ఆ మాట నందినికి గుర్తుండిపోయింది. అమెరికాలో తను స్వతంత్రంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకుంటుంది, సమస్యలు తనే చూసుకుంటుంది. ఇంట్లో మాత్రం లలిత ఒక ప్రత్యేకమైన స్వరంతో ‘నందినీ’ అని పిలిస్తే, క్షణాల్లో పదిహేడేళ్ల అమ్మాయిగా మారిపోతుంది. ఒక దేశం దాటితే మనిషి మారిపోవచ్చు. ఒక గది దాటితే మళ్లీ పాత మనిషి అయిపోవచ్చు.
కృతి శ్రీపెరంబుదూరు
- పూర్తిపేరు
- శ్రీ లక్ష్మి కృతి శ్రీపెరంబుదూరు
- ఇతరపేర్లు
- కృతిపర్ణ
- సొంత ఊరు
- హైదరాబాద్
- ప్రస్తుత నివాసం
- షికాగో, అమెరికా
- వృత్తి
- దంతవైద్యం. హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ లో స్నాతకోత్తర పట్టా
- ఇష్టమైన రచయితలు
- శ్రీశ్రీ, త్రిపురనేని గోపీచంద్, ఓల్గా, తాపీ ధర్మారావు. జేన్ ఆస్టిన్, మిచ్ ఆల్బమ్, హాన్ కాంగ్
- హాబీలు
- చదవడం, రాయడం, సినిమాలు ప్రకృతి
జీవిత విశేషాలు
చిన్నప్పటినుంచీ పుస్తకాలు చదవడమక్కువ ఉన్న కృతి శ్రీ గారికి మనుషుల మాటల్లో, వాళ్లు చెప్పకుండా వదిలేసే విషయాల్లో కథలకు మొదలు దొరుకుతుందని అనిపిస్తుంది.