ఒచ్చిన కొత్తల్లో తను కూడా అలాగే అనుకొనేది. అన్నం వేష్ట్ చెయ్యకూడదు, కూర వేష్ట్ చెయ్యకూడదు అని. ఇప్పుడు అదంతా సిల్లీగా ఉంటుంది. చెత్త కుండీల దగ్గర ఇంకా రంగైనా పోని సోఫాలు, మంచి టీవీలూ టేబిళ్ళూ పడీసుంటాయి. బట్టలు చెప్పులు తనకెన్నున్నాయో తనకే గుర్తుండదు. పిల్లలూ ఒక నాలుగు సార్లు తొడుక్కుని చెప్పులూ బట్టలూ ‘Yuk!’ అని పడెస్తారు.

కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము.

అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం వచ్చింది.

తెలుగు సాహిత్యం నిలిచివుండాలంటే దాన్ని ఆంగ్లంలోకి అనువదించటమే ఇప్పుడున్న ఏకైక సాధనం. ఎంతో కాలం నుంచి నిర్విరామంగా ఈ కృషిని కొనసాగిస్తున్న నారాయణరావు, షుల్మన్ గార్లను మనం ప్రత్యేకించి అభినందించాలి.

అనువాదం అనువదించబడే భాషలో సాహిత్య స్థానాన్ని సంపాదించ లేక పోతే అది ఎంత విధేయంగా వున్నా అది సాహిత్యానువాదం కాదు. అంచేత సాహిత్యానువాదకుల పని ప్రధానంగా తాము అనువదించిన భాషలో తమ అనువాదానికి సాహిత్యస్థానాన్ని సంపాదించుకోవటమే.

ఈ “శిలాలోలిత” అనుభూతి, నాది. ఈ “శిలాలోలిత” హృదయం, నాది. ఈ “శిలాలోలిత” గొంతు, నాది కాకపోవచ్చు. ఈ “శిలాలోలిత” భావాలు, నావి కాకపోవచ్చు. […]

నేనెవరినో మీకెవరికీ తెలియదు ఆర్తిసెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు […]

మరో శిశువు పుట్టగొడుగులా మొలుచుకొచ్చింది ఈ పొగలోకి ఈ చీకట్లోకి ఈ బొగ్గులోకి ఈ మసిలోకి ఈ బురదలోకి ఈ పేడలోకి ఈ మురికిలోకి […]

ఈ రైలు ఆ ఊరెడుతోంది రైల్లో కూచునున్న నేనూ ఆ ఊరే వెడుతున్నానా ఈ రైలుపెట్టెలో అటునుంచిటుకి పాకే ఆ చీమ ఎటెడుతున్నట్లు ఈ […]

జననం

పాతిక లాలసాతప్త దేహాల పరిమళాలతో ఐదు మంచుపర్వతాల సౌందర్యాలతో అసంఖ్యాక జంటగోళాల చలన సంగీతంతో వెయ్యి కళ్ళ మమతల నీలి కాంతులతో శతకోటి చల్లని […]

అనాచరణ

చెప్పేదీ చేసేదీ ఒకటి కానక్కర్లేదంటే అబ్బో చెప్పలేనిదంటూ ఉండదు నేల నుంచీ నింగి దాకా ప్రగల్భించొచ్చు అందుకేగా సాహిత్యం అంత చవకా విలువ తక్కువా

నడిరాతిరి చప్పుడు లేదు వెలుతురు లేదు గాలిలేదు చీకటిలో నిద్రలో నడిరేతిరి నడిరేతిరి నిద్రలో నిద్రరాత్రి మధ్యలో ఎక్కడో ఎవరిదో తల్లికడుపు చీల్చుకొచ్చిన శిశువుకేక […]

నాకు ఆకలేసినప్పుడు కేకలేసే ఓపిక్కూడా లేక సొమ్మసిల్లినప్పుడు ప్రణాలికలన్నారు సస్యశ్యామలమన్నారు సర్వోదయమన్నారు మావోదయమన్నారు ప్రజాస్వామ్యమన్నారు సామ్యవాదమన్నారు రక్తపాతమన్నారు ఓట్లన్నారు వల్లకాడనలేదు ఎన్నో అన్నవాళ్ళేకానీ పట్టెడన్నం […]