గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం బలంగా నడుస్తున్న రోజులలో కూడా, దృష్టి అంతా పదాలు వాటి వర్ణక్రమాల మీదే ఉండింది. ఆ సమయంలో టేకుమళ్ళ కామేశ్వరరావు అనే యువకుడు వ్యావహారభాషకు నియమాలు ఏర్పరుచుకోవాలా వద్దా అనే అంశాన్ని చర్చకు తీసుకొని వచ్చారు. వీరి పుస్తకం ఈ సంచికలో ప్రచురిస్తున్న సందర్భంలో, ఆ పుస్తకపు ముందుమాట, ఇక్కడ ప్రచురిస్తున్నాం – సం.
టేకుమళ్ళ కామేశ్వరరావు
- సొంత ఊరు
- విజయనగరం
జీవిత విశేషాలు
టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు. జానపద వాజ్మయంలోనూ, బాల వాజ్మయంలోనూ ఎక్కువగా కృషి చేశారు. పాత పాటలు, జోల పాటలు సేకరించి ప్రచురించారు. వ్యావహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.