గోకర్ణ గీతి

కుదుట పడిన సముద్రపుటంచులు
పచ్చగా విరగబూసిన ఆకాశపు గోడలు
మెత్తగా తాకుతున్న బూరుగుదూది మబ్బులు
గాలి గిలిగింతకు క్షణాలుగా కురిసి శాశ్వతత్వంలోకి ప్రవహిస్తున్న రోజులు
ఇన్నాళ్ళూ మోడువారిన కొమ్మకు పూచిన ఒకానొక మోహన రాగం
ప్రకృతి అభిషేకాన్ని చిద్విలాసంగా చేదుకుంటున్న ఆత్మలింగం
ధ్యానాన్ని భగ్నం చేస్తూ జ్ఞాపకాల లోతుల్లోంచి చిరునవ్వు
ఈ మౌనాన్ని ఎవరికైనా వినిపించాలని మనసయింది
ప్రాణం పద్యమై పలకగలదా, ఏమో?