ఐదేళ్ళ కిందట ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లందరూ కలిపి కట్టుకున్న హౌసింగ్ సొసైటీలో మాకు పై అంతస్తు అలాట్ అయింది. చెప్పకేం! సంతోషంగానే అనిపించింది. వంటింటి పక్కనుంచి డాబామీదకి వెళ్తే, చిన్నదే అయినా, పనివాళ్ళకోసం కట్టించిన ఒక గది, బాత్రూమ్ అదనంగా దొరికాయి. మేమున్న గవర్నమెంటు ఇల్లు ఎంత విశాలంగా, ఎన్ని వసతులతో ఉన్నప్పటికీ ఇది స్వార్జితంతో కట్టుకున్నది.
కృష్ణ వేణి
- పూర్తిపేరు
- శ్రీనివాసుల కృష్ణ వేణి చారి
- సొంత ఊరు
- ఢిల్లీ
- ప్రస్తుత నివాసం
- బహాదూర్ గఢ్
జీవిత విశేషాలు
ఢిల్లీలో పుట్టి పెరిగిన కృష్ణవేణి గారు చక్కటి కథలు రచించారు. మొదటి కొన్నేళ్లు ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, Familyradio.org అనే కంపెనీ కి మారారు. సాక్షి పత్రికలో రెండేళ్లపాటు అనేక పుస్తకాలను పరిచయం చేశారు.