చంటోడికి వారం రోజులుగా ఒళ్ళు పెనంలా కాలిపోతోంది. గవర్నమెంటు ఆసుపత్రిలో డాక్టరు చూసి ఏవో మందులిచ్చాడు కానీ జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిపోతూ ఉంది. మళ్ళీ తీసుకెళితే వేరే మందులేవో రాసిచ్చాడు. డిస్పెన్సరీలో అడిగితే, అవి ఖరీదైన మందులనీ, స్టాకులో లేవు, రెండు రోజులు పోయాక వస్తాయనీ చెప్పారు. కానీ అక్కడ తెలిసిన విషయమేమిటంటే, స్టాకులో కొంత మందు ఉందనీ, నాలుగు డబ్బులు చేతిలో పెడితే కానీ ఆ మందును ఇవ్వరనీను. వెంకటలక్ష్మి వాలకం డబ్బులిచ్చేలా లేకపోవడంతో, డబ్బులివ్వగలిగే పేషెంట్ల కోసం మిగిలిన కొద్ది స్టాకునూ అట్టేపెట్టి వీళ్ళని మళ్ళీ రమ్మన్నారు.