ఎం. పి. అనిల్ కుమార్
జీవిత విశేషాలు
కేరళలో జన్మించిన ఎం. పి. అనిల్ కుమార్ (1964-2014) భారతీయ వాయుసేనలో మిగ్-21 ఫైటర్ పైలట్‌గా పనిచేసేవారు. 24యేళ్ళ వయసులో జరిగిన ఒక మోటర్‌సైకిల్ ప్రమాదంలో అతని మెడ క్రింది శరీరమంతా అచేతనమయిపోయింది. జీవితమంతా చక్రాల కుర్చీలో గడపవలసి వచ్చింది. ఆ సమయంలో, అతను నోటితో కలం పట్టుకొని రాయడం నేర్చుకున్నారు. 1994లో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నిర్వహించిన కౌంటర్ పాయింట్ వ్యాసరచన పోటీలలో అతను నోటితో రాసిపంపిన వ్యాసానికి–ఎయిర్‌బార్న్ టు ఛెయిర్‌బార్న్–ప్రథమ బహుమతి లభించింది. ఆ వ్యాసం నిజంగా నోటితో రాయబడినదని కిర్కీ పారాప్లీజిక్ హోమ్‌ను సంప్రదించి నిర్ధారించుకొనేదాకా ఆ పోటీ నిర్వాహకులు నమ్మలేకపోయారట. ఆపై ఆ వ్యాసాన్ని అలానే యథాతథంగా ప్రచురించారు. ఆ వ్యాసం ఎంతో ప్రాచుర్యాన్ని పొంది, ఎందరికో గొప్ప స్ఫూర్తినిచ్చింది. చివరి క్షణందాకా మానవ జీవనస్ఫూర్తికి నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు అనిల్.
No articles found.