భైరప్పగారి వ్యక్తిగత అభిప్రాయాలను తీవ్రంగా విమర్శించేవారు కూడా ఆయన సృజన శక్తిని, విషయాలను లోతుగా పరిశీలించే ప్రామాణికతను, పాత్రలను విశ్లేషణాత్మకంగా చూచే విధానాన్ని కాదనలేరు. చెప్పదలచుకున్న దాన్ని ప్రామాణికంగా చెప్పే గుణం ఆయనది.
రాళ్ళపల్లి సుందరం
- పూర్తిపేరు
- రాళ్ళపల్లి వెంకట సుబ్బు సుందరం
- ఇతరపేర్లు
- ఆర్వీయస్.సుందరం, R.V.S.Sundaram
- సొంత ఊరు
- నెల్లూరు
- ప్రస్తుత నివాసం
- మైసూరు, కర్నాటక
- వృత్తి
- విశ్రాంత తెలుగు ఆచార్యులు
- ఇష్టమైన రచయితలు
- తిక్కన,వేమన,శ్రీశ్రీ
- హాబీలు
- బోధన, రచన, సంగీతం, క్రికెట్, ఇంద్రజాలం
జీవిత విశేషాలు
రాయటం మొదలుపెట్టి సుమారు 60 ఏళ్ళు. రాసింది తెలుగు, కన్నడం, ఇంగ్లీషుల్లో 110 పుస్తకాలు. పెక్కు పరిచయాలు, దేశవిదేశ యాత్రలు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన.