రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

సెప్టెంబర్ 2000

“ఈ మాట” పాఠకులకు స్వాగతం!

మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. మేం చూస్తున్న గణాంకాల ప్రకారం “ఈ మాట” ఒకో సంచికని దాదాపుగా వెయ్యి మంది పాఠకులు చదువుతున్నారు. ఇది మేం ఆశించిన దానికన్నా ఎంతో ఎక్కువ. ఈ ఆదరణకి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగటానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తామని అందరికీ మనవి చేస్తున్నాం.
 

వచ్చే నెలతో “ఈమాట” కు రెండేళ్ళ వయసు రాబోతోంది. కనుక నవంబర్‌ సంచికను మరిచిపోలేని సంచిగ్గా తయారుచెయ్యాలని ప్రయత్నిస్తున్నాం. ఐతే ఇది కేవలం సంపాదకుల వల్ల సాధ్యమయే పని కాదు. రచయితలూ, రచయిత్రులూ తమ సొంతబాధ్యతగా తీసుకుని ఈ పనిలో మాకు చేయూత నివ్వాలి. రాయగలిగిన వారందరికీ ఇదే మా ఆహ్వానం! మీ రచనల్ని వీలైనంత త్వరగా పంపించండి. అక్టోబర్‌ 15 లోగా పంపిన రచనలన్నీ ప్రచురణకి పరిశీలించబడతాయి.

ఈ సంచికలో హాస్య, వ్యంగ్య రచయితగా ఎంతో కాలంగా మనల్ని అలరిస్తున్న శ్రీ కవన శర్మ గారి రచన ఒకటి అందిస్తున్నాం. వేరే పని మీద అమెరికాకి వచ్చి మేం అడగ్గానే ఆనందంగా దీన్ని ఇచ్చిన శ్రీ శర్మ గారికి మా కృతజ్ఞతలు. శ్రీ శర్మ గారి అమెరికా ప్రయాణం గురించి తెలియజేసి వారితో పరిచయానికి కారకులైన శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారికి మా అభివాదాలు.

అలాగే, కర్ణాటక సంగీతంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో మేం జరిపిన సంభాషణని ఈ సంచికలో ఇస్తున్నాం. వారితో పరిచయం కలిగించిన శ్రీ కొడుకుల శివరాం గారికి మా కృతజ్ఞతలు. మాకు తెలియని ఎన్నోవిషయాలు వివరించారు వారు. “ఈమాట” పాఠకులకు కూడ అవి ఆసక్తికరంగా ఉంటాయని మా విశ్వాసం.

ఇక అమెరికా సాహిత్య రంగంలో బహుముఖ ప్రజ్ఞా శాలులుగా మనందరికీ పరిచయమైన శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు, శ్రీమతి మాచిరాజు సావిత్రి గార్ల కథలు , ఇంకా ఎన్నో ఇతర రచనలు అందిస్తున్నాం. అందరూ ఆదరిస్తారనీ, ఆనందిస్తారనీ ఆశిస్తున్నాం.
 
 

 

త్రిశంకు లోకం

రచన: వేమూరి వేంకటేశ్వర రావు

(వేమూరి వేంకటేశ్వర రావు గారు ఈమాట పాఠకులకు వ్యాసరచయితగా చిరపరిచితులు. ఆంధ్రప్రభ లాటి పత్రికల పాఠకులకు పాప్యులర్‌ సైన్స్‌ రచయితగా, సైన్స్‌ ఫిక్షన్‌ రచయితగా […]

2

ఒక తల్లి గొడవ

రచన: ఎస్‌. నారాయణస్వామి

(ఎస్‌. నారాయణస్వామి (నాసీ) గురించి పాఠకులకి పరిచయం చెయ్యక్కర్లేదు. చిత్తశుద్ధితో అమెరికా జీవితాన్ని, అనుభవాల్ని, అనుభూతుల్ని కథలుగా మలుస్తున్న నాసీ ఇక్కడా, ఇండియాలోనూ విస్తృతంగా […]

2

నిమ్మకాయలు

రచన: మాచిరాజు సావిత్రి

(మాచిరాజు సావిత్రి గారు అమెరికా రచయిత్రులలో అగ్రగణ్యులు. వీరి కవితాసంకలనం ఒకటి పుస్తకరూపంలో వెలువడింది. కథానికా రచనలో కూడ సిద్ధహస్తులు. ఆంధ్రుల అమెరికా జీవనానికి […]

1

ప్రతీకారం

రచన: కె. వి. ఎస్. రామారావు

చాలా ఆర్భాటంగా, హడావుడిగా జరిగిపోయింది వాళ్ళ పెళ్ళి. రెండు వైపుల వాళ్ళూ మారుతోన్న ఎకానమీని నాలుగు చేతులా పిండుకుని దండిగా సంపాయించిన కొత్తరకం ధనవంతులు. […]

2

తమాషా దేఖో 3

రచన: కనకప్రసాద్

(క్రితం భాగం కథ వర్ధమాన హోంబిల్డర్‌ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం […]

0

“సంగీత కళానిధి” శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో ముఖాముఖీ

రచన: నేదునూరి కృష్ణమూర్తి

(కర్ణాటక సంగీతంతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారిని పరిచయం చెయ్యవలసిన పనిలేదు. శాస్త్రీయ సంగీతంలో విశేషకృషి చేసి, గాయకుడిగా, స్వరకర్తగా […]

1

కొత్త పదకేళి

రచన: సోమయాజుల కాశీ విశ్వనాధం

పదకేళి (కాశీ విశ్వనాథం గారు యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌లో పనిచేస్తారు. సాహిత్యం, సంగీతం, కూచిపూడి నాట్యాల్లో అభిరుచి, ప్రవేశం ఉన్నవారు.) కొన్ని తెలుగు పదాలు […]

0

సంగమం

రచన: విన్నకోట రవిశంకర్

(విన్నకోట రవి శంకర్‌ కవిగా లబ్ధప్రతిష్టులు. ఈమాట పాఠకులకు చిరపరిచితులు. “కుండీలో మర్రిచెట్టు” వీరి తొలి కవితాసంకలనం. మరో సంకలనం ప్రచురణకు సిద్ధంగా ఉంది. […]

0

పాలు తాగిన వినాయకుడు

రచన: కవన శర్మ

(కవన శర్మ గారు ముప్ఫై ఏళ్ళ పైగా కథలు, నవలలు, వ్యాసాలు రాస్తున్నారు. వీరి “బ్రెయిన్‌ డ్రెయిన్‌ అను అమెరికా మజిలీ కథలు”, రాసి […]

3
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.