జి. నాగరాజన్

జి. నాగరాజన్
సొంత ఊరు
మదురై

జీవిత విశేషాలు

జి. నాగరాజన్ (1929 – 1981) ఉపాధ్యాయుడిగా కొన్నేళ్ళు, ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్ళు ఉద్యోగం చేశారు. సాహిత్యంలో ఎక్కువగా రాయబడని అట్టడుగు వర్గాలవారైన సెక్స్ వర్కర్స్ జీవితాలను, కుంటెనగాళ్ళ జీవితాలను తొలిసారిగా తమిళ కథల్లో చూపించిన రచయిత. వందకు పైగా కథలూ, రెండు నవలలూ రాశారు. ‘కాలేజ్ ప్రిన్సిపాల్ మిస్ నిర్మల’ అన్న కథను ఇటీవలికాలంలో లఘుచిత్రంగా తీశారు. ఈయన రాసిన ‘నాళై మట్ఱుం ఒరు నాళే’ (రేపూ మరొక్క రోజే) అన్న నవల ఆంగ్లంలోకి అనువదించబడి మంచి గుర్తింపు పొందింది.

జి. నాగరాజన్ రచనలు