ప్రజల పాట, ప్రజల బాధ, ప్రజా ఉద్యమానికి ఇంతకన్నా పెద్ద కవిత్వం ఇంకేం ఉంటుంది? శివసాగర్ ప్రతీ కవిత వెనుకా ఒక నేపథ్యం ఉంది, ఒక వీరుడి మరణమో విజయమో ఉంది, ఒక ఆకలి బాధ ఉంది. ఏ పలుకూ ఊహామాత్రం కాదు, మరే పోలికా సత్యదూరం కాదు. ఒక్క కవిత కూడా జనసామాన్యపు నాల్కలమీద ఆడటానికి ఇబ్బందిపడిందీ లేదు.
నరేష్కుమార్ సూఫీ
- సొంత ఊరు
- గోదావరి ఖని
- ప్రస్తుత నివాసం
- హైదరాబాద్
జీవిత విశేషాలు
నరేష్కుమార్ సూఫీ, కవి సంగమం రచయితలలో ఒకరు. ఈయన రచనలు, వ్యాసాలు వన్ ఇండియా, భూమిక, సారంగ, అవని న్యూస్, రస్తా మొదలైన ఆన్ లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అలాగే పలు పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు.