తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపధ్యం. ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు. సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు. భావుకుడిలా అనుభవిస్తారు.కవిలా వ్యక్తీకరిస్తారు.

ఈ లోయ సౌందర్యంచూస్తోంటే ఉన్నపళంగా అమాంతం ఇందులోకి దూకేయాలనిపిస్తోంది. కాసేపటికి ఈ ఆకుపచ్చ లోయలోంచే పక్షిలా అలా గాల్లోకి ఎగురుతూ రాగలనేమో అని కూడా అనిపిస్తోంది.