మనం అంటున్నావ్. మనం అంటే ఎవరు? నువ్వూ, నేనూ మన పిల్లలూనా? మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళకి తల్లిదండ్రులమైన మనల్ని వాళ్ళ లిస్టు లోంచి తీసేస్తారు. కనుక మన లిస్టులో వాళ్ళని వేసుకున్నా వాళ్ళు మనల్ని వేసుకోరు. ఇంక మిగిలింది నువ్వూ నేనూ. ఇప్పుడు ఆలోచిద్దాం. నన్ను కన్న తల్లిదండ్రులు నా కుటుంబ పరిధిలోకి రారు. నేను కన్న పిల్లలు నన్ను వాళ్ళ పరిధిలోకి రానీయరు. ఇంక కేవలం నువ్వు మిగిలావ్.
కవన శర్మ
- పూర్తిపేరు
- కందుల వరాహ నరసింహ శర్మ
- సొంత ఊరు
- విశాఖపట్నం
- వృత్తి
- సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు
జీవిత విశేషాలు
కవనశర్మ (1939 – 2018) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి ఉపన్యాసకులుగా అనేక దేశాలు సందర్శించారు. తెలుగులో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక) సలహాదారులలో ఒకరు. కవనశర్మ కథలు, సైన్సు నడచిన బాట, వ్యంగ్యకవనాలు, పరిధి ఉత్కృష్టమైనవి. కారామాస్టారు శ్రీకాకుళం లో ఏర్పరచిన ”కధానిలయం” కు శర్మగారు సలహాదారుగా ఉండేవారు.