“దిస్సీజ్ మై వొయిఫ్ …. అన్నమేరి! అవర సన్ మేక్ పీస్!” అన్నాడు. అలాగే మర్యాదగా ముభావంగా నవ్వి “నమస్తే ఆంటీ!” అని, అంతలోకే తను తప్పు విందేమోనని సందేహంగా “బాబు పేరేంటంకుల్ ?” అంది. ఆయన పెద్ద పెట్టె, చిన్న పెట్టె రెండు చేతుల్తో ఎత్తి పట్టుకున్న కష్టం నిగ్రహించుకుంటూ “మేక్ పీస్ ” అనే అన్నాడు మళ్ళీ.

జ్ఞాపకముందా?
చిన్నప్పుడు అమ్మ వేలు పట్టుకుని నువ్వు నడుస్తున్నప్పుడు
భూమ్మీద పరుచుకున్న వర్షపు నీటి అద్దాలు నీలి మైదానాలైతే
ఆ నీలి మైదానాల్లో పరుగెత్తే మబ్బు పిల్లలతో ఉరుకుడు పందెం కాచి
బొక్కాబోర్లాపడి తడిసిపోయింది

ఈ ఇప్లవం అనేటోళ్ళను జెయిల్ల పెడితె నా కొడుకు రాడు. ఆళ్ళు ఇప్పుడు చెప్పినట్టే ఒక మనిషిని చంపితే ఇప్లవానికి పనికొస్తది అని చెప్పకుండా ఆగరు.

ప్రేమ వివాహాల్లో ఒకరంటే ఒకరికి ఎక్స్పెక్టేషన్స్‌ చాలా ఎక్కువగా ఉండటం వలన. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసునని ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉందని ఆ ప్రేమ వలన ఏ త్యాగమైనా చేయటానికి ఎదుటివారు అనుక్షణం సిద్ధంగా ఉంటారని ఆశిస్తారు. అవన్నీ నిజం కాదన్న చేరు రుచి తెలియగానే, ఇదిగో, మీ ఇద్దరిలాగే తలక్రిందులౌతారు.