“సామీ ఇట్లాంటివి ఎన్నో చూసినా, నరున్ని నమ్మితే కాదని నిన్ను నమ్ముతా ఉండా, ఇది నిజిమేనా” అంటే “నిజమే” ఆనే వానదేవుడు. ఆ మాట తీసుకొని ఇద్దరూ ఒగటైరి. పొగులంతా ఆ వానదేవున్ని ఎవరూ చూడకుండా బంగారు బల్లిని చేసేది, గోడకు కరిపిచ్చేది. రేయి మల్ల మామూలు మనిసయ్యేది. ఇట్లా ఆరు నెలలు గడుస్తుంది.
ఎండపల్లి భారతి
- సొంత ఊరు
- దిగువబురుజు, మదనపల్లె మండలం
జీవిత విశేషాలు
ఎండపల్లి భారతి రాసిన కథలతో ‘ఎదారిబతుకులు’ ‘బతుకీత ‘ ‘జాలారి పూలు ‘ ‘దేవరహస్యాలు’ ‘పచ్చబొట్టు ‘ కథా సంపుటాలుగా వెలువడ్డాయి . ‘జక్కీకు ‘, ‘దొంగసారా’ అనే నవలలు విడుదలయ్యాయి. మదనపల్లి పరిసర ప్రాంత మాండలికంలో, చక్కని తెలుగు నుడులతో, ప్రత్యేకంగా తనకు చిరపరిచితమైన తన పల్లె భాషలో ఆమె రచిస్తారు. ఆమె కథల్లో పేద శ్రామిక మహిళల వెతలు, తమదైన సంస్కృతి, సామాజిక చింతన, పల్లెల రూపురేఖలు పటం కట్టినట్టు కనిపిస్తాయి. ఆమె రచనలకు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందాయి.