ద్వంద్వాలు

యోగానంద్ సరిపల్లి

గాలి రమ్మంటుంది,
కొమ్మ వదలకుంది!
మధ్యలో-
ఆకులు అల్లాడుతున్నాయి...

సుడి రేగి కుదిపేస్తోంది,
వేరు వదలకుంది!
మధ్యలో-
చెట్లు విరిగిపోతున్నాయి...

అరుణోదయం కావస్తోంది,
చీకటే వదలకుంది!
మధ్యలో-
సందేహాలు అలుముకున్నాయి...

స్వేచ్ఛ ఉదయించింది,
గదిలోకి రాలేకుంది!
మధ్యలో...
కిటికీ ఊసల మెరుపులో-
బందీ విలపిస్తున్నాడు...

దేహం అలసిపోయింది,
ప్రాణం విసిగిపోయింది,
కోరికే తీరకుంది!
ఈ ఆగని పయనం-
ఆది, అంతం మధ్యలో, మిధ్య లో...
చిక్కుకు పోయింది...

10-03-05

ఆఖరి చరణంలో: మధ్య లో, మిధ్యలో అన్న వాడుక నేను "అన్వేషి" అనే ఒక రచయిత బ్లాగు లో చదివా...