(కాశీ విశ్వనాథం గారు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్లో పనిచేస్తారు. సాహిత్యం, సంగీతం, కూచిపూడి నాట్యాల్లో అభిరుచి, ప్రవేశం ఉన్నవారు.)
ఒక ఐదు ఆక్షరాల పదం కనుక్కోవాలి. దీన్లో మూడేసి అక్షరాలు ఇచ్చిన వరసలో కలిస్తే వచ్చే పదం అర్థం ఎలాటిదో ఇప్పుడు ఇవ్వబడుతోంది. వాటిని బట్టి ఈ ఐదక్షరాల పదం ఏదో కనుక్కోండి!
2 3 5 గణిత సంబంధము (అంటే రెండో అక్షరం, దాని తర్వాత మూడో అక్షరం, దాని తర్వాత ఐదో అక్షరం కలిసి వచ్చే పదం గణిత సంబంధమైందన్న మాట; మిగిలినవి అన్నీ ఇలాగే).
1 4 5 శరీర సంబంధము
4 3 5 నాద సంబంధము
4 1 5 విభాగ సంబంధము
1 2 5 విద్యార్థి సంబంధము
3 4 5 దైవ సంబంధము
1 3 2 సమాన సంబంధము
క్రితం సంచికలో ఇచ్చిన పదకేళి స రి గ మ ప ద ని లని, సున్న నీ మాత్రమే ఉపయోగించి అర్థవంతమైన వాక్యాలను తయారుచెయ్యటం. పొడవైన వాక్యాల్ని తయారు చేసిన వారు, వారి వాక్యాలు ఇక్కడ ఇస్తున్నాం. వారికి, ఉత్సాహంగా ప్రయత్నించిన మిగిలిన వారికి మా అభినందనలు. పాల్గొన్న వారందరు చాలా ఉత్కంఠ కలిగించే వాక్యాలు నిర్మించారు!
అన్నిటిలోనూ పొడవైన వాక్యం పంపిన వారు ఫణి సరిపల్లి
ఆ వాక్యం ఇది
గంగ, మంగ గంగ దరి గంప సంపద గని
సరిగ సగం, సగం గంగ పంపంగ
గరిమ సంపద గని మంద,
మంగ, గంగని పగగ గసరి
సమం పసగదని నిందగ…..,
గంగ దమంగ, సంపద గంగ దని, పద సరిగ పదమని.
ఫణి సరిపల్లి
పని దరి గంగని, మంగని గమనింప, మంగ మగని పని సరి.
(మంగ అనుమానపు భర్త పని దగ్గర కూడ మంగని, ఆమె తోటి ఉద్యోగి గంగ (బహుశా పూర్తిపేరు గంగాధర్) ని గమినించటమే చేస్తున్నాడు; వాడి పని సరి!)
చిట్టా శ్రీరామ్
“పద పద మని గంగ మగని సంపగ సరి గద”
రామి రెడ్డి సామా
మీ సమాధానాలు kasi_emaata@hotmail.comకు పంపంచండి. విజేతల పేర్లు,సమాధానాలతో పాటు వచ్చే సంచికలో ప్రకటించబడును.