కారణమేమిటో తెలియదు, కథలు రావడం కుంటుపడుతున్నది. తెలుగు diaspora అనుభవాలు మరొకరు చెప్పలేరు. ఇక్కడి తెలుగు వారే చెప్పగలరు. అది మన ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ఒక కథ బాగా చెప్పగలరు అని నానుడి. ఆ కథ వారి స్వంత కథ, వారి స్వానుభవం.

నేను ప్రస్తావించబోయే ప్రార్థన పద్యాలు, మనం చిన్నప్పుడు నేర్చిన పద్యాల వంటివి కావు. అంతేకాదు. మనం పెద్దైన తరువాత, ఏ కావ్యాలనుంచో, ప్రబంధాలనుంచో, నేర్చుకున్న పద్యాలూ కావు.

కాని, మనం మాట్లాడే నాలుగోవంతు, పదోవంతు తెలుగైనా ఆ సంభాషణలు ఇంగ్లీష్‌ లో కుదరవు. కొన్ని నాజుకైనా భావాలు, పలకరింతలు, ఆప్యాయతలు తెలుగు పదాలలో మాత్రమే చెప్పగలుగుతాము. అవి లేకపోతే విషయాలు తెలపగలము, కాని అల్లం పచ్చిమిరపకాయ లేని పెసరట్టు లాగా చప్పగా ఉంటుంది.

ప్రకృతిలో నాలుగు ప్రాథమిక బలాలు (fundamental forces) ఉన్నాయని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. విశ్వార్భవానికి మూలకారణమైన ఆదిశక్తి ఒక్కటే అయినప్పటికీ అది ఈ నాడు మనకి నాలుగు వివిధ బలాలుగా ద్యోతకమవుతున్నాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడ మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.

ఈ కవిత అర్థమవడానికి “వర్షుకాభ్రములు” అన్న పదంకోసం నిఘంటువులు తిరగెయ్యనక్కరలేదు. మహా ప్రవాహంలా హోరెత్తించే ఆ కవిత్వ వేగం సామాన్య పాఠకుణ్ణి సైతం మున్ముందుకి తోసుకుపోతుంది.

శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యంగా సీరియస్‌ వ్యవహారం. అయనా అందులో కూడా కొన్ని జోకులూ, ఛలోక్తులూ ఉంటూనే ఉంటాయ. వాటిలో చిరునవ్వు తెప్పించేవి కొన్నిటిని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.

పార్థివనామ సంవత్సరం ఇస్మాయిల్‌ అవార్డ్‌ కు ప్రతిభగల కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి రచించిన “వానకు తడిసిన పూవొకటి” అనే కవితా సంకలనాన్ని ఎంపిక చేశారు. అక్టోబర్‌ లో విడుదల కాబోయే ఈ పుస్తకం నుండి రెండు చిన్న కవితలు.