కొత్త పదకేళి

(కాశీ విశ్వనాథం గారు యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌లో పనిచేస్తారు. సాహిత్యం, సంగీతం, కూచిపూడి నాట్యాల్లో అభిరుచి, ప్రవేశం ఉన్నవారు.)

పదాలలో పదాలు దాక్కోవటం ఒక విశేషము
ఒక రకమైన ఇలాంటి పదాల్లో
పదము లోని అక్షరాలలో, వరుసలో ఉన్న ఏ రెండు ఆక్షరములు తీసుకున్నా, అర్ధవంతమైన పదం ఔతుంది.
ఉదాహరణకు మ ర ణం
మ ర యంత్రము
ర ణం యుద్ధము

క్రింది క్లూలతో ఈ రకంగా ఉన్న తెలుగు పదాలు కనుక్కోండి

ఇల్లు
వ్యధ
పరిమాణము
ఆడ తుమ్మెద
లోతైన మనసు
ఒక దైవసన్నిధి

ఇటువంటి పదాలు మీరు కూడా మరికొన్ని కలపండి !

క్రిందటి ఈమాట పద కేళి సమాధానం

ఇచ్చిన సమస్య

ఒక ఐదు ఆక్షరాల పదం కనుక్కోవాలి. దీన్లో మూడేసి అక్షరాలు ఇచ్చిన వరసలో కలిస్తే వచ్చే పదం అర్థం ఎలాటిదో ఇప్పుడు ఇవ్వబడుతోంది. వాటిని బట్టి ఈ ఐదక్షరాల పదం ఏదో కనుక్కోండి!

2 3 5 గణిత సంబంధము (అంటే రెండో అక్షరం, దాని తర్వాత మూడో అక్షరం, దాని తర్వాత ఐదో అక్షరం కలిసి వచ్చే పదం గణిత సంబంధమైందన్న మాట; మిగిలినవి అన్నీ ఇలాగే).
1 4 5 శరీర సంబంధము
4 3 5 నాద సంబంధము
4 1 5 విభాగ సంబంధము
1 2 5 విద్యార్థి సంబంధము
3 4 5 దైవ సంబంధము
1 3 2 సమాన సంబంధము

సమాధానం

కలవరము.
1. 235 గణిత సంబంధము ల వ ము
2. 145 శరీర సంబంధము క ర ము
3. 435 నాద సంబంధము ర వ ము
4. 415 విభాగ సంబంధము ర క ము
5. 125 విద్యార్థి సంబంధము క ల ము
6. 345 దైవ సంబంధము వ ర ము
7. 132 సమాన సంబంధము క వ ల

పదకేళి ముడి విప్పిన వారు

శ్రీరామ్‌ చిట్టా
రామభద్ర డొక్కా, అట్లాంటా (మిగిలిన వారు ఊరిపేర్లు ఇవ్వలేదు)
రంగా ఇలపావులూరి
రజనీకాంత్‌ కొనతలపల్లి

వీరికి మా శుభాకాంక్షలు

కాశీవిశ్వనాధం సోమయాజుల

మీ సమాధానాలు kasi_emaata@hotmail.comకు పంపంచండి. విజేతల పేర్లు,సమాధానాలతో పాటు వచ్చే సంచికలో ప్రకటించబడును.