్తి పంతులు

రచయిత గిడుగు రామమూర్తి పంతులు గురించి:

గిడుగు వెంకట రామమూర్తి (1863 – 1940) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాం.

 ...