నాకిప్పటికీ గుర్తు. చిన్నప్పుడోసారి బాగా వర్షం పడింది. ఆ తరవాత గాలి కూడా వచ్చింది. ఆ రాత్రంతా ఆ రాయి పడిపోతుందేమో అని నిద్రలో ఉలికులికిపడి లేస్తూనే ఉన్నాను. పొద్దున్నే లేచి భయంభయంగా చూస్తే ఆ రాయి అలానే ఉన్నది. ఆ రోజు నేను తాగుతున్న చాయ్ చప్పగా అనిపించింది… ఒకసారి భూకంపం వచ్చినప్పుడు మా గుట్టలో ఇళ్ళు కొన్ని కదిలిపోయాయి గాని, ఆ రాయి మాత్రం అలానే ఉంది.
అపర్ణ తోట
- సొంత ఊరు
- హైదరాబాద్
జీవిత విశేషాలు
బహుముఖ ప్రజ్ఞాశాలి అపర్ణ తోట తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రచించే రచయిత్రి, సామాజిక కార్యకర్త, gender trainer. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో చురుకుగా ఉంటారు, “జెన్నీ” వంటి రచనలకు ప్రసిద్ధి చెందారు. వీరి పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.