రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మెటామెలొడీ

రచన: వఝల శివకుమార్
జనవరి 2026

​మెట్రోపాలిటన్ ఆంబియంట్ శూన్యంలో,
నా గొంతుక కేవలం కరప్ట్ అయిన ఆడియో ఫైల్.
కాంక్రీటు మ్యాట్రిక్స్ క్రింద, నాడుల స్పందన
ఒక సిస్టమ్ గ్లిచ్‌లా రికార్డయింది.

నా ఆత్మలో
అలజడి మాత్రం ఆగిపోలేదు;
ఫైబర్ ఆప్టిక్ తీగలకు అతీతంగా,
అనంతపు కోడ్‌లో,
ఒక అసంపూర్ణ ఆర్కెస్ట్రాను
నేను కంపోజ్ చేస్తున్నాను.

​ఏ లాగ్-ఆఫ్ క్షణాన, ఈ రాగం
నీ ప్రొఫైల్‌కు శ్రుతి కలుపుతుందో?
యాంటీ-వైరస్ స్కాన్ దాటి, నా స్వరం వెనుక
దాగున్న ఏకాంతపు ఆల్గరిథమ్ ఎప్పుడు నీకు అర్థమౌతుందో?

ఈ డిజిటల్ తెరల ఫైర్‌వాల్ వెనుక,
నిన్ను చేరేందుకు నా పాటకు
ఇప్పుడు రియల్-టైమ్ కనెక్షన్ లేదు;
వాస్తవానికి
నా కళకు లైక్ బటన్ నొక్కే హృదయాలు,
ఈ ట్రెండ్ లో ఫేడ్ ఔట్ అయ్యాయి.
​నిజానికి, ఈ లాభనష్టాల డేటాసెట్‌లో,
నీ మనసు, ఆకాశం లేని క్లౌడ్-స్టోరేజ్‌లా మిగిలిపోయింది.

అవసరాల అడ్వర్టైజ్‌మెంట్లలో పడి,
భావ దారిద్య్రపు టోపోగ్రఫీలో దాహంతో ఎండిపోయావు.
రియాలిటీ ఫిల్టర్‌ను కోల్పోయిన శూన్యంలో మిగిలిపోయావు.

​నా ఫ్రీక్వెన్సీ నీ సెన్సార్‌కు దూరమయ్యాక,
నీ అంతరంగపు సంగీతం శాశ్వతంగా మ్యూట్ అయిపోయింది.
శూన్యంలో తేలుతున్న శిథిల స్మారక స్తూపాలు
నీ మ్యూట్ బటన్‌ను చూసి వ్యంగ్యంగా నవ్వుకుంటున్నాయి.

​ఈ లోహ మోహాల నియోన్ జ్వరంలో,
కళా విన్యాసాలలోని నిప్పూ,
ఆ కాసిన్ని కనీసపు కదలికలూ,
నిరాశలో బూడిదయ్యే లోపు.
మరొక్కసారి,
నీలోని డార్క్ మోడ్‌ను ఛేదించుకొని,
హృదయాకాశంలో మేఘాలై పురివిప్పుకుంటున్న
గానాలను విను!

​ఇరుకు బంధాల పిక్సెల్స్‌ను విదిలించి,
పిరికి మౌనాల స్క్రీన్‌ను పగులగొట్టి,
సింథటిక్ కాంతి కిరణాలు,
తొలి వర్షాన్ని తాకినంత తీవ్రంగా,
నా స్వరాన్ని ఒక్కసారి,
లోలోపలి స్పందనతో ఆలకించు.

నా నాడుల మీద అవతరించి,
ఊపిరి పోసుకుంటున్న పాటను,
డౌన్‌లోడ్ చేసుకో!
నా పాట పల్లవి నుంచి
చరణాల దాకా అన్నింటినీ
నీ సిస్టమ్‌కు రీబూట్ పాయింట్స్‌లా అలింగనం చేసుకో.
ప్రేమ అనే పాత ప్రోటోకాల్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకో!

***

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మెటామెలొడీ

ఇటువంటివే…

  1. మేకప్
  2. అబ్బ.. పోనిద్దూ!
  3. మంకుతిమ్మని మరో మిణుకు — 1 (1-10)
  4. స్వేచ్ఛాభారం
  5. ప్రణయసరణి

జనవరి 2026 సంచికలో ...

  • అగరు ధూమం
  • అస్తిత్వవాద సాహిత్యం: 4ఇ. లూయిజీ పిరాండెలో
  • ఈ శ్లోకకర్త వరరుచి ఏ ప్రాంతం వాడు?
  • ఓ ప్రేమ కథ
  • ఓడిస్సీ – 2: మహాప్రస్థానం
  • కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు
  • జనవరి 2026
  • జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నమే నా కవిత్వం
  • డాక్టర్ భార్గవి ‘నా చదువు కథ’
  • తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం
  • పదిలక్షల పాదాలు
  • పీచర సునీతారావు 2025 సాహిత్య పురస్కారాలకు ఆహ్వానం
  • పోతన భాగవతంలో దృశ్యీకరణం – 4
  • ప్రణయసరణి
  • మంకుతిమ్మని మరో మిణుకు — 1 (1-10)
  • మంకుతిమ్మని మరో మిణుకు: పరిచయం
  • మనసులు దోచే మనస్లు– 1
  • మెటామెలొడీ
  • యూట్యూబ్‍లో ఈమాట: డిసెంబర్ 2025
  • రాయలేని కత
  • విన్నకోట రవిశంకర్ కవిత్వ సంశోభ
  • విషయమా? ఉచ్చారణా?
  • స్వేచ్ఛాభారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అగరు ధూమం
జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నమే నా కవిత్వం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.