మొట్టమొదటగా పికాసో చిత్రాలను చూచి సంభ్రమాశ్చర్యాలను పొందాడు బ్రాక్. తాను ఇంతవరకు చూడని క్రొత్త పద్ధతి, పికాసో యొక్క చిత్రకళా విధానం ఇతన్ని కలవరపరిచినై. తాను చేసే ఫావిౙమ్ పద్ధతితో ఇక లాభం లేదు, ఏదో మార్పు తేవాలి తన చిత్రాలలో అనుకున్నాడు. అందుకే ద్విగుణీకృత నిశ్చయంతో చిత్రాలను వెయ్యడం ప్రారంభించాడు.
ఎస్. వి. రామారావు
- పూర్తిపేరు
- సిరందాసు వెంకట రామారావు
- సొంత ఊరు
- గుంటూరు
- ప్రస్తుత నివాసం
- చికాగో
- వృత్తి
- చిత్రకారులు
జీవిత విశేషాలు
ఎస్. వి. రామారావు భారత సంతతికి చెందిన బ్రిటిష్ చిత్రకారులు. క్యూబిస్ట్ చిత్రకళలో ప్రావీణ్యులు. కామన్వెల్త్ ఫెలోషిప్ పొందారు. వీరిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.