రొండేళ్లగా నా బుర్రలో తిరగతా వుండాడు గూనోడు. వోణ్ణి కతగా మార్చాలని ఆరేడు నెల్లగా తపన పడతా వుండా. కుదరడం ల్యా. … అయినా నా పిచ్చిగానీ, వోడి బతుకులో కై గట్టాల్సినంత కతేడ వుండాది… దోసిడు కన్నీళ్ళు దప్ప!
చిట్టత్తూరు మునిగోపాల్
- సొంత ఊరు
- తిమ్మసముద్రం (శ్రీకాళహస్తి సమీపం, ఉమ్మడి చిత్తూరు జిల్లా)
- ప్రస్తుత నివాసం
- కుప్పం, చిత్తూరు జిల్లా
- వృత్తి
- జర్నలిజం
జీవిత విశేషాలు
పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం: తిరుపతి జిల్లా), చదివింది శ్రీకాళహస్తి. ప్రస్తుత నివాసం చిత్తూరు జిల్లా కుప్పం. ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిత్వం. సాహిత్యమంటే మక్కువ ఎక్కువ. కథలు రాయడం ఈమధ్య మూడునాలుగేళ్లనుంచే. ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల ఆదివారం ప్రత్యేక అనుబంధాలు, సారంగ, ఈమాట, నెచ్చెలి, సంచిక, కౌముది, గోతెలుగు. కామ్ వంటి ప్రముఖ వెబ్ పత్రికల్లో ఇప్పటిదాకా సుమారు 15 కథలదాకా ప్రచురితం.