అది నువ్వు ఎక్కుపెట్టిన బాణం కాదు
వాక్ స్వాతంత్ర్యపు ఆభరణమూ కాదు
సారం లేని మాటల తూటాల రణం
గుంపు మనస్తత్వ వ్రణం
అణువంతైనా సంయమనం లేని
క్షణికావేశపు అణ్వస్త్రం
ఆత్మాహుతి దళం
అనిసెట్టి శ్రీధర్
- సొంత ఊరు
- నరసరావుపేట
జీవిత విశేషాలు
అనిసెట్టి శ్రీధర్ రాసిన పలు కథలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 15 కథలతో 2008లో తీసుకొచ్చిన ‘కొత్త బంగారులోకం’ కథా సంపుటిని కారా మాస్టారు ఆవిష్కరించారు. ‘నివేదన’ కవితా సంపుటిని తీసుకొచ్చారు. ‘పాతసామాను’, ‘మద్దతు’, ‘జనజీవన స్రవంతి’, ‘శాహా వర్సెస్ మాహా’, ‘కొత్త బంగారు లోకం’ కథలకు బహుమతులు అందుకున్నారు. 1993లో వచ్చిన ఇరవై ఉత్తమ కథల్లో ఒకటిగా ఈయన రాసిన ‘నెత్తురు కూడు’ కథ ఎంపికైంది.