రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మే 2000

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఎప్పట్లానే ఈ సంచికలో కూడ కొన్ని విశేషాలున్నయ్‌.

సంగీతం తెలియక పోయినా శ్రావ్యమైన పాటల్ని విని అందరం ఆనందిస్తాం. ఐతే ఆ పాట వెనక ఉన్న సంగీతం గురించి కొంత తెలిస్తే ఇంకా ఆనందించటానికి అవకాశం పెరుగుతుంది. కాని, ఎందువల్లనో గాని మనకు దొరికే సంగీత పుస్తకాలు చదివి అర్థం చేసుకోవటం సంగీతవిద్వాంసులకే తలకు మించిన పనౌతుంటుంది చాలా సార్లు. సామాన్యుల కోసం, సామాన్యుల భాషలో, అందరికీ తెలిసిన సినిమాపాటల్ని ఉదాహరణలుగా వాడుతూ మోహనరాగాన్ని వివరించే ఒక మల్టిమీడియా వ్యాసాన్ని ఇస్తున్నాం. ఇక్కడ ఓ పాట గురించి చెప్పే సందర్భంలో దాన్ని వినటానికి కూడ లింకులిచ్చాం.

విన్నకోట రవిశంకర్‌ కవిగా చిరపరిచితులు. ఇప్పుడు నాటికారచయితగా కూడ పరిచయం ఔతున్నారు. ఆయన రాసి, సౌత్‌ కేరలైనా లోని కొలంబియాలో ప్రదర్శింపజేసిన ఒక నాటిక ఈ సంచికలో ఉంది.దీన్ని ఎవరైనా ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు. ఐతే రచయితకు  ఈమెయిల్‌ అడ్రసుకి తెలియజేయటం మర్యాద.

అలాగే, కథకుడిగా, కవిగా ఒక ప్రత్యేకస్థానాన్ని సాధించిన శ్రీ కనకప్రసాద్‌ ఒక ధారావాహిక నాటికను రాస్తున్నారు. విశాఖ మాండలీకంలో అతిసహజమైన రచనలు చేసే శ్రీ ప్రసాద్‌ గారి ఈ ప్రయోగం రసికపాఠకులందరికీ ఆనందదాయకమౌతుందని మా విశ్వాసం.

ఇక “ప్రభావతీప్రద్యుమ్నం” తో మొదలైన సంప్రదాయ కథాలహరిని కొనసాగిస్తూ ఈ సారి కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదని తేలిక తెలుగులో అందిస్తున్నాం. పండితుల్లోనే చాలా కొద్దిమంది చదివే ఈ రచన ఎన్నో అందాల్నీ విశేషాల్నీ తనలో దాచుకుంది. “అసలు ఈ ఆముక్తమాల్యదలో ఏముందో” అనే ఏమాత్రం కుతూహలం ఉన్నవారైనా ఇలా సూక్ష్మంలో మోక్షం సంపాయించెయ్యొచ్చు.

(సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి

రచన: పరుచూరి శ్రీనివాస్

[ఈ వ్యాస రచనకు Randor Guy రాసిన “B.N. Reddy – A monograph” (National Film Archives of India, Pune, 1985) […]

11

శ్రుతిమించిన రాగం

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం కానిదంతా (జానపద సంగీతం తప్ప) లలిత సంగీతమే అనే భావన ఉండేది. అందులో భావగీతాలూ, సినిమా పాటలూ అన్నీ భాగంగా […]

0

తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన

రచన: వేమూరి వేంకటేశ్వర రావు

(శ్రీ వేమూరి గారి అంకెలు, సంఖ్యల వ్యాసాల పరంపరలో ఇంతవరకు “ఈమాట”లో ఒకటి నుంచి ఐదు వరకు ప్రచురించాం. 6 నుంచి పది వరకున్న […]

5

హెల్లో…శంకరం…

రచన: కె. వి. గిరిధరరావు

“ఈ టైంలో ఎవరబ్బా …” విసుగ్గానే ఫోనందుకున్నాను. “హలో ” సాధ్యమైనంత సౌమ్యంగానే. “ఓ మీరా… ఇంటి దగ్గర్నుంచేనా నేనిప్పుడే చేస్తాను పెట్టేయండి” అన్నాన్నేను. […]

3

రాగలహరి: మోహనం

రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న

(సంగీతంలో ప్రవేశం లేనివాళ్ళు కూడా, సంగీతం విని ఆనందిస్తారన్నది అందరికీ తెలిసిందే! ఐతే, సంగీతంలో కాస్త పరిచయం కలిగినా సంగీతాన్ని ఇంకా ఎక్కువగా విని […]

17

చీకట్లో సన్మానం

రచన: వంగూరి చిట్టెన్‌ రాజు

చంటిగాడూ, నేనూ చిన్నప్పటినుంచీ నేను అమెరికా వచ్చేదాకా, ఇంచుమించు, కలిసి పాఠాలు నేర్చుకున్నాం, కానీ కలిసి చదువుకో లేదు. ఎందుకంటే వాడు చదివితే, నేను […]

0

కట్టమంచి వారి “కవిత్వతత్వ విచారం”

రచన: వల్లంపాటి వెంకట సుబ్బయ్య

(వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు విమర్శకుడిగా, కవిగా, అనువాదకుడిగా , కథకుడిగా ప్రసిద్ధులు. వీరి “కథాశిల్పం”, “నవలాశిల్పం” ఎన్నో ప్రశంసలనందుకున్నాయి. నిష్పాక్షికంగా తెలుగు సాహిత్యవిమర్శ చేస్తున్న […]

1

అమెరిగల్పిక – ఎఫిషియెన్సీ, ప్లీజ్‌

రచన: ఎస్‌. నారాయణస్వామి

సుబ్బారావు ఒక పెద్ద కంపెనీలో ఒక చిన్న మాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీకి ప్రొడక్షన్‌ మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఒక రోజు ఉదయం ప్రొడక్షన్‌ ఫ్లోర్‌ పై తన […]

1

A Poem at the Right Moment: An Introduction

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

(Sri Veluri Venkateswara Rao is well-known to the Internet Telugu community for his deeply insightful and humorous commentaries […]

3

e తరమ్‌ (నాటిక )

రచన: విన్నకోట రవిశంకర్

( మధ్య తరగతి ఇంట్లో డ్రాయింగురూము. ఒక పెద్దాయన కూర్చుని పేపరు చదువుతూ ఉంటారు. ఆయన పేరు రామ శర్మ ఆ కుటుంబానికి చిరకాలంగా […]

0

చాసో పాత్రలు వెల్చేరువారి ఆరోపణ

రచన: జంపాల చౌదరి

(తానా పత్రికకు చిరకాలంగా సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన […]

1

తమాషా దేఖో

రచన: కనకప్రసాద్

(కనకప్రసాద్‌ గారు నాటికతో దగ్గరి సంబంధం ఉన్న ఈ కవితను కూడ దాన్తో కలిపి ప్రచురించమని కోరేరు. అలాగే చేస్తున్నాం.) మహా కరుణ అనుభవాలమీది […]

0

కొత్త పదకేళి

రచన: సోమయాజుల కాశీ విశ్వనాధం

(కాశీ విశ్వనాథం గారు యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌లో పనిచేస్తారు. సాహిత్యం, సంగీతం, కూచిపూడి నాట్యాల్లో అభిరుచి, ప్రవేశం ఉన్నవారు.) పదాలలో పదాలు దాక్కోవటం ఒక […]

1

కృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద”

రచన: కె. వి. ఎస్. రామారావు

(ఆముక్తమాల్యద చాలా విలక్షణమైన కావ్యం. మనుచరిత్ర, పారిజాతాపహరణం వచ్చిన కాలంలోది ఇది. ఐనా వాటికీ, దీనికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఆముక్తమాల్యద శృంగారప్రబంధం కాదు […]

0

నిశ్చయం

రచన: టి. శ్రీవల్లీ రాధిక

(టి. శ్రీవల్లీ రాధిక హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నలభైకి పైగా కథలు ప్రచురించారు. “రేవు చూడని నావ” అనే కవితాసంపుటి కూడా. “నా […]

0

ఒక కాఫ్కా కలగ జేసుకుంటే

రచన: త్రిపుర

పుత్తడి బొమ్మలాగో వెండి ముగ్గులాగో అప్పుడప్పుడు పుచ్చిపోయిన దంతాల్లాగో చింపిరి కాన్‌వాసుల్లాగో ఎప్పట్నించో కన్పిస్తున్న ప్రకృతి శోభల్ని చూసి చూసి చూసి ఇక లాభం […]

0

శ్మశానవాటి (పేరడీ)

రచన: కె. వి. ఎస్. రామారావు

(శ్మశానాన్ని గురించిన జాషువా గారి పద్యాలు చాలా ప్రఖ్యాతమైనవి. ఎంతో గొప్ప భావాల్ని పొదువుకున్నవి. వాటికి పేరడీగా ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లో జరుగుతున్న ఒడుదుడుకుల […]

2

నూతన సహస్రాబ్దికి స్వాగతం

రచన: జి. దుర్గాప్రసాద్‌

(శ్రీ దుర్గాప్రసాద్‌ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉంటారు. హైస్కూలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైరయ్యారు.) కాలమహిళ మళ్ళీ ఓ నూతన శిశువుకు జన్మనిస్తున్న శుభ […]

0

ఆనంద విషాద యోగం

రచన: హరి మద్దూరి

అనగనగా అమెరికాలో ఆనందరావనే ఆంధ్రుడున్నాడు. ఆస్టిన్లో ఉండి అంతులేని ఆవేదన పడుతున్నాడు. అతనికళ్ళలో ఏదో బాధ కనపడుతోంది. ఉద్యోగంలేదా? బంగారంలాంటిది ఉంది. భార్య లేదా? […]

0

మనిషి మృగం

రచన: కలశపూడి శ్రీనివాసరావు

మనిషికి మృగానికి భేదం ఆలోచనే అన్నది నిర్వివాదం. మృగాన్ని మనిషిగా చేసిన ఆలోచన మనిషిని ఋషిగా మార్చే ఆలోచన “నాకు” మాత్రమే పరిమితమైతే మనిషిని […]

0
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.