బైరాగి కవితలలో నైరాశ్యం, నిస్పృహ మౌలికమైన ఆవేశాలు. అయితే బైరాగి నైరాశ్యం మనసును క్రిందికి దిగలాగేది కాదు. అంతరాత్మను ఉర్రూతలూగించే ప్రభంజనం వంటిది.
పాలగుమ్మి పద్మరాజు రచనలు
రచయిత బుచ్చిబాబు ప్రసిద్ధ నవల చివరకు మిగిలేది గురించి ఈమాట పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నవలను రేడియో కోసం పాలగుమ్మి పద్మరాజు 1960లలో నాటికగా మలిచారు. ఆ నాటికను మీకోసం ఈ సంచికలో పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్నారు.
ఫిబ్రవరి 1953లో ఆలిండియా రేడియోలో పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావుల మధ్య జరిగిన సాహిత్యచర్చాపాఠం ఇది.