జనవరి 2005

“ఈమాట” పాఠకలోకానికి నూత్న వత్సర శుభాకాంక్షలు!2004 తో “ఈమాట” కు ఆరేళ్ళు నిండాయి. ఇంతకాలం పాటు మా మీద నమ్మకం ఉంచి ఆదరించి ప్రోత్సహించిన పాఠకులకు, రచయిత్రు(త)లకు, శ్రేయోభిలాషులకు మా అభివందనాలు.

తొలినాళ్ళ నుంచి “ఈమాట” కోసం రచనలు అందిస్తూన్న ప్రముఖులు కనకప్రసాద్‌, కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, చంద్ర, వెల్చేరు నారాయణరావు, మాచిరాజు సావిత్రి ప్రభృతుల్ని ఈ సందర్భంగా ప్రత్యేకించి పేర్కొనటం సమంజసం.

“ఈమాట” పాఠకగణం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా అమెరికా బయటనుంచి ఎక్కువ రచనలు రావటం లేదు. ఇతరదేశాల రచయిత్రు(త)లని ఈసత్కార్యంలో పాలుపంచుకోమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

వేలూరి వేంకటేశ్వరరావు గారు ఈమధ్యనే “ఈమాట” సంపాదక బాధ్యతల్ని స్వీకరించి ఈ పత్రిక ను ఇంకా సర్వాంగసుందరంగా తయారుచేయటానికి సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. వారికి మనందరి సహకారం, ప్రోత్సాహం అవసరం.

పాఠకుల అభిప్రాయాలు అవి ఎలాటివైనా సరే రచనాకారులకు ఎంతగానో ఉపకరిస్తాయి. మీమాట కోసం వారు ఎదురుచూస్తూంటారని గుర్తించండి. మనందరి భాగస్వామ్యంలో “ఈమాట” ఇలా నిర్విరామంగా నిరంతరంగా సాగుతూనే వుండాలని ఆశిస్తూ