పాఠకుల విమర్శలు రచయితలకీ సంపాదకులకీ ఎంతో అవసరం. సహృదయంతో చేసిన విమర్శలు సూటిగా నిష్కర్షగా ఉండచ్చు. అందులో తప్పేమీ లేదు.

నేను వచ్చిన తరువాత
మీ దిగుళ్ళలో మీరు,
మీ సంతోషాల్లో మీరు,
మీ రోజువారీ ఈతిబాధల్లో మీరు –
ఏమో! నేను నాకే వొక జ్ఞాపకంలా పడి వున్నాను.

ఒచ్చిన కొత్తల్లో తను కూడా అలాగే అనుకొనేది. అన్నం వేష్ట్ చెయ్యకూడదు, కూర వేష్ట్ చెయ్యకూడదు అని. ఇప్పుడు అదంతా సిల్లీగా ఉంటుంది. చెత్త కుండీల దగ్గర ఇంకా రంగైనా పోని సోఫాలు, మంచి టీవీలూ టేబిళ్ళూ పడీసుంటాయి. బట్టలు చెప్పులు తనకెన్నున్నాయో తనకే గుర్తుండదు. పిల్లలూ ఒక నాలుగు సార్లు తొడుక్కుని చెప్పులూ బట్టలూ ‘Yuk!’ అని పడెస్తారు.

కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము.

అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం వచ్చింది.

తెలుగు సాహిత్యం నిలిచివుండాలంటే దాన్ని ఆంగ్లంలోకి అనువదించటమే ఇప్పుడున్న ఏకైక సాధనం. ఎంతో కాలం నుంచి నిర్విరామంగా ఈ కృషిని కొనసాగిస్తున్న నారాయణరావు, షుల్మన్ గార్లను మనం ప్రత్యేకించి అభినందించాలి.

అనువాదం అనువదించబడే భాషలో సాహిత్య స్థానాన్ని సంపాదించ లేక పోతే అది ఎంత విధేయంగా వున్నా అది సాహిత్యానువాదం కాదు. అంచేత సాహిత్యానువాదకుల పని ప్రధానంగా తాము అనువదించిన భాషలో తమ అనువాదానికి సాహిత్యస్థానాన్ని సంపాదించుకోవటమే.