అనుభూతి
-- పద్మలత అయలసోమయాజుల
అది
అచ్చెరువు గొల్పు
మహదానందపు
ఉద్యానవనము లోపలి
వినూత్న ప్రాకార లోకంబువేల కాంతుల
చైతన్యపు ప్రవాహంబు
ఉత్సాహపు వెల్లువ
చరాచర సృష్టికీ ఆది బిందువునీ నా దృష్టికందక
భాష పలకని
ఊహాతీతపు
ప్రపంచపు మొదలుఆ అద్భుతం ఇమడని
కంటి పాప
అద్దమై
నేను అద్భుతమైపోయి యుంటిఅది కాంచిన నేను
మరణించి
మరల జీవించి
మరణించి యుంటిఅది
చెప్ప బల్కిన నేను
ఆనంద లోయలో
అడ్డుతో ఆపువారు లేక
ఉన్నపాటుగా
చెట్టు ఆకులా రాలిపోతి