రెంటాల జయదేవ

రెంటాల జయదేవ

జీవిత విశేషాలు

డా. రెంటాల జయదేవ్ గారు తెలుగు సినిమా పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా సుపరిచితులు. పండితుల కుటుంబంలో జన్మించిన ఆయన, తెలుగు సినిమాకు ఒకప్పటి రాజధాని లాంటి విజయవాడలో పెరిగారు. ఏ సంస్థ అండ లేకుండా, తన సొంత ఖర్చులతో ఎంతో కష్టపడి ఆయన చేసిన నిస్వార్థ కృషి వల్ల తెలుగు సినిమా చరిత్రలోని ఎన్నో కీలకమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రచయిత, సీనియర్ జర్నలిస్ట్, ఉత్తమ సీనివిమర్శకునిగా నంది అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. డాక్టర్ రెంటాల జయదేవ ఈనాడు దినపత్రికలో జర్నలిస్ట్‌గా జీవితం ప్రారంభించి అనతికాలంలోనే ముఖ్య బాధ్యతలను నిర్వహిస్తూ, ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ పత్రికలలో పనిచేస్తూ, ప్రస్తుతం సాక్షి సంపాదకవర్గంలో కీలకపాత్రను పోషిస్తున్నారు.

రెంటాల జయదేవ రచనలు