విషయ సూచి
కవితలు
నిద్ర - మూలా సుబ్రహ్మణ్యం
చుక్కల పరుపుపై
మబ్బుల దుప్పటీ కప్పుకుని
చంద్రుడు
మిడిల్ డ్రాప్ - వెల్చేరు నారాయణరావు
అమ్మాయిల మనస్సుల్లా పక్కవాడి ఆట అర్థం కావడం లేదు
అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలవాడి చేతిలో చిక్కింది
వైరుధ్యం - వి. ఆర్. విద్యార్థి
జ్ఞాపకముందా?
చిన్నప్పుడు అమ్మ వేలు పట్టుకుని నువ్వు నడుస్తున్నప్పుడు
భూమ్మీద పరుచుకున్న వర్షపు నీటి అద్దాలు నీలి మైదానాలైతే
ఆ నీలి మైదానాల్లో పరుగెత్తే మబ్బు పిల్లలతో ఉరుకుడు పందెం కాచి
బొక్కాబోర్లాపడి తడిసిపోయింది
శాన్‌ఫ్రాన్‌సిస్కో - సాయి బ్రహ్మానందం గొర్తి
ప్రకృతి వికృతుల్ని
సమతుల్యంగా మోసే
స్వేచ్ఛ భుజమ్మీద
సప్తవర్ణాల పచ్చబొట్టు
ద్వంద్వాలు - యోగానంద్ సరిపల్లి
సుడి రేగి కుదిపేస్తోంది,
వేరు వదలకుంది!
మధ్యలో-
చెట్లు విరిగిపోతున్నాయి...
కథలు
Make Peace - మొదటి భాగం - కనక ప్రసాద్
"దిస్సీజ్ మై వొయిఫ్ .... అన్నమేరి! అవర సన్ మేక్ పీస్!" అన్నాడు. అలాగే మర్యాదగా ముభావంగా నవ్వి "నమస్తే ఆంటీ!" అని, అంతలోకే తను తప్పు విందేమోనని సందేహంగా "బాబు పేరేంటంకుల్ ?" అంది. ఆయన పెద్ద పెట్టె, చిన్న పెట్టె రెండు చేతుల్తో ఎత్తి పట్టుకున్న కష్టం నిగ్రహించుకుంటూ "మేక్ పీస్ " అనే అన్నాడు మళ్ళీ.
కేసు - విప్లవ్
ఈ ఇప్లవం అనేటోళ్ళను జెయిల్ల పెడితె నా కొడుకు రాడు. ఆళ్ళు ఇప్పుడు చెప్పినట్టే ఒక మనిషిని చంపితే ఇప్లవానికి పనికొస్తది అని చెప్పకుండా ఆగరు.
నువ్వు నాకొద్దు - లైలా యెర్నేని
ఐతే డాక్టర్ షామల్ , డేవిడ్ ఆర్థర్ "చచ్చినా బట్టలు మాత్రం విప్పేది లేదు . నీతో పరీక్ష చేయించుకునేది లేదు" అన్నాడు.
మార్పు - నోరి రాధిక
ప్రేమ వివాహాల్లో ఒకరంటే ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసునని ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉందని ఆ ప్రేమ వలన ఏ త్యాగమైనా చేయటానికి ఎదుటివారు అనుక్షణం సిద్ధంగా ఉంటారని ఆశిస్తారు. అవన్నీ నిజం కాదన్న చేరు రుచి తెలియగానే, ఇదిగో, మీ ఇద్దరిలాగే తలక్రిందులౌతారు.
వ్యాసాలు
శిలాంతరాళలోలిత రేవతీదేవి - కొడవళ్ళ హనుమంతరావు
కొత్త గొంతుకతో శిలా హృదయాల్ని కదిలించే గీతాల్ని సృజించి, తెలుగు నవలా సాహిత్యంలో ఒక మణిరత్నానికి కారకురాలయిన "శిలాలోలిత" రేవతీదేవి
తెలుగుదనం - వేలూరి వేంకటేశ్వర రావు
తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది.
హిందూస్తానీ సంగీతం - డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
హిందూస్తానీ గాత్రంలో విలంబిత్ ఖయాల్ విన్న తెలుగువాళ్ళు కొందరు "ఇదేమిట్రా, పులితేన్పు లొచ్చినట్టుగా పాడుతున్నాడూ?" అంటారు.
తెలుగు సినిమా? తెగులు సినిమా? - డా. పూడిపెద్ది శేషు శర్మ
మంచి సినిమా అంటే ఉన్నత భావాలను ప్రేరేపించేటట్టు ఉండాలి. కాని ఈ నాటి తెలుగు సినిమా ప్రేరేపించేది చాలా మట్టుకు నీచ భావాలే.
తెలుగు భాష వయస్సెంత? - సురేశ్ కొలిచాల
తెలుగుభాష గురించి చాలామంది భాషావేత్తలు ఒప్పుకునే వివరాలను నాకు తెలియవచ్చినంత తేటపరచాలని ఈ వ్యాసరచనా సాహసానికి పూనుకున్నాను.