రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం

రచన: ఉమా కౌండిన్య
ఫిబ్రవరి 2017

ఈ కథ శబ్దరూపకం:

//eemaata.com/Audio/feb2017/hekkillapuranam.mp3

(పురాణం శాస్త్రిగారు బాసీపీఠం వేసుకొని తివాచీ పరిచిన ఎత్తు బల్లమీద ఆసీనులయ్యారు. ఇవాళ పోతన గారి భాగవతంలో గజేంద్రమోక్షం నుంచి తానెంపిక చేసుకున్న కొన్ని పద్యాలు, భక్తితో తనకెదురుగా కూర్చున్న పిల్లలకీ పెద్దలకీ చదివి వినిపించడానికి ఉద్యుక్తులయ్యారు. దణ్ణం పెట్టుకొని కథ మొదలు పెట్టారు.)

ఓం! నమోనారాయణ! ఓం! నమోనారాయణ! ఓం! నమోనారాయణ!

ఆ సరస్సులో తోడుగా ఉన్న ఆడ ఏనుగులతో పాటు జలకాలాటలలో సరసాలాడుతున్న ఆ గజరాజు కాలిని మొసలి ఒకటి పహెక్‌టుకొని విడవటల్లేదని, అవి రెండూ ఒకదానితో ఒకటి ఘోరంగా పోరాడుతున్నాయని ఇహెక్‌వరకే చెప్పుకున్నాము కదా! ఇప్పుడు, ఇహెక్‌ముందు జరగబోయే కథ చెప్పుకుందాం. ఇదిగో ఈ పహెక్‌ద్యం చూడండి. ఎంత అందమైన పద్యమో!

(శాస్త్రిగారు ప్రక్కన పెట్టుకున్న వెండి గ్లాసులో నీళ్ళు కాసిని తాగారు, అపరాహ్నంలో చేసిన ఫలహారాన్ని తిట్టుకుంటూ. పురాణపఠనాని కుపక్రమించారు మళ్ళీ.)

కరిఁ దిగుచు మహెక్‌కరి సరసికిఁ గరిహెక్ దరికిని మకరిఁ దిహెక్‌కుచుఁ గరకరి బెరయన్‌
కరికి మకరి మకహెక్‌రికిఁ గరి భరమన నిట్ల తల కుతల భహెక్‌క్కటు లదిరిపడన్
మకరితోడఁ బోహెక్‌రు మాతంగవిభుని నొహెక్‌కరుని డించిపోవఁ గాళ్ళురాక
కోరి చూచుచుండెఁ గుంజరీయూహెక్‌ధంబు మగలు తగులు గారె మహెక్‌కువలకును.

గజరాజుని ఒక్కడినీ విడిచిపోవటానికి కాహెక్‌ళు రాక, ఆడ ఏనుగులు చూస్తూ కూహెక్‌కుండి పోయాయి అని చెపుతున్నారు పోహెక్‌తన్న గారు!

అలయక సొలయక వేసట
నొలయక కరి మహెక్‌కరి తోడ నుద్దండత రా
హెక్‌త్రులు సంధ్యలు దిహెక్‌సంబులు
సలిపెన్‌ బోహెక్ రొక్క వేయి సంహెక్‌సరముల్.

చూశారా! గహెక్‌రాజు మొసలితో వెహెక్‌య్యి, వెయ్యి సంవత్సరాలు, పహెక్‌కలూ రాత్రీ హోరాహోరీగా హెక్‌రాడి అలిసి పోహెక్కున్నాడు.

ఏ రకంగా ఈ పాడు మొహెక్కిళ్ళతో దెబ్బలాడగలను? నా మొహెక్ఆలించే పుణ్యాత్ములేహెక్‌రీ? ఎహెక్‌కడున్నారు? ఏదేహెక్‌డిని ప్రార్థించను?

(పుణ్యాత్ముడొకాయన శాస్త్రిగారికి ఒక కోకాకోలా సీసా తెచ్చిపెట్టాడు. ఆయన చిరునవ్వుతో దీవిస్తున్నట్టు కుడిచెయ్యి ఎత్తి, మళ్ళీ చెప్పటం మొదలుపెట్టారు.)

అలా గహెక్కేంద్రుడు వెహెక్‌కేడుకుంటున్నాడు. ఈ పద్యం హెక్ మనపిల్లలందరికీ బళ్ళల్లో నేర్పిన పహెక్‌ద్యం. వినండి.

ఎవ్వనిహెక్‌చే జనించు జగ హెక్‌కని లోపల నుండు లీనమై
హెక్‌కనియందు డిందుఁ బరహెక్‌కరుఁ డెవ్వఁడు మూలహెక్‌కణం
బెవ్వఁ డనాది మధ్య లయుఁ హెక్కడు సర్వముఁ దానైన వాఁ
హెక్‌కడు వాని నాత్మహెక్ భవు నీశ్వరు నే శరణంబు హెక్‌డెదన్‌

కలఁడందురు దీనులహెక్ యెడఁ
గలఁడందు హెక్‌రు పరమయోగి గణములపాలం
హెక్‌డందు రన్ని దిశలను
హెక్‌డు గలండనెడువాఁడు హెక్‌డో లేఁడో.

చూశారా? ఎవడో హెక్‌కడో ఉన్నాడంటారు? అసలు ఆ రక్షకుడు హెక్‌డా? హెక్‌డా?

(శాస్త్రిగారు పురాణం ఆపి కోలా కొంత గొంతులో ఎత్తి పోసుకున్నారు. బలంగా ఊపిరి తీసుకున్నారు.)

లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యెఁ, బ్రాణంబులున్‌
ఠావుల్‌ హెక్‌కెను, మూర్ఛ వచ్చెఁ, దనువున్‌ డస్సెన్‌, శ్రమంబయ్యెడిన్‌,
నీవే తప్ప నితః హెక్‌కం బెఱుఁగ, మన్నింపందగున్‌ దీనునిన్‌,
హెక్‌కే యీశ్వర! కావవే వరద! సంరక్షించు హెక్‌రాత్మకా!

అని మొరపెట్టుకుంటున్నాడు ఆ గజరాజు. వీడి మొర హెక్ ఆ వైకుంఠపుర వాసి విన్నాడు. ఆపద హెక్‌కుల వాడని ఊరికే అన్నారా!

(ఈ వెక్కిళ్ళు ఆగేట్టుగా కనిపించడం లేదు. శాస్త్రిగారు ఇక పురాణం ఆపడానికి నిశ్చయించుకున్నారు. ఆయన మొర ఆ హరి ఆలకించినట్టు లేడు.)

హెక్! నమో నారాయణ! ఆ తరువాత పోతన రెండు హెక్‌కని పద్యాల్లో – అల వైకుంఠ పురంబులో పహెక్‌ళించి వున్న ఆ మహెక్‌విష్ణువు ఎలా హెక్ ఈ గహెక్‌కేంద్రుని మొరాలకించి, సిరికిం చెప్పక, శంఖ హెక్‌రములు చేతులలో ధహెక్‌కింపక, ఆ హెక్‌మీదేవి కొంగు వదలకండానే తన భహెక్‌డైన ఆ ఏనుగుని రక్షించడానికి బహెక్‌దేరాడో హెక్‌తాడు. అవి వచ్చే వారం హెక్‌తాను.

ఈవాల్టికి ఈ పురాణ హెక్‌రాయణం ఇక్కడితో ఆపుదాం. హెక్!

(మిగతా కోలా గొంతులో పోసుకుని త్రేణ్చారు శాస్త్రిగారు.)

[ప్రఖ్యాత అమెరికన్‌ రచయిత లిడియా డేవిస్‌ (Lydia Davis) 2001లో ప్రచురించిన Oral History (with Hiccups) అన్న చిన్న కథ ఈ పై రచనకి ప్రేరణ.]

    
   

15అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    శ్రీహరి February 1, 2017 2:27 pm

    తమాషాగా కొత్తగా బాగుంది

  2. 2
    రమణమూర్తి February 1, 2017 10:36 pm

    సున్నితమైన హాస్యం, బాగుంది! పునరుక్తి ఇక్కడ దోషం కాకపోగా హాస్యాన్ని పంచింది…

    (Lydia Davis ఈ కథ ఒక్కో పుస్తకంలో ఒక్కోలాగా ఉంది. Samuel Johnson is Indignant (2001) లో ఎలాంటి టైపోగ్రాఫికల్ దోషాలనీ లేకుండా ప్రచురించగా, The Collected Stories of Lydia Davis (2010) పుస్తకంలో మాత్రం మొదటి వాక్యంలో మాత్రమే ‘dau ghters’ అని ప్రచురించారు. ఇది సజెస్టివ్ గా ఉంది. ఇంతకు మించిన తప్పుల్ని ఆవిడ ఆ మూలకథలో ప్రకటించారో లేదో తెలీదు… )

  3. 3
    Uma Kaundinya February 2, 2017 3:51 pm

    In the compilation, “The Best of Mc Sweeney’s” (2013) there were several gaps between the words, in addition to the one (dau ghters) cited by Mr. Ramana Murthy. Here are some: ad opt, yo unger, b uyer, b ig, d inner, and so on.

    I think, the story was first published in The Mc Sweeney’s, 6th issue. And, Mc Sweeney’s is a quarterly, editied by Dave Eggers and Jordan Bass.

    Regards.

    Uma Kaundinya

  4. 4
    తెలుగువాడు February 4, 2017 11:32 am

    అద్భుతంగా ఉందండి. మా తెలుగు తల్లికీ అనే పాటనీ, జయ జయ ప్రియ భారత జనయిత్రి అనే దాన్నీ, వ్యాస భాగవతాన్ని, వాల్మీకి రామాయణాన్నీ, వ్యాస భాగవతాన్నీ కూడా ఇలా తయారుచేయండి. పనిలోపనిగా కవిత్రయం రాసిన భారతాన్ని కుడా. మనకున్న జాతీయ పక్షి నెమలినీ, అలా దేశనికి సంబంధించిన మిగతా వాటినీ కూడా “దయచేసి” వె-హెక్-కిరించండి. మిగతా తెలుగువాళ్ళందరూ బా-హెక్-గా మెచ్చుకుంటారు, ఇక్కడ పాఠకులు మెచ్చుకున్నట్టే. పనిలో పనిగా ఇక్కడ వాడినట్టే, శాస్త్రి, అవధాన్లు, వెంకటేశ్వర్లు అనే బ్రహ్మణ పదాలు బాగా వాడండి. మన కుల గజ్జిని బాగా గోకవచ్చు. అప్పుడు మిగతా కులస్థులందరూ అబ్బో, ఓహో ఆహో అని మిమ్మల్ని ఆకాశనికెత్తేస్తారు. అది ఎంఅతటి గౌరవమో మళ్ళీ చెప్పక్కర్లేదు.ఇవన్నీ ఒక పుస్తకంగా వేస్తే తెలుగువాళ్లందరూ – మనం శుద్ధ వెధవాయిలం కనకే – వెకిలిగా నవ్వుకుంటూ అవన్నీ కొనుక్కుని మిమ్మల్ని నోబుల్ బహుమతికి ఎంపిక చెస్తారు. అలా వచ్చిన డబ్బులతో కోకో కోలాలు తాగుతూ ఎన్-హెక్-క్కా రిటైరైపోవచ్చు.

    తమిళ తంబిల దగ్గిర ఎం.జి.ఆర్ గురించీ, అన్నా దురై గురించీ, వాళ్ళ కవి తిరునక్కరసు గురించి కూడా రాయగలరా? అది తమిళ తంబిల దగ్గిరకి తీసుకెళ్ళండి. వెళ్ళేముందు ఓ తలగడ పట్టుకెళ్ళండి కూడా. వాళ్ళు పేడ నీళ్ళు మొహం మీద జల్లి పళ్ళు రాలగొడితే కాచుకోవడానికి.

    ఇదే మనకున్న దౌర్భాగ్యం. మన వాళ్లని, మన కున్న విలువల్నీ మనమే కాపాడుకోలేము. నాలుగు ఇంగ్లీషు పుస్తకాలు చదగానే మనం పోతన పురాణాన్ని అడ్డం పెట్టుకుని వెక్కిరించడానికి తయారు. సిగ్గుపడవల్సిన విషయం. మరి Jordan Bass ని Jord-AN b-ASS లా విడగొట్టుకోవచ్చు కదా? Then all capitals added together makes better words too. Yup why not?

  5. 5
    రమణమూర్తి February 4, 2017 11:44 am

    Thanks Uma Kaundinya garu! The original isn’t relevant any more. 🙂

    Actually, it was Tin House which published that story for the first time, I believe, as per the details on the copyright page. Anyways, I can not think of reaching that particular issue here in India… 🙂

  6. 6
    ఎ ఎస్ మూర్తి February 4, 2017 12:48 pm

    తెలుగువాడు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసేడు(రు)

  7. 7
    Uma Kaundinya February 8, 2017 9:18 pm

    It looks like the author should bear with patience a great deal of vituperative tirade by some jealous oracular zealots who, I am sure sincerely believe that they are protecting the sanctity of the great Indian classics by exhibiting their misplaced reverence.

    I am referring to the two commentators:“Teluguvaadu” and Mr. A.S. Murthy, his admirer.

    Unfortunately these two people were so eager to smear me as well as the publishers of the original piece by Lydia Davis, they simply did not ‘read’ into the story but showered ribald invectives with irrelevant conundrums.

    Please do not get me wrong. I am one of those who will wholeheartedly protest against the notion that the writer himself/herself is the best judge whether his/her writing is good and correct. If no one was allowed to differ with the writer on this point, of course every writing would be a masterpiece. It is the critic (or the commentators in this case) after all that bestow(s) on the writer his/her deserved fame or sentence him / her to damnation.

    In fact, any criticism, let it be ever so hostile, is of service to any writer. It should lead to discussion; it should cause the other readers to be more perceptive and examine the work more carefully; and if it is good work, the better it will appear; if it is bad work, it should be driven out of the field, and the writer be convinced of his/her own shortcomings, as soon as possible.

    I greatly admire your erudite editors for their fair-mindedness. But, I would be remiss if I do not remind you that fairness in literary exchanges should not be confounded with ‘democracy,’ or worse, with free-for-all.

    Sincerely,

    Uma Kaundinya.

  8. 8
    తెలుగువాడు February 9, 2017 4:42 pm

    ఉమా కౌండిన్య:

    ఈమాట తెలుగు పత్రిక. మీరే తెలుగులో రాసారు ఈ వ్యాఖ్యానం అనబడే వెక్కిళ్ల పురాణం. ఇప్పుడు మాత్రం నేను ఏదైనా అంటే తెలుగులో సమాధానం చెప్పడానికి కుదరదు కాబోలు తమరికి. ఇంగ్లీషే మీరు రాయదల్చుకున్నదైతే పోతన పురాణాన్ని బ్రష్టు పట్టించడం అనవసరం. వేలూరి వారు ఇదే నెల ఈమాట పత్రికలో రాసినట్టు (You are best of all my friends..) ఇంగ్లీషులో పురాణమంతా రాసి ఉండొచ్చు. అబ్బే తెలుగే రాస్తాను అంటే పోతన పురాణాన్ని తీసుకుని హెక్ లు పెట్టడం అనవసరం. మీకొచ్చిన తెలుగుతో మరో పురాణం రాసి అందులో హెక్ లు పెట్టుకోవచ్చు. రెండిటికీ చెడ్డ రేవడి అన్నట్టు ఈ రెండూ చేయలేదు. ఇప్పుడు నేను ఇలా పోతనని వెక్కిరించారేం అని అడిగితే ధాటీగా ఇంగ్లీషులో సమాధానం చెప్తున్నారు.

    మరి పోతన తెలుగో? ఈ కింద వాటికి ఎక్కడా వెతక కుండా, చూడకుండా ఎవర్నీ అడక్కుండా అర్ధం చెప్పండి చూద్దాం. అర్ధం తెలిస్తే దీనికి మీకొచ్చిన తెలుగులో పర్యాయపదాలు వాడుతూ దీనికి దీటైన మరో వ్యాక్యం తయారు చేసి చూపించండి. దానికన్నా ముందు నాలుక తడబడకుండా, అదే “హెక్కిళ్ళు” పడకుండానూ, చదవగలిగితే మరీ మంచిది.

    “మంధ దండాయమాన మంధర వసుంధరాధర పరిభ్రమణ వేగ వియన్మండల సుధారాసి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును…”

    “సత్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగఛ్ఛటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండఛ్ఛటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాంశ్చక్రమున్ జక్రమున్…”

    ​నేను చెప్పినది ఇది – తెలుగు వాళ్లకున్న అత్యంత విలువైన గ్రంధం పోతన భాగవతం. ఎవరో ఏదో రాసారు కదా అని మన విలువైన గ్రంధాలని అడ్డం పెట్టుకుని అటువంటి వ్యాఖ్యానాలు చేస్తే అది మనం మనని అగౌరవపరచుకున్నట్టు లెఖ్ఖ. ఒక తమిళవాడు కానీ మళయాళీ కానీ ఆ పని ఎప్పుడు చేయరు. మీకు వెక్కిరింపే ముఖ్యం అయితే, మీరు తెలుగులో రాయగలిగితే స్వంతంగా మరో పురాణం తయారుచేసుకోండి. ఎప్పుడైనా మీరు పోతన భాగవతం చదివారా? నేను అడిగేది స్కూలు పాఠ్య పుస్తకాల్లో అక్కడో పద్యం ఇక్కడో పద్యం గురించి కాదు. పోతన భాగవతం అనే పుస్తకాలు చూస్తే “తల్లీ నిన్ను దలంచి..” అంటూ చేతులెత్తి నమస్కారం పెట్టుకోదగ్గవి. అవి రోజూ పూజగదిలో పెట్టుకుని చదువుతారు. వీలుంటే/ వీలు చూసుకుని చదవడానికి ప్రయత్నం చేయండి.

    ఎవరో ఎక్కడో ఏదో బాషలో రాసినది పట్టుకుని మన విలువైన పురాణాన్ని బ్రష్టు పట్టించడం ఎంతవరకూ సమంజసం? ఒకసారి నేను ఏం చెప్పదల్చుకున్నానో అర్ధం చేసుకుని నాకేసి ఒక వేలు చూపించినప్పుడు మీకేసి మూడు వేళ్ళు వెనక్కి చూపిస్తున్నాయని తెల్సుకుంటే మంచిది. హెక్ లు పెట్టడానికీ ఏమీ జ్ఞానం అవసరం లేదు. కాపీ పేస్టు వస్తే చాలు. మన సంస్కృతి అర్ధం చేసుకోవడానికీ మన విలువల్ని కాపాడుకోవడానికి జీవితాలు పణంగా పెట్టవల్సి ఉంటుంది. అలాంటి విలువలు ఉన్నవాళ్ళెవరూ ఇటువంటి రచనలు చేయరని గమనించండి.

    నేను రాసిన వ్యాఖ్యానాన్ని మూర్తిగారు అపహాస్యం చేసినట్టుగానీ, మెచ్చుకున్నట్టుగానీ చెప్పలేదు. ఆయన నా admirer ఎలా అయ్యారో మరి; మా ఇద్దరి మీద మీ అసహనం రుద్దడానికి మంచి ప్రయత్నం చేసినట్టున్నారు.

    చివరిగా:

    శా. తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్ నీవు నా
    యుల్లం బందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
    భిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
    ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!

    చాటువుగా చెప్పబడే ఈ పద్యంలో చెప్పిన “సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునను” అనేది మీ వెక్కిళ్ల పురాణంలో గానీ వ్యాఖ్యలో కానీ భూతద్దం పెట్టి గాలించినా లేదని ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది.

    Au Revoir.

  9. 9
    శ్రీనివాసుడు February 9, 2017 9:49 pm

    “తెలుగువాడు” గారి వ్యాఖ్యను పూర్తిగా సమర్థిస్తూ

    ఒకానొక పత్రికలో వేలూరి వేంకటేశ్వరరావుగారి ఈ వ్యాఖ్యను ఈ సందర్భంగా పంచుకోవడం సముచితం.

    “Finally, a culture that forgets and belittles its classics and ancient heritage can never create great literature. And, you know what I mean.”

    Veluri Venkateswara Rao
    August 3, 2016 at 2:52 am

    Dear Sri HRK:

    Thanks for elucidating your comments.

    You might say that you used the Sanskrit Aesthetics as an illustration. Because there are a lot of self-styled- modernists, with different colors and shades of red, who deride and make fun of Aesthetics of the ancient Sanskrit scholars, to get some derisive laughter. If you have carefully read at least some of the aestheticians, you would know that they were serious writers of exemplary scholarship. If you find time just try reading Rahasekhara! You will be surprised to find bases for some of your arguments about “isms” in regard to literature. It may not be the right place to say, but it has become fashionable to make fun of classical aesthetics because they have some hidden aversion to their birth. But, the same people do not dare to criticize, or even speak lightly of Mathew Arnold or even T S Eliot, or the neo-Marxist-literary critic, Terry Eagleton. And, some of the elements expounded by Eliot in regard to poetry were neatly borrowed from Sanskrit Aestheticians. On that, I can have a debate with you in a different forum. Please remember that Classical Aesthetics is essentially “Science.”

    Finally, a culture that forgets and belittles its classics and ancient heritage can never create great literature. And, you know what I mean.

    Regards,

    Veluri Venkateswara Rao

    దీని పూర్తి లంకెని ఇక్కడ యిస్తున్నాను. ఆసక్తి వున్నవారు చూడగలరు.

    http://vaakili.com/patrika/?p=11707

  10. 10
    Html February 10, 2017 11:48 am

    ఉమా గారు: మీ వ్యాఖ్యని బట్టి మీరు ఈమాట సంపాదకులకి ఏదో విలువైన సూచన ఇవ్వబోయినట్టు అనిపించింది చివరిలో. గత పద్ధెనిమిదేళ్ళుగా ప్రతిఫలాపేక్ష లేకుండా మీ/నా లాంటి వాళ్లు (వాళ్ల వాళ్ల కుంటుంబ సభ్యుల నుంచి వచ్చేవి కూడా అని నా ఉద్దేశ్యం) వేసే సెటైర్లూ, తిట్లూ తింటూ, మనం ఉచితంగా చదవడానికి ఏ ప్రకటనలూ పంటి కింద ఇంగువముక్కలా అడ్డం పడకుండా చూస్తూ “కేవలం” తెలుగు సాహిత్యం మీద అభిమానంతో తమ విలువైన కాలం, అనేకానేక ఇతరత్రా వనరులూ స్వంతంగా వ్యయం చేసే ఈమాట సంపాదకులకి, మీరివ్వబోయిన సలహాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తెలియకపోవటం తప్పుకాదు, కానీ “ఈమాట గురించి” అనే పేజీలో రాసినది చదివి తెలుసుకోకపోవడం సుతరామూ తప్పే.

  11. 11
    పాలూరి వెంకట రామారావు February 10, 2017 8:28 pm

    ఇది ఒక గర్హనీయమైన ప్రయోగం. దీనిలో పైన ఎవరికో సున్నితమైన హాస్యం ఎలా గోచరించిందో మా బుర్రకు చిక్కట్లేదు. సున్నితమూ కాదు హాస్యమూ లేదు. ఈమాట తన స్థాయిని దిగజార్చుకుంటోందా అని సందేహం కలిగేలాంటి ఇటువంటి ప్రక్రియ లను దయచేసి నాణ్యతా పరిశీలనలో వడపోయాలని ప్రకాశకులకు మనవి.

  12. 12
    వేలూరి వేంకటేశ్వర రావు April 5, 2017 10:40 pm

    Dear Editors:

    Forgive me for the delay in responding to the comments on this article.

    I have carefully read the article, listened to the audio more than once. If there is anything that could have been trimmed, it would have been the ‘over doing’ at the end of the audio. But, that was not needed, I must say. And, I have read all the comments on the article, as if I were the Editor . ( Old habits don’t die.)

    First: I must admit that Ms. Uma Kaundinya has done an admirable job, in introducing to the Telugu readership a very famous American writer/humorist and an acclaimed translator from French to English, i.e., Lydia Davis. Her article encouraged me to write about Lydia Davis in Vividha of Andhrajyothy, a respectable news paper from Hyderabad.

    Second: If it were not for Ms. Uma Kaundinya, I would have totally missed such a great writer who I sincerely believe that our Telugu literati should read dispassionately and I am certain they would enjoy her writings.

    Now to the actual issue:

    In course of discussion on her adaptation of “Hiccups and Oral History,” you have published several irrelevant comments, some almost insulting to the point of no return. But, publishing them is your prerogative as the current editors of eemaata.

    I must admit, you have been generous to publish a couple of relevant comments by people who liked the ‘satire,’ and enjoyed the fun part of the write up by Ms. Kaundinya. I admire you for that.

    Unfortunately, in the discussion, my name popped out on a couple of occasions.

    The statements I made and wrote in a different forum were quoted, and I am now thoroughly convinced that they were totally out of context. I made some strong assertions /comments on the casual mis-representation and mis-quoting of our Sanskrit Aesthetics and our great aesthetecians. I made a point and I stick by it; Sanskrit aesthetics is science, not to be casually shoved off. One does it if one is totally ignorant. In that context, I have made those strong comments advising the folks who made those comments to read the Aesthetics carefully before making non-chalant, politically self-serving irrelevant comments to get applause or a bunch of likes in Face Book. Of course, that boosts their ego.

    My comments on such irrelevance were cited here out of context to make a case against Ms. Kaundinya. Nothing can be sadder than that!

    Also, my Cento poem (in the same issue) composed after borrowing from the excellent work of Velcheru Narayana Rao ( A Poem at the Right Moment) was referred and it was not at all relevant to the article in question. Such reference should get my ego boosted,(if am stupid enough!) because I have been quoted by some folks to make a point, although a point that’s completely irrelevant. I am not in the business of being quoted and jump at such activity.

    Reverence to certain great books is no sin. But, taking that reverance to the extreme shows lack of understanding and sympathy.

    Believe me, I have been around the “pauraNikaas,” long enough, and most of them if not all recite the famous epic stories in the “puraaNa SravaNaM,” exactly as Ms. Kaundinya humorously wrote in her lovely piece.
    ( Frankly it would be much worse!) One has to be around to listen to the atrocious rendering for the sake of ridiculous musicality, and in the process the pauraaNikaas kill poetry.

    Ms. Kaundinya was actually more generous in her piece..

    What happened? A couple of commentators who believe that they are the zealous preservers of the sanctity of their favorite epics have been overly harsh on Ms. Kaundinya. In my humble view, they missed the point irrevocably.

    But, all in all, Ms. Kaundinya was able to answer these detractors with dignity ( see her reply to the ridiculous comments) and these zealots were still trying to condemn her. Not only that! The good folks who liked the article stayed out of the fray because they were mortally afraid of these zealots.

    As the former Chief Editor of eemaata, I take this opportunity to request the current editors to establish and adhere to a strict policy on ‘editing and publishing,’ comments.

    Regards.

    Venkateswara Rao Veluri

  13. 13
    సంస్కృతీ పరిరక్షకుడు April 6, 2017 2:22 pm

    శ్రీ వేలూరి వారి సన్నిధికి,

    మీ వ్యాఖ్య కు సమాధానంగా ఈ విన్నపం.

    పోతన గారు తన భాగవతాన్ని ఆరంభిస్తూ – “పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట..” – ఇలా అన్నారని చదువుకున్నాం. తన నోట పలికించిన పలుకులు తనవి కావనీ, రామభద్రునివని ఆయన వినయంగా చెప్పుకున్నారు. ఆయన వాక్కులు కేవలం శుష్కశబ్దాలు కావు. వాటి వెనుక “భక్తి” అని, “ఆత్మార్పణమనీ”, “ప్రపన్నత” అనీ ఆయన తన పలుకులకు తాను ఇచ్చుకున్న ’విలువ’ అన్నవి ఉన్నై.

    శ్రీ లిడియా డేవిస్ అనే అద్భుత రచయిత్రి ఈ రచన ద్వారా పరిచయం కావడం ముదావహమే. కానీ దాని కోసం ఈ వ్యాసరచయిత పోతన ఆసరా తీసుకుంటున్నప్పుడు ఆ పోతన ఎందుకోసం తన శబ్దాలు పేర్చుకున్నాడో ఆ నేపథ్యానికి, ఆతని పలుకుల వెనుక ఉన్న భక్తి భావానికి విలువివ్వడం ఒక సంస్కారం. దానిని సంస్కృతీ పరిరక్షణ అనరనుకుంటాను. ఆయన ఈ రోజు మన మధ్య లేడు. కానీ ఆయన పద్యాలను కనీసం ఓ పదితరాల్లో అయినా అనేకమంది పిల్లలు కమ్మగా చదువుకుని మనసు నింపుకొని ఉంటారు. ఇప్పుడు ఇంగ్లీషు బలిసి, వెనక్కెళ్ళిపోయుండచ్చు గాక. అందుకోసమైనా కూసింత కృతజ్ఞత ఇవ్వచ్చు.

    బహుశా ఇంగ్లీషులో చెబితే మీ వంటి పెద్దలకు బాగా అర్థమవుతుందేమో, “If we are using the words of a poet for some purpose, – due credits must be given to the poet and the value behind his words. Is it a big/wrong ask?”

    పబ్లిక్ డొమైన్ లో ఉందని ఓ బస్ షెల్టర్ ను బెడ్ రూము గా, లేక బాత్ రూముగా వాడం కదండీ? అది ఎందుకోసం ఉద్దేశించిందో దానిని అలా ఉపయోగించటం చిన్నపాటి విచక్షణ. ఆ తర్కమే ఇక్కడాను. పెద్దలు ఆలోచించాలి.

    ఆ ఏముంది? Casual గా గూగుల్ బజారులో దొరికిన పద్యాన్ని రచనాశకలానికి వాడుకోరాదా ఏం? అంత రాద్దాంతమెందుకూ? అంటారా? Openness, Casualness అన్నవి మీ విలువలైతే భక్తి అనేది పోతన విలువ. ఆతని పద్యం గురించి రాసేప్పుడు, అతనెవరో తెలియాలి. తెలియకపోతే కనీసం గూగుల్ లో కొట్టి తెలుసుకోవచ్చు. లేదూ ఆయనకు/భక్తి అనే విషయానికి విలువ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆయన పద్యం వాడుకోవడం మానెయ్యవచ్చు. వేల సంఖ్యలో సినిమా పాటలు, చాటువులు, ప్రబంధకావ్యాల్లో నాయికా వర్ణనలు వీటిలో ఏ ఒక్కదాన్నైనా ఆ లిడియా డేవిస్ అనే అద్భుత రచయిత్రి గారి అనుపమాన రచనానువాద ప్రక్రియకు సలక్షణంగా ఎంచుకొని ఉండవచ్చు.

    పైగా ఆ “హెక్” ప్రత్యయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని, సరైన సినిమా పాట వెతుక్కుని కూర్చుకుంటే – శబ్దచమత్కారాలకు, శబ్దంలో విరుపుల మధ్యలో ’హెక్’ నాదంతో పుట్టించే లయకూ చక్కని అవకాశమూ ఉంది.

    ఈ విషయాలు పై వ్యాసరచయిత్రికి తెలియలేదు. ఆమె తప్పేమీ లేదు. ఘనత వహించిన ఈమాట “ఎడిటర్” లకూ తెలియలేదు! అన్నేళ్ళు సంపాదకత్వం వహించిన మీ బోటి పెద్దలకు తట్టలేదు. కాబట్టలేదు. అది కాబట్టిన ఎవరో వ్యాఖ్య వ్రాస్తే వారిపై మీరు కోప్పడుతున్నారు! ఇదీ విడ్డూరమంటే!

    త్యాగరాజు కృతిని “పండు రీతి కొలువీయవయ్య రామా, తుండ విండి వాణి మొదలైన మదా
    దూల గొట్టి నెల గుల జేయు నిజ పండు రీతి…”

    ఇలా ఎవరైనా గాయకుడు తెలిసైనా, తెలియక అయినా పాడితే ఎవరో కనీసం కొందరు చెవులు మూసుకుంటారు. వారు సంస్కృతీ పరిరక్షకులే కానక్కర లేదండి.

    పౌరాణికాల్లో ’misuse’ చేశారు కాబట్టి it is licensed act అనడం పొసగని మాట.

    వ్యాఖ్యలు వ్రాసే వాళ్ళు బెదిరింపు ధోరణితో భయపెడుతున్నారని, Zealots అని అంటున్నారు. తెలుగు పత్రికలో మీ ఆంగ్ల వ్యాఖ్యలు చూస్తుంటేనూ, ఆంగ్ల రచయితలను సమర్థించే తీరును చూస్తుంటే – తెలుగులో మాట్లాడుకునే సాధారణమైన తెలుగువాడికి అంతకంటే ఎక్కువ భయమే వేస్తూంది.

    మీరు పెద్దలు, తెలిసిన వారు. ఓ మారు మా మొర లేదా కనీసం పోతన మొర ఆలకించండి. ఆయన మొర వినడానికి ’ఆపన్నప్రసన్నుండు’ కూడా లేడు. వేంకటేశ్వరులని పేరున్న మీరే వినాలి. ఆపై మీ ఇష్టం.

    ఈ వ్యాఖ్య కూడా తొలగించుకోవచ్చు. ఇబ్బంది లేదు. తొలగించడానికి అనువుగానే ఆ పేరును ఉపయోగించడం జరిగింది.

    [మీ వ్యాఖ్యను ఏం చేయచ్చో కూడా చెప్పిన మీ సూచనను ఇకనుంచీ పాటిస్తాం – సం.]

  14. 14
    శ్రీ అయ్యగారి నాగేంద్రకుమార్ October 30, 2018 9:41 pm

    ఇది ఆధ్యాత్మిక సాహిత్యాన్నీ, అందులో తెలుగువారికత్యంత ఇష్టమైన పోతన భాగవతాన్నీ.. అంతే కాదు, భగవంతునియందు ఆర్తి కలిగినవాళ్లనీ, పోతననూ, కిఞ్చపరచే ప్రయత్నం సుస్పష్టం. ఇది సరదాకో హాస్యానికో వాడే వస్తువుకాదు తరించడానికుపయోగపడేవస్తువు. రచయిత, సంపాదకులు సమర్థించుకోవడం ఏమాత్రమూ అంగీకారమూ, క్షమార్హమూకాదు.

  15. 15
    K.V.S. Ramarao October 31, 2018 3:01 pm

    నేను ఇంతకుముందు వరకు ఈ కథని వినలేదు – ఈ చివరి అభిప్రాయం చూశాక కుతూహలం కలిగి విన్నాను. తర్వాత మిగిలిన అభిప్రాయాలు కూడ చదివాను.

    కొందరు పాఠకులు గోరంతని కొండంతలు చేస్తూ, సైకాలజిస్టుల వేషాలేసుకుని మరీ రచయిత్రి దీన్ని రాయటం వెనకున్న దురాలోచనల్ని పసిగట్టి కసిపెట్టి ఉతికి ఆరేశామని అనుకోవటం చూశాను.

    ఎవరో ఒకరు ఏదో చిన్న ప్రయోగాత్మక కథ, అదీ ఒక మాదిరి కథ, రాసినంత మాత్రానే పోతన గారి భాగవతం అపహాస్యం పాలౌతుందని భావించే ఈ మహానుభావులకి భాగవతం మీద ఎంత గాఢనమ్మకమో అర్థం ఔతూనే వుంది వారి ఆవేశం బట్టి. ఒకరు భాగవతంతో సమానంగా రాస్తే కాని దాని జోలికి వెళ్లకూడదని రచయిత్రి మీదికి ఒంటికాలిపై లేచారు కూడ. ‘కాపీ – పేస్ట్ ‘ ఎంత తేలికో సెలవిచ్చిన వారు తాము చేసిన కాపీ-పేస్ట్ లో ఎన్ని తప్పులు చేశారో ఒకసారి చూసుకుంటే కాపీ-పేస్ట్ కూడ అంత తేలిక కాదని వారికే అర్థం ఔతుంది. ఈ రెంటిలోనూ తప్పులున్నయ్ – గమనించండి :

    “మంధ దండాయమాన మంధర వసుంధరాధర పరిభ్రమణ వేగ వియన్మండల సుధారాసి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును…”

    “సత్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగఛ్ఛటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండఛ్ఛటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాంశ్చక్రమున్ జక్రమున్…”

    మీకు నిజంగా తెలుగు సాహిత్యాన్నీ సంస్కృతినీ నిలబెట్టాలనే దీక్షే వుంటే వాటిని బాగా చదవండి, అర్థం చేసుకోండి, ముందు తరాలు వాటిని గుర్తుంచుకోవటానికి మీరు చెయ్యగలిగిన కృషి చెయ్యండి – ముందు మీ పిల్లలు, పిల్లల పిల్లల్తో మొదలుపెట్టి.

    పోతన గారు ఎవరో తెలియని వారు వారి భాగవతం మీద ఎవరో రాసిన ఏదో వ్యాసం వల్లో కథ వల్లో చెడిపోయి మన సంస్కృతినీ సాహిత్యాన్నీ మంటగలిపెయ్యరు. ఆ పోతన గారు ఎవరో ఆయన చేసిన గొప్పపని ఏమిటో ముందు వాళ్లకి తెలియాలి కదా ! మీరు ఆవేశంగా పేస్ట్ చేసిన పద్యాలు మీ ఇంట్లో ఎవరికైనా కంఠతా వచ్చేట్లు చేస్తే అప్పుడు మీరు పోతన గారి ఋణం తీర్చుకున్నట్టు, ఒక రచయిత్రి రాసిన ప్రసిద్ధ కథ చదివి ఉత్సాహపడి తెలుగువారికి ఆ విధానాన్ని పరిచయం చేద్దామని చిరుప్రయత్నం చేసిన వారిమీద మీ కుహనా విద్వత్ప్రతాపజ్వాలలు కురిపిస్తే కాదు. ఉతికాం, ఆరేశాం అని జబ్బులు చరుచుకుంటే అసలే కాదు.

    ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించింది కాదు, కత్తులు నూరుతున్న అందరినీ.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం

ఇటువంటివే…

  1. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం
  2. నేలసంపెంగ
  3. నాయం హంతి న హన్యతే
  4. ఒకనాటి యువ కథ: నువ్వేం చేస్తున్నావ్?

ఫిబ్రవరి 2017 సంచికలో ...

  • You’re the best of all my friends, which is why
  • ఉదాహరణములు – 1
  • ఊపిరి పోసుకునే వేళ…
  • ఒకనాటి యువ కథ: నువ్వేం చేస్తున్నావ్?
  • గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం
  • గడి నుడి – 4
  • గులకరాళ్ళు
  • చెప్పేదెవరు?
  • తాటిపండుకల్లు
  • తెరచాటు-వులు: 1. ఆదిన
  • నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి
  • నాయం హంతి న హన్యతే
  • నేలసంపెంగ
  • పరికరం
  • ఫిబ్రవరి 2017
  • బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు
  • రెండు కవిత్వాలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2
  • సాహిత్యం పట్టని క్షణం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

చెప్పేదెవరు?
సాహిత్యం పట్టని క్షణం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.