నవల, చలనచిత్రం రెండూ విభిన్నమైన ప్రక్రియలు. ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చటమనేది ఒక పెద్ద అధ్యయన విషయం. దాన్ని పట్టించుకోకుండా ఏదో ఒకలాగా తీసెయ్యటమే చిత్ర వైఫల్యానికి మూలకారణం. ఆ నవలలో చిత్రంగా తీయటానికి అనువుగా ఉన్న విషయాలను సస్పెన్స్, రాజకీయ వ్యూహాలు, గొప్ప చారిత్రక వైభవం, నాటకీయ పరిణామాలు వంటి విషయాలు అన్నింటినీ చిత్రంలో వదిలేశారు.