రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కవి వైద్యుడు

రచన: శ్రీరామ్ పుప్పాల
అక్టోబర్ 2025

పద్యం కాలు విరిగిందంటే
పరామర్శించడానికి వెళ్ళాను

మైళ్ళ దూరాల్ని దగ్గర చేసిన పాదాలతో
కుంటుకుంటూ కనబడుతుందేమో అనుకున్నాను
బలిష్టమైన వాక్యం వంటి వెన్నుపూస వల్ల
అప్పటిదాక నిల్చున్న జైన మహావీరుడు కాస్తా
నిటారుగా కూర్చీలో కూర్చున్నట్టుంది

తన్ని తాను
రెండు వేళ్ళ మధ్య పెట్టుకుని
జాగ్రత్తగా పెన్సిలు ములుకులా చెక్కుకునే
పద్యానిది–
నగరం నడిమధ్య చివుర్చే అరణ్య రూపం
ఎత్తైన కొండల బిడారు

మలమూత్రాదుల రొంపిలో పడి
గది మందుల వాసన వేస్తుందనుకున్నాను
దిల్షుక్ నగర్ నలభయ్యో నెంబరులోని
పద్యం ఇల్లు–
నిట్టాడి వొంగిపోయి ఉంటుందనుకున్నాను

తల్లి మాట వినకుండా
వర్షం నీళ్ళలో నానే పిల్లల కేరింతల మధ్య
చిత్తడి చిత్తడిగా
పద్యం –
తెగ పారిం తర్వాత ఆరుతున్న
దిసమొల జలపాతంలా కనిపించింది

వేడి వేడి మిరియాల పొంగలి ముద్ద తిన్న నోటితో
‘ఏ య్యా అమ్మాయీ పిల్లలూ బావుండారా’ అని నోరారా పిలిచింది
పద్యం కళంతా,
కొత్తగా వేసిన గొట్టం బావిలోంచి తన్నుకొచ్చే
నీటి గొంతులో ఉంటుంది
తెనాలి సత్యనారాయణ టాకీసు ఎదురు వండే
బెల్లం జిలేబీలో ఉంటుంది

పద్యం, కూతురి కోసం నాన్న కొనితెచ్చే
ఇసుకలో వేయించిన వేరుశనక్కాయల పొట్లం
పద్యం జున్ను ముక్క
ఉప్పు తేగల కట్ట

రాసినోడికీ చదివినోడికీ ఉనికినిచ్చిన పద్యం
వయసైపోయింది కదా
కోలుకోవడం కష్టమనుకున్నాను

మానవ సౌందర్యాన్నంతా నిండా అరచేతుల్లోకి తీసుకుని
క్షణ క్షణం విరుగుతున్న లోకం కీళ్ళని
సుతారంగా అతుకుతున్న
పుత్తూరు నాటు వైద్యుడు కనిపించాడు

బ్బే పద్యం, ఒఠ్ఠి ఎడ్డిమనిషి
ప్రియమైన పల్లెటూరి బైతు

(ఆగస్టు 31 2025 న శివారెడ్డిని చూసొచ్చాక)

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గీతాచారి
  • కొత్త వాచ్‌మన్
  • కవి వైద్యుడు
  • దిగువ మానేరు పెద్దవ్వ

ఇటువంటివే…

  1. తెరచాటు-వులు : 9. అప్పిచ్చువాడు వైద్యుడు!
  2. కవి హృదయం
  3. నాకు నచ్చిన పద్యం: ఒక కవి చూపించిన బ్రతుకు తెరువు
  4. సరిహద్దులు కలవరపరచని కవి
  5. కవి సమ్రాట్

Uncategorized సంచికలో ...

  • కవి వైద్యుడు
  • రాజనందన రాజ రాజాత్మజుల సాటి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఇంటిలోపలి పూల తరువు
బాను ముష్తాక్‌ కథలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.